California Kid Killed:


కాలిఫోర్నియాలో ఘటన..


కాలిఫోర్నియాలో ఓ దుండగుడు నాలుగేళ్ల చిన్నారిని తల్లిదండ్రుల ముందే కాల్చి చంపాడు. చిన్నారితో పాటు తల్లిదండ్రులు కలిసి కార్‌లో వెళ్తుండగా ఓ వ్యక్తి ఉన్నట్టుండి మరో కార్‌లో దూసుకొచ్చాడు. బలంగా ఢీకొట్టాడు. ఆ తరవాత గన్‌ తీసుకుని వచ్చి కాల్పులు జరిపాడు. కార్‌లో బ్యాక్‌ సీట్‌లో ఉన్న చిన్నారి ఛాతిపై కాల్చాడు. వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. రోడ్‌పై లేన్ మార్చే సమయంలో ఆ వ్యక్తి చాలా ర్యాష్‌గా డ్రైవ్ చేశాడు. ఓవర్ టేక్ చేసి కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాస్‌ ఏంజెల్స్ కౌంటీ జైల్‌కి తరలించారు. ప్రస్తుతానికి నిందితుల పూర్తి వివరాలను బయట పెట్టలేదు. స్థానిక కాలమానం ప్రకారం...డిసెంబర్ 16న రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తల్లిదండ్రులకు ఎలాంటి గాయాలు కాలేదు. 


"బాధితులు ప్రయాణిస్తున్న కార్‌ని నిందితులు ఓవర్ టేక్ చేశారు. అక్కడి నుంచి ఫాలో అవుతూ వచ్చారు. చాలా దూరం వరకూ వెంటాడారు. వాళ్లు ఫాలో అవుతున్నారని తెలిసి ఆ కార్ డ్రైవర్ కాస్త స్లో చేశాడు. ఆ సమయంలోనే గన్ తీసి నిందితుడు కాల్పులు జరిపాడు. ఆ సమయంలోనే కార్‌లో వెనక సీట్‌లో కూర్చున్న చిన్నారి ఛాతిలోకి బులెట్ దూసుకుపోయింది. తల్లిదండ్రులు వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చనిపోయాడు"


- పోలీసులు