Lorry Accident :  ప్రమాదం ఏ రూపంలో ఎప్పుడు ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. తమకు దూరంగా కనిపించిన ఆ లారీ వల్లే ప్రమాదం జరుగుతుందని ఊహించలేకపోయారు. అదుపు తప్పిన లారీ పాదచారులపై బోల్తా పడింది. లారీ కింద ముగ్గురు చిన్నారులు చిక్కుకున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లిలో ఈ ప్రమాదం జరిగింది.  


ఫోన్ కోసం రమ్మన్నాడు, వచ్చాక కొడవలితో గొంతు కోసేశాడు? గ్రామస్థుల దిగ్భ్రాంతి


చుంచుపల్లిలో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల ఉంది. అది రగదారికి కాస్త దగ్గరగా ఉంటుంది. చిన్నారులు రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్లడం సహజం. అయితే ఎప్పుడూ భారీ ప్రమాదాలు జరగలేదు. వాహనాలు రోడ్డుపై వెళ్తూంటే రోడ్డు పక్కన పిల్లలు నడుచుకుంటూ వెళ్లడం కామనే. అలా వెళ్తున్న ముగ్గురు పిల్లలు... తమ దారిన తాను పోతుందనుకున్న లారీ వారిపై బోల్తా కొట్టింది. అక్కడి వరకూ  బాగానే వచ్చిన లారీ.. ఆ పిల్లలు నడుస్తున్న ప్రాంతానికి వచ్చే సరికి ఒక్క సారిగా అదుపు తప్పింది. కాస్త అటూ ఇటూ ఊగిబోల్తా పడింది. 


నా శవాన్ని నా భర్త అస్సలు ముట్టుకోవద్దు, అదే నాకు చేసే మేలు - వివాహిత సూసైడ్ నోట్


లారీ బోల్తా పడే ప్రదేశంలోనే పిల్లలు ఉన్నారు. వారు లారీ కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్, క్లీనర్ గాయాలతో బయటకు వచ్చారు.  పిల్లలు లారీ కింద ఉన్నట్లుగా కమనిపించారు కానీ.. లారీని ఎలా కదిలించారో వారికి తెలియలేదు. ప్రమాదాన్ని చూసి చుట్టూ చేరిన వారు పిల్లలను అయినా బయటకు తీద్దామని ప్రయత్నించారు. 


ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లిలో ఇలా లారీ ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు..పోలీసులు వచ్చారు. అంతా కలిసి ఇద్దరు చిన్నారులను రక్షించారు. మరో చిన్నారి కోసం సహాయ చర్యలు చేపట్టారు. ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలు అయ్యాయి. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ దారికి సమీపంలోనే ఆశ్రమ పాఠశాల ఉన్నందున మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.