Adilabad Road Accidet: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి కార్నర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆటోలో 9 మంది ఉండగా అందులో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృత దేహలు మొత్తం నుజ్జు నుజ్జుగా మారిపోయాయి. మిగతా ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడ్డ ఐదుగురిని అంబులెన్సులో అదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్ర నగర్ కాలనికి చెందిన వారిగా గుర్తించారు. ఇచ్చోడలోని ఓ చర్చిలో రాత్రంతా ప్రార్థనలు చేసుకోని ఉదయం నాలుగు గంటలకు ఆటోలో అదిలాబాద్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


Also Read:ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం, కేసు నమోదు చేసిన పోలీసులు


Also Read:  విశాఖ నోట్ల మార్పిడీ కేసులో పోలీస్‌తోపాటు పొలిటికల్‌ హ్యాండ్- మేడంకు సినిమాలపైన కూడా ఇంట్రెస్ట్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial