Tata Motors Share Price Today: టాటా మోటార్స్ షేర్లలో పతనం ఆగడం లేదు. ఈ రోజు (బుధవారం 11 సెప్టెంబర్‌ 2024) ఈ స్క్రిప్‌ ధర రూ.1,000 కంటే దిగి వచ్చింది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే 5.59% తగ్గుదలతో ట్రేడవుతున్నాయి. అదే సమయానికి సెన్సెక్స్ 0.15% పెరిగి 82,045 వద్ద ట్రేడవుతోంది. ఉంది.


టాటా మోటార్స్‌ షేర్లు ఈ రోజు గరిష్టంగా రూ.1012 & కనిష్టంగా రూ. 976.75ని తాకాయి.


టెక్నికల్‌గా చూస్తే, ఈ స్టాక్ 300 డేస్‌ SMA కంటే పైన & 5, 10, 20, 50, 100 డేస్‌ SMA కంటే కింద ట్రేడవుతోంది. 300 డేస్‌ SMA వద్ద సపోర్ట్‌ తీసుకుంటున్న టాటా మోటార్స్‌.. 5, 10, 20,50,100 డేస్‌ SMA వద్ద రెసిస్టెన్స్‌ ఎదుర్కొంటోంది.


ఈ రోజు ఉదయం 11.30 గంటల వరకు, టాటా మోటార్స్‌ కోసం NSE & BSEలో జరిగిన ట్రేడ్‌ వాల్యూమ్‌ గత ట్రేడింగ్ వాల్యూమ్‌ కంటే 505.13% ఎక్కువగా ఉంది. ప్రైస్‌ ట్రెండ్స్‌ను తెలుసుకోవడానికి షేర్‌ ప్రైస్‌తో పాటు ట్రేడెడ్ వాల్యూమ్ కూడా కీలకమైన సిగ్నల్‌. అధిక వాల్యూమ్‌తో పాజిటివ్‌గా ప్రైస్‌ కదులుతుంటే అప్‌ ట్రెండ్‌ను, అధిక వాల్యూమ్‌తో నెగెటివ్‌గా ప్రైస్‌ కదులుతుంటే డౌన్‌ట్రెండ్‌ను అంచనా వేస్తారు. ఏదైనా స్టాక్‌ డౌన్‌ ట్రెండ్‌లో ఉంటే మరింత పడిపోయే ప్రమాదం ఉంటుంది.


'మింట్' టెక్నికల్‌ అనాలిసిస్‌ ప్రకారం, టాటా మోటార్స్‌ స్టాక్ డౌన్‌ ట్రెండ్/బేరిష్ ట్రెండ్‌లో ఉంది.


ఈ కంపెనీలో మ్యూచువల్‌ ఫండ్స్‌ (MFs) హోల్డింగ్ 2024 మార్చిలోని 5.64% నుంచి జూన్‌లో 5.16%కి తగ్గింది. విదేశీ పెట్టుబడిదార్ల (Fiis) హోల్డింగ్ మార్చిలోని 19.20% నుంచి జూన్‌లో 18.18%కి తగ్గింది.


టాటా మోటార్స్ షేర్ ధర ఈ రోజు దాదాపు 6% తగ్గినప్పటికీ, దాని పోటీ కంపెనీ షేర్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. అశోక్ లేలాండ్ షేర్లు తగ్గాయి; మారుతి, జూపిటర్ వ్యాగన్స్‌, ఫోర్స్ మోటార్స్ రైజింగ్‌లో ఉన్నాయి.


గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ UBS, రూ.825 ప్రైస్‌ టార్గెట్‌తో టాటా మోటార్స్‌పై 'సెల్‌' సిఫార్సు ప్రకటించింది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే ఈ స్టాక్‌ మరో 20% పడిపోవచ్చని దీని అర్ధం.


ఈ ఏడాది జులై 30న తాకిన దాని రికార్డు గరిష్ట స్థాయి రూ.1,179 నుంచి ఈ స్టాక్ ఇప్పటికే 12% తగ్గింది.


UBS చెబుతున్న ప్రకారం, టాటా మోటార్స్ బ్రిటిష్ విభాగమైన 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (JLR) అందిస్తున్న తగ్గింపు ధరలు పెట్టుబడిదార్లలో టెన్షన్‌ పెంచుతున్నాయి. ఈ డిస్కౌంట్లు ఇంకా పెరుగుతాయేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. JLR ఆర్డర్ బుక్ ప్రి-పాండమిక్ స్థాయుల కంటే పడిపోయింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.