టెలికాం ఇండస్ట్రీలో బాదుడు మొదలైంది! ఒక కంపెనీ తర్వాత ఒకటి ప్రీపెయిడ్‌ ప్లాన్ల ధరలను పెంచేస్తున్నాయి. సోమవారమే కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ షాకివ్వగా మంగళవారం వొడాపోన్‌ ఐడియా వారితో కలిసింది! తమ ప్రీపెయిడ్‌ ప్లాన్ల ధరలు సవరిస్తున్నామని ప్రకటించింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తప్పడం లేదని వెల్లడించింది.


దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు 2021, నవంబర్‌ 25 నుంచి అమల్లోకి వస్తాయని వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. ధరల పెరుగుదలతో ఏఆర్‌పీయూ ప్రక్రియ మెరుగవుతుందని, టెలికాం ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లకు పరిష్కారం దొరుకుతుందని 'విఐ' అంటోంది. కొత్త టారిఫ్ ప్లాన్లతో తమ నెట్‌వర్క్‌ మరింత వేగంగా టెలికాం సేవలు అందిస్తుందని వెల్లడించింది. డిజిటల్‌ ఇండియా దార్శనికత నిజమయ్యేందుకు ఉపయోగపడుతుందని పేర్కొంది.


పెంచిన వాయిస్‌, డేటా సేవల ధరల్లో తమకు అనువైనవి వినియోగదారులు ఎంచుకోవాలని వొడాఫోన్‌ ఐడియా సూచిస్తోంది. ఒక్కో ప్లాన్‌పై కనీసం పది నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచినట్టు కనిపిస్తోంది. రూ.79 బేసిక్‌ ప్లాన్‌ రూ.99, రూ.149 ప్లాన్‌ రూ.199కి పెరిగాయి. ఇంకా ఏయే ప్లాన్ల ధర ఎంతకు పెరిగిందో కింది చిత్రంలో చూడండి.




ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ల ధరలను సోమవారం సవరించింది. ప్రస్తుతం కంపెనీ ఏఆర్‌పీయూ(ఒక వినియోగదారుడు పెట్టే సగటు ఖర్చు) రూ.200 నుంచి రూ.300 వరకు ఉండాలని కంపెనీ ఎప్పుడూ అంటూనే ఉంటుంది. తాము పెట్టిన పెట్టుబడి మీద రీజనబుల్ రిటర్న్ రావాలంటే ఆ మాత్రం ఉండాలని కంపెనీ అంటోన్న సంగతి తెలిసిందే.


Also Read: Airtel Revised Plans: ఎయిర్‌టెల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. అన్ని ప్లాన్ల ధరలూ పెంపు.. ఇప్పుడు ఎంతంటే?


Also Read: EPFO New Update: జాబ్‌ మారారా? పీఎఫ్‌ బదిలీ చేయాల్సిన అవసరం లేదు.. మరో మార్పు చేశారు!


Also Read: Cryptocurrency Update: 2 గంటల్లో రూ.1000ని రూ.60 లక్షలుగా మార్చిన కొత్త క్రిప్టో కరెన్సీ


Also Read: Market update: ఒక్కరోజులో రూ.8లక్షల కోట్లు ఆవిరి..! మార్కెట్‌ పతనానికి కారణాలివే..!


Also Read: Gold-Silver Price: నిలకడగా బంగారం, వెండి ధరలు.. మీ ప్రాంతంలో నేటి ధరలు ఇవీ..


Also Read: Rohit Sharma on Venkatesh Iyer: వెంకటేశ్‌ అయ్యర్‌పై రోహిత్‌ కీలక స్టేట్‌మెంట్‌..! మరింత ఫోకస్‌ పెడతామంటున్న కెప్టెన్‌


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి