Zomato Share Price: ఫుడ్ డెలివెరీల ద్వారా రకరకాల రుచులను ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే జొమాటో, మొట్టమొదటిసారి లాభాలను రుచి చూసింది. మార్చి క్వార్టర్ వరకు నష్టాల్లో కొట్టుమిట్టాడిన కంపెనీ, జూన్ క్వార్టర్‌లో తొలిసారి లాభాలను ప్రకటించింది. జొమాటో ప్రకటించిన Q1 నంబర్లతో ఆ స్టాక్ మీద మార్కెట్‌లో బాగా ఇంట్రెస్ట్ పెరిగింది.
ఇవాళ (శుక్రవారం, 04 ఆగస్టు 2023) మార్కెట్ స్టార్ కాగానే ఇన్వెస్టర్లు జొమాటో షేర్లను పట్టుకోవడానికి పరిగెత్తారు. దీంతో, NSEలో, ఓపెనింగ్ ట్రేడింగ్‌లో దాదాపు 5.25 కోట్ల షేర్లు చేతులు మారాయి, స్టాక్ ధర 8% పైగా పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి రూ.93.65 కి చేరుకుంది.
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో, జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 2 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 186 కోట్ల లాస్ వచ్చింది. ఈ సంవత్సరం మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.189 కోట్ల నష్టాన్ని చవి చూసింది. ఇప్పుడు, నష్టాల గండం నుంచి బయటపడి లాభాలు కళ్లజూసింది. 2023 జూన్ క్వార్టర్‌లో కంపెనీకి రూ. 2,416 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నివేదించిన రూ. 1,414 కోట్లతో పోలిస్తే రెవెన్యూ దాదాపు 71% పెరిగింది. B2B సెగ్మెంట్ అయిన హైపర్‌ప్యూర్ రెవెన్యూ రూ. 273 కోట్ల నుంచి (YoY) రూ. 617 కోట్లకు జంప్ చేసింది. జొమాటో సబ్సిడియరీ, ఇన్నాళ్లు మాతృసంస్థను వెనక్కు గుంజుతున్న బ్లింకిట్ ఆదాయం కూడా Q1లో రూ. 164 కోట్ల (YoY) నుంచి రూ. 384 కోట్లకు పెరిగింది. అదే సమయంలో, కంపెనీ ఖర్చులు కూడా రూ. 1,768 కోట్ల నుంచి రూ. 2,612 కోట్లకు చేరాయి. మరో ఏడాదిలో టోటల్ బిజినెస్ ప్రాఫిట్స్‌లోకి వస్తుందని జొమాటో ఎండీ & సీఈఓ దీపిందర్ గోయల్ ధీమాగా ఉన్నారు.
జొమాటో ఫలితాల తర్వాత వివిధ బ్రోకరేజ్‌లు ఈ స్టాక్‌కు "బయ్" సిఫార్సు చేశారు. రిజల్ట్స్‌తో పాటు ఈ రికమెండేషన్స్ కూడా కౌంటర్‌లోకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చాయి.
జొమాటో స్టాక్‌పై బ్రోకరేజ్‌ల సిఫార్సులు:
జెఫరీస్ - బయ్ | ప్రైస్ టార్గెట్: రూ. 130
కంపెనీ ఎబిటా పెరుగుతుందని, ఏప్రిల్-జూన్ కాలంలో నికర లాభం తమ అంచనాలను బీట్ చేసిందని జెఫరీస్ చెబుతోంది. అందుకే స్టాక్ టార్గెట్ ప్రైస్‌ను షార్ప్‌గా పెంచి రూ. 130కి చేర్చింది. 'బయ్' రేటింగ్ కంటిన్యూ చేసింది.
నువామా - బయ్ | ప్రైస్ టార్గెట్: రూ. 110
జొమాటో Q1 FY24 ఫలితాలు ఈ బ్రోకరేజ్ అంచనాలను కూడా అధిగమించాయి. దీంతో, ఈ దేశీయ బ్రోకరేజ్, జొమాటోకు గతంలో ఇచ్చిన ప్రైస్ టార్గెట్ రూ. 94ను సవరించి, రూ. 110కి చేర్చింది, 'బయ్' కాల్ కొనసాగించింది.
నోమురా - రెడ్యూస్ | ప్రైస్ టార్గెట్: రూ. 67
జొమాటో Q1 ఆదాయాలు చూసి నోమురా మాత్రం పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఈ స్టాక్‌లో 31% నష్టాన్ని అంచనా వేస్తూ 'రెడ్యూస్' రేటింగ్ కొనసాగించింది. ఈ బ్రోకరేజ్ అంచనాలను కూడా జొమాటో బీట్ చేసినా, రెండంకెల కాంట్రిబ్యూషన్ మార్జిన్ సాధించడం ఒక సవాలుగా ఉంటుందని విశ్వసిస్తోంది.
మోతీలాల్ ఓస్వాల్ - బయ్ | ప్రైస్ టార్గెట్: రూ. 110
జొమాటో దీర్ఘకాలిక వృద్ధి అవకాశాల మీద మోతీలాల్ ఓస్వాల్ సానుకూలంగా ఉంది. అందుకే ఈ స్టాక్‌పై బయ్ రేటింగ్ కంటిన్యూ చేసింది. ఈ బ్రోకరేజ్ లెక్క ప్రకారం జొమాటో స్టాక్ ఇంకా 27% ర్యాలీ చేస్తుంది.
మరో ఆసక్తికర కథనం: బియ్యమో రామచంద్రా అంటున్న ప్రపంచ దేశాలు, USలో పరిస్థితి ఎలా ఉంది?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial