Year Ender 2022: 2022లో, పేటీఎం, జొమాటో వంటి చెత్త స్టాక్స్‌ ఇన్వెస్టర్ల సంపదను బుగ్గిపాలు చేస్తే... అదానీ పవర్‌, అదానీ విల్మార్‌, సీజీ పవర్‌, హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ వంటివి సంపదను భారీగా పెంచాయి. 2022లో మదుపర్ల సంపదను వృద్ధి చేసిన టాప్‌-8 స్టాక్స్‌లో సగం, అంటే 4 కంపెనీలు అదానీ గ్రూప్‌లోవి కావడం, అవన్నీ టాప్‌-4 లో ఉండడం, ఈ నాలుగూ మల్టీ బ్యాగర్లు కావడం విశేషం. ఈ ఏడాది ఇన్వెస్టర్ల పాలిట దేవుడిగా అదానీ అవతరించారు. ఈ 8 స్టాక్స్‌ పెట్టుబడిదారులకు 85 శాతం నుంచి 226 శాతం వరకు లాభాలను అందించాయి.


టాప్‌-8 వెల్త్‌ క్రియేటర్స్‌: 


అదానీ పవర్‌ (Adani Power)
ఛైర్మన్: గౌతమ్‌ అదానీ
ఎండీ: అనిల్‌ సర్దన్
2022లో ఇప్పటి వరకు లాభం: 226 శాతం 
ప్రస్తుత మార్కెట్‌ విలువ: రూ. 1.31 లక్షల కోట్లు


అదానీ విల్మార్‌ ‍(Adani Wilmar)
ఛైర్మన్: గౌతమ్‌ అదానీ
సీఈవో అంగ్షు మల్లిక్
2022లో ఇప్పటి వరకు లాభం: 148.3 శాతం 
ప్రస్తుత మార్కెట్‌ విలువ: రూ. 85,589 కోట్లు


అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (Adani Enterprises)
ఛైర్మన్: గౌతమ్‌ అదానీ
సీఈవో: రాజేష్‌ అదానీ
2022లో ఇప్పటి వరకు లాభం: 146.4 శాతం 
ప్రస్తుత మార్కెట్‌ విలువ: రూ. 4.45 లక్షల కోట్లు


అదానీ టోటల్‌ గ్యాస్‌ ‍(Adani Total Gas)
ఛైర్మన్: గౌతమ్‌ అదానీ
సీఈవో: సురేష్‌ మంగ్లానీ
2022లో ఇప్పటి వరకు లాభం: 134.3 శాతం 
ప్రస్తుత మార్కెట్‌ విలువ: రూ. 4.08 లక్షల కోట్లు


సీజీ పవర్‌ ‍(CG Power)
ఛైర్మన్: వెల్లయన్ సుబ్బయ్య
సీఈవో: నటరాజన్ శ్రీనివాసన్
2022లో ఇప్పటి వరకు లాభం: 93.4 శాతం 
ప్రస్తుత మార్కెట్‌ విలువ: రూ. 40,650 కోట్లు


హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్ (Hindustan Aeronautics)
ఛైర్మన్‌ & ఎండీ: సి.బి. అనంత కృష్ణన్
2022లో ఇప్పటి వరకు లాభం: 92.5 శాతం 
ప్రస్తుత మార్కెట్‌ విలువ: రూ. 87,527 కోట్లు


షాఫ్లర్‌ ఇండియా (Schaeffler India) 
ఛైర్మన్: అవినాష్ గాంధీ
సీఈవో/ ఎండీ: హర్ష కదమ్
2022లో ఇప్పటి వరకు లాభం: 88.48 శాతం 
ప్రస్తుత మార్కెట్‌ విలువ: రూ. 45,644 కోట్లు


వరుణ్‌ బేవరేజెస్‌ (Varun Beverages)
ఛైర్మన్: రవికాంత్ జైపురియా
సీఈవో: కపిల్ అగర్వాల్
2022లో ఇప్పటి వరకు లాభం: 85 శాతం 
ప్రస్తుత మార్కెట్‌ విలువ: రూ. 74,318 కోట్లు


Year Ender 2022: 2022లో ఇన్వెస్టర్ల సంపదను బుగ్గిపాలు చేసిన టాప్‌-5 చెత్త స్టాక్స్‌


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.