UPS vs NPS vs OPS: ఏకీకృత పింఛను పథకానికి ‍‌(Unified Pension Scheme) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం శనివారం (ఆగస్టు 24, 2024) ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్‌లో, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఫిక్స్‌డ్ పెన్షన్ లభిస్తుంది. ఈ పథకం ఏప్రిల్ 01, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. 


UPS ప్రత్యేకతలు


- ఉద్యోగి వాటా: OPSలో ఉద్యోగి వాటా లేదు
- ఫిక్స్‌డ్‌ పెన్షన్: ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత స్థిరమైన పింఛను లభిస్తుంది. ఈ పెన్షన్ పదవీ విరమణకు ముందు 12 నెలల సగటు ప్రాథమిక జీతంలో (Basic Pay) 50% ఉంటుంది. కనీసం 25 ఏళ్ల పాటు పనిచేసిన ఉద్యోగులకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది.
- కనీస పెన్షన్: ఒక ఉద్యోగి కనీసం 10 సంవత్సరాలు పని చేసిన తర్వాత పదవీ విరమణ చేస్తే, అతను కనీస పింఛనుగా (Assured Minimum Pension) రూ. 10,000 పొందుతాడు.
- కుటుంబ పెన్షన్: ఈ పథకం కింద ఫ్యామిలీ పెన్షన్‌ (Family Pension) సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. ఉద్యోగి మరణించిన తర్వాత అతని కుటుంబానికి 60% మొత్తం ఫ్యామిలీ పెన్షన్‌గా అందుతుంది.
- ఇన్‌ఫ్లేషన్‌ ఇండెక్సేషన్ బెనిఫిట్: DR ‍‌(Dearness Relief) మొత్తం ద్రవ్యోల్బణం ప్రకారం ఈ మూడు పెన్షన్లపై అందుబాటులో ఉంటుంది. ఇది పారిశ్రామిక కార్మికుల కోసం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా ఉంటుంది.
- గ్రాట్యుటీ: ఉద్యోగి, తన ఉద్యోగంలో చివరి 6 నెలల జీతం + అలవెన్సులను గ్రాట్యుటీ (Gratuity) రూపంలో ఏకమొత్తంగా ‍‌పొందుతాడు. ఇది, ఉద్యోగి చివరి ప్రాథమిక జీతంలో 1/10వ వంతు అవుతుంది.
- షేర్‌ మార్కెట్‌ పెట్టుబడులు: UPSలో ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది.
- PRC ప్రయోజనం: UPSకు PRC వర్తించదు
- కారుణ్య నియామకం ఉంది
- హెల్త్‌ కార్డ్‌ విషయంలో స్పష్టత లేదు


UPS ప్రయోజనం ఎవరికి లభిస్తుంది?
ఎన్‌పీఎస్‌లోనే కొనసాగాలా లేదా యూపీఎస్‌లో చేరాలా అని నిర్ణయించుకునే హక్కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుంది. 2004 నుంచి ఎన్‌పీఎస్‌ కింద పదవీ విరమణ చేసిన వారందరికీ ఈ పథకం వర్తిస్తుంది. యుపీఎస్ ఏప్రిల్ 01, 2025 నుంచి అమలవుతుంది. కాబట్టి, 2004 జనవరి 01 నుంచి 2025 మార్చి 31 వరకు NPS కింద పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరూ UPS ప్రయోజనాలను పొందొచ్చు. 


OPS స్థానంలో NPS
జనవరి 01, 2004 నుంచి OPS స్థానంలో NPS అమల్లోకి వచ్చింది. జనవరి 01, 2004న లేదా ఆ తర్వాత కొలువుల్లో చేరిన ప్రభుత్వ ఉద్యోగులు NPS కిందకు వస్తారు. OPSలో, ఉద్యోగులు తమ పదవీ విరమణ తర్వాత, చివరి జీతంలో 50 శాతం మొత్తాన్ని పెన్షన్‌గా తీసుకోవచ్చు. దీనిని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ప్రారంభించింది.


NPS ముఖ్యాంశాలు
- నేషనల్ పెన్షన్ స్కీమ్‌ను (NPS) కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) అని కూడా అంటారు. 2004లో ఇది ప్రారంభమైంది. 2009 నుంచి ప్రైవేట్ రంగానికి కూడా వర్తిస్తోంది.
- NPSను 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (PFRDA) నిర్వహిస్తుంది.
- ఇందులో ఉద్యోగి పెట్టిన పెట్టుబడి ఆధారంగా పెన్షన్ పొందుతాడు. బేసిక్‌+DAపై 10% ఉద్యోగి వాటాగా ఉంటుంది.
- పదవీ విరమణ సమయంలో గరిష్టంగా 60% మొత్తాన్ని విత్‌డ్రా చేసిన తర్వాత, మిగిలిన డబ్బుతో యాన్యుటీ ప్లాన్స్‌ కొనుగోలు చేసి నెలవారీ ఆదాయం పొందొచ్చు.
- దీనిలో కుటుంబ పింఛను ఐచ్చికం. 
- హెల్త్‌ కార్డ్‌ లేదు
- కారుణ్య నియామకం ఉంది
- DR లేదు
- PRC ప్రయోజనం వర్తించదు
- షేర్‌ మార్కెట్‌ పెట్టుబడులను ఉద్యోగి భరించాలి
- NPSను టైర్ 1, టైర్ 2 ఖాతాలుగా విభజించారు. టైర్ 1 ఖాతాను ఎంచుకునే వాళ్లు రిటైర్మెంట్‌ విరమణ సమయంలో మాత్రమే (ప్రత్యేక పరిస్థితులు మినహా) నిర్దిష్ట మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, టైర్ 2 ఖాతాలు ఉన్నవారు పదవీ విరమణకు ముందే డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంది.
- ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 CCD ప్రకారం రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. 
- NPS మొత్తంలో 60 శాతం ఉపసంహరణపై పన్ను లేదు.


మరో ఆసక్తికర కథనం: యుద్ధ భయంతో పెట్రో రేట్ల పరుగు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇవి