Vande Bharat Sleeper Train: వందేభారత్‌ రైళ్లు... అత్యాధునిక సౌకర్యాలతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. ప్రయాణ గంటలను తగ్గించడమే కాకుండా...  జర్నీలో ఇబ్బంది లేకుండా అత్యాధునిక సౌకర్యాలు ఆ రైళ్లలో ఉన్నాయి. ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ఆ రైళ్లను అప్‌గ్రేడ్‌ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.  ఇప్పుడు వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లను కూడా అందుబాటులోకి తెస్తోంది. మార్చి, 2024లోనే.. వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ రైళ్లను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది రైల్వే  శాఖ. వందేభారత్‌ స్లీపర్‌ క్లాస్‌ రైళ్లను... ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్ల కంటే మరింత అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. కొత్త హంగులతో పట్టాలెక్కించబోతున్నారు. 


వందే భారత్ రైళ్లు.. అతి తక్కువ సమయంలో మంచి ప్రజాధరణ పొందాయి. అందుకే వీటిలో స్లీపర్ క్లాస్ రైళ్లను అందుబాటులోకి తెస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ రైళ్లను  చెన్నైలోని ఐసీఎఫ్‌లో తయారు చేస్తున్నారు. వందేభారత్ స్లీపర్ రైళ్లు ఇప్పటికే సిద్ధమయ్యాయి... పట్టాలెక్కేందుకు రెడీగా ఉన్నాయి. విజయవాడ డివిజనకు కూడా రెండు  రైళ్లను కేటాయించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ట్రైల్ రన్ కూడా నిర్వహించబోతున్నారు రైల్వే అధికారులు. 


వందేభారత్‌ స్లీపర్‌ క్లాస్‌ రైళ్లను.. అబ్బుర పరిచేలా డిజైన్‌ చేసేందుకు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించారు. స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణికులు సులువుగా పైబెర్తులకు  ఎక్కేలా డిజైన్ చేశారు. వందేభారత్‌ స్లీపర్‌ క్లాస్‌ రైళ్ల మొత్తం 857 బెర్తులు ఉంటాయి. వాటిలో 37 బెర్తులను సిబ్బంది, ప్యాంట్రీకార్ సిబ్బందికి కేటాయించారు. బెర్తులు మరింత  వెడల్పుగా... విశాలంగా ఉండేలా డిజైన్ చేశారు. ప్రతి బోగీలో మూడు మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇపుడున్న రైళ్లతో పోలిస్తే... పూర్తి స్థాయిలో మార్పులు చేశారు. బోగీల్లో  లైటింగ్‌, బెర్తులు అన్నీ అత్యాధునికంగానే డిజైన్‌ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా జర్నీ సమయంలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వందేభారత్‌ స్లీపర్‌ క్లాస్‌  ట్రైన్‌కు సంబంధించిన కొన్ని ఫొటీలను ఇటీవల విడుదల చేసింది రైల్వే శాఖ. ఆ ఫొటోలను రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఆ ఫొటోలు  చేస్తేనే అర్థమైపోతుంది... వందేభారత్‌ స్లీపర్‌ క్లాస్‌ రైళ్లను ఎంత అత్యాధునికంగా రూపొందించారో. బోగీలు.. బెర్త్‌లు.. అన్నీ వాహ్వా అనిపిస్తున్నాయి. ఇప్పుడే వందేభారత్‌ స్లీపర్‌ ట్రైన్‌ ప్రయాణించేయాలి అన్నంత ఆసక్తి కలిగిస్తున్నాయి. దివ్యాంగులకు కూడా అనుకూలంగా బోగీల్లో ప్రత్యేకంగా ర్యాంపులు ఏర్పాటు చేశారు. ఇప్పుడున్న రైళ్లతో పోలిస్తే నమూనాలో కూడా పూర్తి స్థాయిలో మార్పులు చేశారు.  


ఇక... విజయవాడ డివిజన్‌కు కూడా రెండు రైళ్లు కేటాయించే అవకాశం ఉంది. దీంతో.. అందుకు సరిపడా కసరత్తు చేస్తున్నారు రైల్వే అధికారులు. ఇప్పటికే డివిజన్  వ్యాప్తంగా పట్టాల పటిష్టతను పెంచారు. సాధారణ రైళ్లు రద్దు చేసి మరీ... నిర్వహణ పనులు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి వందేభారత్‌ స్లీపర్‌ క్లాస్‌ రైళ్లను  పట్టాలెక్కించాలని కేంద్రం భావించింది. అయితే పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తుండటంతో... ఎన్నికల కోడ్‌ కంటే ముందే ఈ రైళ్లను అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తోంది.  అంటనే... మార్చి కంటే ముందే... వందేభారత్‌ స్లీపర్‌ రైళ్లు పట్టాలెక్కుతాయి.