Annamayya News: అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాల్సిన వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులకు భయపడే దంపతులు ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మదనపల్లిలో ఈ విషాదం జరిగింది. సివిల్ కేసులో పోలీసులు జోక్యం చేసుకుని వృద్ధ దంపతులను ఇబ్బందులకు గురి చేశారన్న విమర్శలు వస్తున్నాయి. కుటుంబ ఆస్తి పంపకాల విషయంలో పోలీసులు తలదూర్చారని వారికి భయపడే వృద్ధులు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న ఆరోపణలు వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
అన్నమయ్య జిల్లా తంబళ్లప్లలి మండలం, మొరుసుపల్లి బురుజు గుట్టపాలెంకు చెందిన నర్సింహులు నాయుడు(70), అతని భార్య వెంకట సుబ్బమ్మ(60) లు ప్రస్తుతం మదనపల్లి పట్టణం అనుపగుట్టలో నివాసం ఉంటున్నారు. నర్సింహులకు ఆయన తమ్ముడు అప్పళ్లకు మధ్య కొన్ని రోజులుగా ఆస్తి తగాదా నడుస్తోంది. ఈ విషయంపై పోలీసులు నర్సింహులకు, అతని భార్యకు ఫోన్ చేసి స్టేషన్ కు రావాలని పిలిచినట్లు సమాచారం. పోలీసులు రమ్మని పిలవడంతో భయపడిన వృద్ధ దంపతులు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
Also Read: Hyderabad News: ఫ్రెండ్ రూంకి వెళ్లిన లవర్స్! కాసేపటికి అదే గదిలో ఉరేసుకుని ఆత్మహత్య
సిద్దిపేటలో ఆత్మహత్య చేసుకున్న వృద్ధుడు
పొట్లపల్లికి చెందిన 90 ఏళ్ల మెడబోయిన వెంకటయ్యకు నలుగురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో ఒకరు హుస్నాబాద్ లో మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేటలో నివసిస్తున్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమారులకు పంచి ఇచ్చేశాడు. కుమారులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. వెంకటయ్యకు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. గ్రామంలోనే ఆయన పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవాడు. అయితే ఆయన పోషణ విషయంలో ఐదు నెలల క్రితం పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. నెలకు ఒకరి చొప్పున నలుగురు కుమారులు వంతుల వారిగా పోషించాలని నిర్ణయించారు. గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది.
Also Read: Siddipet News: వంతులవారీగా తండ్రిని పోషించాలని కుమారులు నిర్ణయం, కానీ ఆ వృద్ధుడు ఏం చేశాడంటే?
సొంత ఊరు, ఇంటిని వదిలి అక్కడికి తాను వెళ్లనని వెంకటయ్య చెప్పేవారు. ఈనెల 2 న మంగళవారం సాయంత్రం ఇంటి నుండి బయలు దేరిన ఆయన గ్రామంలో ఓ ప్రజా ప్రతినిధి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడ తన బాధ వెళ్లగక్కారు. 3వ తేదీన నవాబుపేటలోని మరో కుమారుడి ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, నవాబుపేట రోడ్డులో వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్య దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఘటనా స్థలంలో తాటికమ్మలను ఒక చోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మహత్యకి పాల్పడినట్లు భావిస్తున్నారు.