హైదరాబాద్‌కు చెందిన ఫిట్‌టెక్ కంపెనీ 'జెన్‌వర్క్' అదరగొట్టింది. స్పెక్ట్రమ్ ఈక్విటీ నుంచి రూ.1200 కోట్లను సమీకరించింది. భాగ్యనగరి కేంద్రంగా మొదలైన కంపెనీల్లో ఇదే అతిపెద్ద నిధులు సమీకరణ కావడం గమనార్హం.
డిజిటల్ పన్నులు సమర్పణ, నియంత్రణ సంస్థ వద్ద రిపోర్టింగ్ వంటి సేవలను జెన్ వర్క్ అందిస్తోంది. 'టాక్స్1099', 'కాంప్లియన్సిలీ' అనే రెండు బ్రాండ్ల ద్వారా వివిధ వ్యాపార సంస్థలు, టాక్స్ ఫర్మ్స్‌కు సేవలు అందిస్తోంది. పై రెండు సాఫ్ట్‌వేర్ వేదికలు ఆటోమేటిక్‌గా టాక్సు రిటర్న్ వంటి పనులు చేస్తాయి.
పన్ను దాఖలు, ఇతర పన్నుల రిపోర్టింగ్ వంటి పనులు అంత సులభం కావు! జెన్‌వర్క్ కస్టమర్లకు ఆధునిక, తక్కువ ధరలో సేవలు అందిస్తోంది. దేశవ్యాప్తంగా లక్ష చిన్న వ్యాపార సంస్థలు, 30వేల సీపీఏ ఫర్మ్స్, పెద్ద సంస్థలకు సేవలందిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ సంస్థ గత రెండేళ్లలో ఏడాదికి 40వేల చొప్పున కొత్త క్లైంట్లను సంపాదించుకుంది.
'స్పెక్ట్రమ్ ఈక్విటీ నుంచి రూ.1200 కోట్లు సమీకరించడం, వారితో భాగస్వాములు అవ్వడం సంతోషంగా ఉంది. మేం మరింత వృద్ధి సాధించేందుకు ఈ పెట్టుబడులు ఉపయోగపడతాయి. టాక్స్1099, కాంప్లియెన్సిలీ వేదికల్లో ఎక్కువ పెట్టుబడులు పెడతాం. ప్రతి ఒక్కరికి డిజిటిల్ టాక్స్ సమర్పణలో భాగస్వాములం అవుతాం' అని జన్‌వర్క్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు సంజీవ్ సింగ్ అన్నారు.
Also Read: Airtel Revised Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. అన్ని ప్లాన్ల ధరలూ పెంపు.. ఇప్పుడు ఎంతంటే?
Also Read: EPFO New Update: జాబ్ మారారా? పీఎఫ్ బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. మరో మార్పు చేశారు!
Also Read: Cryptocurrency Update: 2 గంటల్లో రూ.1000ని రూ.60 లక్షలుగా మార్చిన కొత్త క్రిప్టో కరెన్సీ
Also Read: Market update: ఒక్కరోజులో రూ.8లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్ పతనానికి కారణాలివే..!
Also Read: Gold-Silver Price: నిలకడగా బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ..