Wipro Share Buyback: ఐటీ మేజర్ విప్రో షేర్ల బైబ్యాక్‌ ఇవాళ (గురువారం, 22 జూన్‌ 2023) ప్రారంభమైంది. ఈ స్కీమ్‌ సైజ్‌ రూ. 12,000 కోట్లు. 


రికార్డ్ డేట్‌ తేదీ (జూన్ 16) నాటికి విప్రో షేర్లు డీమ్యాట్‌లో ఉన్నవాళ్లంతా బైబ్యాక్‌లో పాల్గొనవచ్చు, తమ షేర్లను కంపెనీకి టెండర్ చేయవచ్చు. బైబ్యాక్‌ కోసం విప్రో నిర్ణయించిన రేటు ఒక్కో షేరుకు రూ. 445. ఇది బుధవారం క్లోజింగ్‌ ప్రైస్‌తో పోలిస్తే ఇది 15.4% ప్రీమియం.


రిటైల్ ఇన్వెస్టర్లకు (రూ. 2 లక్షల కంటే తక్కువ హోల్డింగ్‌లు ఉన్నవాళ్లు) బైబ్యాక్ సైజ్‌లో 15% కోటా రిజర్వ్ చేశారు. వీళ్ల కోసం, బైబ్యాక్‌ ఎన్‌టైటిల్‌మెంట్‌ రేషియోని ప్రతి 265 షేర్లకు 62 షేర్లుగా కంపెనీ నిర్ణయించబడింది. ఇది 23.4% రేషియోకు సమానం. అంటే, రిటైల్‌ ఇన్వెస్టర్‌ వంద షేర్లను టెండర్‌ చేస్తే, మినిమం 23.4% షేర్లను కంపెనీ తీసుకుంటుంది. మిగిలిన పెట్టుబడిదార్లకు ఈ నిష్పత్తి కేవలం 4.3%. వీళ్ల నుంచి ప్రతి 603 షేర్లకు 26 షేర్లను విప్రో తీసుకుంటుంది.


గ్లోబల్ ఎకనమిక్ ఔట్‌లుక్‌లో అనిశ్చితి కారణంగా ఐటీ రంగం ప్రస్తుతం తుపానులో చిక్కుకుంది. TCS, BirlaSoft రెండూ ఇప్పటికీ వాటి బైబ్యాక్ ప్రైస్‌ల కంటే చాలా తక్కువలో ట్రేడవుతున్నాయి.


విప్రో షేర్ బైబ్యాక్ గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు:


1) విప్రో షేర్ బైబ్యాక్ జూన్ 22న ఓపెన్‌ అయింది, అప్లై చేయడానికి చివరి రోజు జూన్ 29. బైబ్యాక్‌కు టెండర్‌ చేసిన షేర్లను జులై 6లోపు మీ బ్రోకింగ్‌ కంపెనీ నేరుగా తీసుకుంటుంది.


2) యాక్సెప్ట్‌ చేయని షేర్లు జులై 6 నాటికి తిరిగి యాక్టివ్‌ అవుతాయి. ఈ స్కీమ్ కింద బైబ్యాక్‌ చేసిన షేర్లు జులై 17 నాటికి కనిపించవు.


3) కంపెనీ ప్రమోటర్లు కూడా బైబ్యాక్‌లో పాల్గొంటారు. ప్రమోటర్లకు ఇప్పుడు విప్రోలో 72.9% వాటా ఉంది. బైబ్యాక్ తర్వాత ప్రమోటర్ హోల్డింగ్ 73.37%కు పెరుగుతుంది.


4) బైబ్యాక్ తర్వాత EPS 20.73% నుంచి 21.79%కి పెరుగుతుంది, PE 17.75 నుంచి 16.89కి తగ్గుతుంది.


5) బైబ్యాక్ వల్ల 26.97 కోట్ల షేర్లు లేదా కంపెనీ మొత్తం షేర్లలో 4.91% ఫ్రీప్లోట్‌ నుంచి ఆగిపోతుంది.


6) ఎన్‌టైటిల్‌మెంట్‌ రేషియో అంటే.. బైబ్యాక్‌లో కంపెనీ తీసుకునే కనీస షేర్ల సంఖ్య. బైబ్యాక్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి ఈ నంబర్‌ ఇంకా పెరగవచ్చు.


7) బైబ్యాక్ నంబర్‌ పాయింట్స్‌లో ఉంది కాబట్టి, పాయింట్‌ తర్వాతి అంకెలను లెక్కలోకి తీసుకోరు. ఉదాహరణకు.. 23.4%లో, పాయింట్‌ తర్వాత ఉన్న 4ను తీసేసి, 23% పరిగణనలోకి తీసుకుంటారు.


8) బైబ్యాక్‌లో షేర్లను టెండర్ చేసే ఆసక్తి ఉన్న షేర్‌హోల్డర్లు తమ స్టాక్ బ్రోకర్ల ద్వారా టెండర్‌ చేయవచ్చు.


9) గత ఏడాది కాలంలో, NSE IT ఇండెక్స్‌లో 7.3% లాభం, బెంచ్‌మార్క్ నిఫ్టీలో 23% లాభంతో పోలిస్తే విప్రో షేర్లు 7.74% క్షీణించాయి.


10) సాధారణంగా.. ఏ కంపెనీ అయినా, తన దగ్గరున్న మిగులు నిధుల్ని షేర్‌హోల్డర్లకు పంచడానికి/ షేర్‌ ధరల పతనాన్ని అడ్డుకోవడానికి బైబ్యాక్‌ చేపడుతుంది.


మరో ఆసక్తికర కథనం: AIS - 26AS మధ్య తేడా తెలుసుకోండి, ఫైలింగ్‌ పని ఈజీ అవుతుంది 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial