Red Rock island for sale: సాధారణంగా ఓపెన్‌ లాండ్‌, ఇండిపెండెంట్‌ హౌస్‌, అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్‌, విల్లా, మల్టీ స్టేర్డ్‌ బిల్డింగ్‌ లాంటి స్థిరాస్తులు అమ్మకానికి వస్తుంటాయి. చాలా అరుదుగా, ద్వీపాలను (island) కూడా కొందరు బేరం పెడతారు. వాటిని ఎవరు కొంటారని అనుకోవద్దు. వాటికి ఉండే బయ్యర్స్‌ వాటికి ఉంటారు.  ఏకాంతంగా & ప్రశాంతంగా బతకాలనుకునే వాళ్లు ఐలండ్‌ కొంటారు.


మీరు కూడా జనావాసాలకు దూరంగా, ప్రశాంతంగా జీవించాలని అనుకుంటుంటుంటే... ఇప్పుడు సరైన సమయం వచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో బే (san francisco bay) మధ్యలో ఉన్న 5.8 ఎకరాల రెడ్ రాక్ ఐలాండ్ అమ్మకానికి (Red Rock island is up for sale) వచ్చింది. ఈ అందమైన ద్వీపాన్ని మీ సొంతం చేసుకోవడానికి, మీ దగ్గర 25 మిలియన్ డాలర్లు (దాదాపు 200 కోట్లు) ఉంటే చాలు. అంతకుముందు, 2015లో ఈ దీవిని విక్రయించే ప్రయత్నం జరిగింది. అప్పట్లో దీని ధర కేవలం 5 మిలియన్ డాలర్లు. దీవి ఓనర్‌ 2011లోనూ మరోమారు విక్రయించేందుకు ప్రయత్నించాడు, అప్పుడు 22 మిలియన్‌ డాలర్లు అడిగాడు. 


ఎర్రటి రాయితో ఉంటుంది కాబట్టి దీనికి రెడ్‌ రాక్‌ ఐలండ్‌ అని పేరు వచ్చింది. ద్వీపం విస్తీర్ణం 4.1 ఎకరాలు. రెడ్ రాక్ ఐలాండ్ యజమాని బ్రాక్ డర్నింగ్ (Red Rock Island owner Brock Durning) ప్రస్తుతం అలాస్కాలో నివసిస్తున్నాడు. అతని తండ్రి నుంచి ఈ ద్వీపం వారసత్వంగా వచ్చింది. గత 22 ఏళ్లుగా అతను ఇక్కడికి రావడం లేదు. ప్రస్తుతం, బ్రాక్ తల్లి చాలా వృద్ధురాలు. ఆమె సంరక్షణకు అవసరమైన డబ్బు కోసం రెడ్‌ రాక్‌ ఐలండ్‌ను అమ్మాలని బ్రాక్‌ భావిస్తున్నాడు.


ద్వీపంతో అధికారుల బంతాట
శాన్ ఫ్రాన్సిస్కోలో ఐదు ద్వీపాలు ఉన్నాయి. వాటిని.. రెడ్ రాక్, సీల్ రాక్స్, ట్రెజర్ ఐలాండ్, యెర్బా బ్యూనా, ఆల్కాట్రాజ్ అని పిలుస్తారు. ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న ఏకైక ద్వీపం రెడ్ రాక్. ఈ ద్వీపం.. కాంట్రా కోస్టా, మారిన్, శాన్ ఫ్రాన్సిస్కో మూడు కౌంటీల పరిధిలోకి వస్తుంది. అందువల్ల ఇక్కడ ఎలాంటి చిన్న అభివృద్ధి పని చేయాలన్నా మూడు కౌంటీల నిబంధనలు పాటించాల్సిందే.


రెడ్‌ రాక్‌ ద్వీపం రిచ్‌మండ్ నగరంలో ఉంది. ఈ ఐలాండ్‌లో ఇళ్లు, యాచ్‌ హార్బర్‌, బొటానికల్‌ గార్డెన్‌, బిల్‌ బోర్డులు, క్యాసినో, రెస్టారెంట్‌, హోటల్‌, 25 అంతస్తుల భవనం నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు చేస్తే, వాటన్నింటినీ అధికార్లు తిరస్కరించారు.


మరికొన్ని ఆసక్తికర విషయాలు
1964లో, మెండెల్ గ్లిక్‌మన్ అనే వ్యక్తి కేవలం 50 వేల డాలర్లకు రెడ్‌ రాక్‌ ఐలండ్‌ను కొనుగోలు చేశాడు. ఇక్కడ ఇల్లు కట్టడమే కాకుండా గ్యాస్ కూడా కనిపెట్టాలనుకున్నాడు. ఆ తర్వాత, మెండెల్ దానిని బ్రాక్ తండ్రికి అమ్మాడు. ప్రస్తుతం ఒక చెట్టు, ఒక బీచ్, ఖాళీగా ఉన్న కోస్ట్ గార్డ్ కాంపౌండ్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కరెంటు, నీటి వ్యవస్థ లేదు. 1900 ప్రాంతాల్లో ఇక్కడ మాంగనీస్ మైనింగ్ కూడా రహస్యంగా జరిగింది. ఈ దీవిలో నిధులు కూడా ఉన్నాయన్న జనం చెప్పుకుంటున్నారు.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply 


 


మరో ఆసక్తికర అంశం: బంగారం కొనేవాళ్లకు డాలర్‌ దెబ్బ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి