ఇంట్లో గోల్డ్ ఉంటే ఓ బాధ.. ఏమవుద్దోనని.. మనకీ సెఫ్టీ సమస్యే ఫస్ట్. సరే ఉంటే ఏమవుద్దిలేనని మరో ఆలోచన. కానీ ఖాళీగా బీర్వాలో బంగారాన్ని ఉంచితే ఏం లాభం చెప్పండి. అది లాకర్ కే సొంతమవుద్ది. కనీసం ఫంక్షన్స్ లో ఉపయోగించని బంగారం కూడా ఉంటుంది. అది తీయాల్సిన అవసరం రాదు. ఏ ఆరునెలలకో ఓసారి తీసి చూసుకుంటాం. ఉందా? లేదా? అని. ఇవన్నీ బాధలు పడేకంటే.. ఆర్బీఐ ప్రవేశపెట్టిన ఓ స్కీమ్ లో చేరిపోతే బెటర్. మీ బంగారం సెఫ్... దాని మీద వడ్డీ కూడా మీ జేబులోకి వచ్చి చేరుతుంది.


Also Read: రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఎందుకు ఉండాలని అంటారు? అక్కడి కల్చర్ ఏమిటీ?


ఆర్‌బీఐ అందిస్తున్న గోల్డ్  మానిటైజేషన్  లో బంగారం పెడితే మంచిది. మీ బంగారంపై రాబడి పొందొచ్చు. కనీసం 10 గ్రాముల బంగారం దగ్గరి నుంచి డిపాజిట్ చేసుకోవచ్చు. గరిష్ట పరిమితి అంటూ లేదు. ఏడాది నుంచి 15 ఏళ్ల కాల పరిమితితో మీరు గోల్డ్ డిపాడిట్ చేసే అవకాశం ఉంది. 0.5 శాతం నుంచి 2.5 శాతం వరకు వడ్డీ లభిస్తోంది. బ్యాంకుకు వెళ్లి మీరు ఈ స్కీమ్‌లో చేరొచ్చు. 


Also Read: Diabetes Skin problems: చర్మం ఇలా మారుతుందా? జాగ్రత్త, అది డయాబెటిస్ వల్ల కావచ్చు!


ఏంటీ గోల్డ్ మానిటైజేష్ స్కీమ్?


దేశంలో ప్రజల  వ‌ద్ద ఇళ్లలో నిరుప‌యోగంగా ఉన్న బంగారాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు ఆర్బీఐ ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. ఎవ‌రి దగ్గరైతే.. బంగారం ఉండి దాన్ని నుంచి ఏదో విధంగా రాబ‌డి రావాల‌నుకునే వారికి ఇది బాగా ఉంటుంది. ఈ ప‌థ‌కంలో బంగారు పొదుపు ఖాతాను తెరుస్తారు. అందులో మీ బంగారాన్ని డిపాజిట్ చేయాలి. మీ బంగారాన్ని ఆభ‌ర‌ణాలు, కాయిన్లు, క‌డ్డీల రూపంలో భద్రపరుస్తారు. బంగారు బ‌రువును బ‌ట్టి వ‌డ్డీ వ‌స్తుంది. ఇందులో స్పల్పకాలిక డిపాజిట్లు 1 నుంచి 3 ఏళ్ల పాటు, మ‌ధ్య కాలిక డిపాజిట్లు (5-7 ఏళ్లు), దీర్ఘకాలిక డిపాజిట్లు(12-15ఏళ్లు) అని మూడు ర‌కాల కాల‌పరిమితుల్లో బంగారం డిపాజిట్ చేయ‌వ‌చ్చు.


ఈ మధ్య కాలంలో  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో సహా అనేక బ్యాంకులు ఆర్‌బిఐ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్‌ను  ప్రమోట్ చేస్తున్నాయి.


Earn high interest on your idle gold. Invest in HDFC Bank Gold Monetisation Scheme earn 2.50% on Long Term Deposit and 2.25% on Medium Term Deposit.

To know more, visit: https://t.co/1LePBaX94i#GoldMonetisationScheme #HDFCBank pic.twitter.com/tU7Jr8KwbF


— HDFC Bank (@HDFC_Bank) August 7, 2021

" title="" >


 


Alsor Read: Gold Rate: పసిడి ధర పరుగులు.. పుత్తడి రేటు జిగేల్.. ఇవన్నీ సరే.. ఇంతకీ బంగారం ధర ఎవరు నిర్ణయిస్తారు?