Road Accident: ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్ - 12 మందికి గాయాలు, కి.మీ మేర నిలిచిన వాహనాలు

Telangana News: కొత్తగూడెం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Continues below advertisement

Oil Tanker Collided RTC Bus In Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో ఆర్టీసీ బస్సును ఓ ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలు కాగా.. కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం (Khammam) డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం వైపు బయలుదేరింది. ఈ క్రమంలో అటు నుంచి వస్తోన్న ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. సత్తుపల్లి మండలం కిష్టారం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు క్షతగాత్రులను సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆయిల్ ట్యాంకర్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను స్థానికుల సాయంతో బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో సుమారు కి.మీ మేర వాహనాలు నిలిచిపోగా.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ పునరుద్ధరించారు.

Continues below advertisement

Also Read: Hyderabad News: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్ బ్యాగు తనిఖీ చేయగా షాక్, భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

Continues below advertisement
Sponsored Links by Taboola