డైరెక్ట్‌ టు హోమ్‌ (DTH) కంపెనీ 'టాటా స్కై' తన పేరును 'టాటా ప్లే'గా రీ బ్రాండ్‌ చేసుకుంది. జనవరి 27 నుంచి సేవల్లో భారీ మార్పులు చేయనుంది. తమ కస్టమర్లకు ఓటీటీ సేవలు అందించనుందని తెలిసింది. వాల్ట్‌ డిస్నీతో కలిసి టాటా గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా టెలివిజన్‌తో పాటు ఓటీటీ కంటెట్‌ను వివిధ ప్యాకేజీల రూపంలో ఆఫర్‌ చేయనుంది. అందుకే పేరులోంచి స్కై తొలగించింది.


ప్రస్తుతం టాటా స్కైకి 19 మిలియన్ల యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ప్రస్తుతం కంపెనీ ఆసక్తి డీటీహెచ్‌ సేవలే కాకుండా ఇంటింటికి ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌, 14 ఓటీటీ సేవలు అందిస్తున్న బింగే వరకు విస్తరించింది.


'వాస్తవంగా మేం ఒక డీటీహెచ్‌ కంపెనీగానే మొదలయ్యాం. ప్రస్తుతం మేం కంటెట్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీగా పూర్తిగా పరివర్తన చెందాం. కస్టమర్లు తమ ఆసక్తిని మార్చుకుంటుననారు. ఓటీటీ వేదికలకు అలవాటు పడుతున్నారు. అందుకే మేం వారికోసం ఒక  ఏకరూప వేదికను తీసుకొచ్చి సేవలు అందించాలని అనుకుంటున్నాం. అందుకే మేం బింగే ఆవిష్కరించాం. బ్రాండ్‌ బ్యాండ్‌ సేవలూ అందిస్తున్నాం' అని టాటా ప్లే ఎండీ, సీఈవో హరిత్‌ నాగ్‌పాల్‌ అన్నారు.


తమ బిగే ప్యాక్స్‌లో భాగంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్‌, నెట్‌ఫ్లిక్స్‌ సహా 13 ఓటీటీ సేవలను అందిస్తోంది. టాటా ప్లే తమ కొత్త సేవలను నెలకు రూ.399తో ఆరంభిస్తోంది. కొత్త కాంబో ప్యాకులను జాతీయ మార్కెట్లో కరీనా కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌తో ప్రచారం చేయిస్తోంది. ఇక దక్షిణాదిన మాధవన్‌, ప్రియమణితో ఒప్పందం చేసుకుంది. పైగా సర్వీస్‌ విజిట్‌ రుసుము రూ.175ను రద్దు చేయనుందని తెలిసింది. ఇప్పటి వరకు డీటీహెచ్‌ కనెక్షన్‌ రీఛార్జ్‌ చేసుకోని కస్టమర్లకు ఉచితంగానే రీకనెక్షన్‌ ఇస్తోంది.


Also Read: Cyber Attack: మహేష్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌‌పై సైబర్ అటాక్.. ప్లాన్ ప్రకారం ఖాతాలు తెరిచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు


Also Read: Nirmala Sitharaman Profile: పేరే.. 'నిర్మల'! ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో 'మదురై మీనాక్షి'!!


Also Read: Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?