Swiggy Launches UPI Service: 'యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌' (Unified Payments Interface) విభాగంలోకి కొత్త ప్లేయర్లు వేగంగా ప్రవేశిస్తున్నాయి. గూగుల్‌ పే (Google Pay), ఫోన్‌ పే (PhonePe) వంటి ప్రముఖ యాప్‌లకు కొత్త కంపెనీలు గట్టి పోటీగా మారుతున్నాయి, వాటి మార్కెట్ వాటా లాగేసుకుంటున్నాయి. జొమాటో (Zomato) తరహాలోనే, ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ కూడా UPI సర్వీస్‌ను ప్రారంభించింది. 


యూపీఐ సర్వీస్‌ను స్విగ్గీ ఎందుకు తీసుకొచ్చింది?
ఆర్డర్‌ చేసిన ఆహారం కోసం కస్టమర్లు ఫిజికల్‌ క్యాష్‌ (క్యాష్‌ ఆన్‌ డెలివెరీ) ఇస్తున్నారు లేదా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లిస్తున్నారు. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ విషయంలో థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తాము కూడా UPI సేవను ప్రారంభించినట్లు స్విగ్గీ ప్రకటించింది. ఈ సర్వీస్‌ వల్ల తమ కస్టమర్‌లకు కూడా సౌలభ్యం ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఆర్డర్ చేసిన తర్వాత పేమెంట్ చేయడానికి కస్టమర్‌లు మరే ఇతర యాప్‌ను తెరవాల్సిన అవసరం ఉండదని, పేమెంట్ ఫెయిల్యూర్ రిస్క్‌ కూడా తగ్గుతుందని ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివెరీ కంపెనీ వెల్లడించింది.


గత ఏడాది ప్రారంభమైన జొమాటో యూపీఐ సర్వీస్‌ 
స్విగ్గీ కంటే ముందు, దాని కాంపిటీటర్‌ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కూడా 'యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌' సర్వీస్‌ను ప్రారంభించింది. అయితే... స్విగ్గీ తీసుకొచ్చిన సర్వీస్‌ కంటే జొమాటో సర్వీస్‌ భిన్నమైనది. జొమాటో యూపీఐ సర్వీస్‌, ఇతర పేమెంట్స్‌ యాప్‌ల తరహాలోనే పని చేస్తుంది. డిజిటల్ పేమెంట్స్‌ యాప్‌గా పని చేసేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) నుంచి అది పర్మిషన్‌ తెచ్చుకుంది. అంటే.. గూగుల్‌ పే, ఫోన్‌పే తరహానే జొమాటో యాప్‌ ద్వారా నేరుగా పేమెంట్స్‌ చేయొచ్చు. స్విగ్గీ సర్వీస్‌ మాత్రం UPI ప్లన్‌-ఇన్ ద్వారా ప్రారంభమైంది. యెస్ బ్యాంక్ (Yes Bank), జస్పే (Juspay) భాగస్వామ్యంతో ఈ సేవను స్విగ్గీ అందిస్తుంది.


ప్రస్తుతం పరీక్ష దశ
స్విగ్గీ యూపీఐ సర్వీస్ సాధారణ కస్టమర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు, పరీక్ష దశలో ఉంది. మనీ కంట్రోల్ రిపోర్ట్‌ ప్రకారం... ఈ ఫుడ్ డెలివరీ కంపెనీ యూపీఐ సేవను వినియోగదార్ల దరికి చేర్చే ముందు తన ఉద్యోగుల ద్వారా పరీక్షిస్తోంది. గత నెల నుంచి ఈ పరీక్ష కొనసాగుతోంది. ఉద్యోగులు ఇచ్చిన సలహాలు, సూచనల ద్వారా యూపీఐ సర్వీస్‌లోని లోటుపాట్లను సరిదిద్దుకుని, ఆ తర్వాత యూజర్ల వద్దకు వస్తుంది. ఈ సేవలు రాబోయే కొన్ని నెలల్లో దశల వారీగా స్విగ్గీ వినియోగదార్లకు అందుతాయని సమాచారం.


జొమాటో, స్విగ్గీ మాత్రమే కాదు, ఇటీవల చాలా కంపెనీలు సొంతంగా యూపీఐ సేవలను ప్రారంభించాయి. ప్రస్తుతం, గూగుల్‌ పే, ఫోన్‌ పే కంపెనీలు UPI మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో, రిజర్వ్ బ్యాంక్ మొట్టికాయల తర్వాత, యూపీఐ మార్కెట్‌లో పేటీఎం (Paytm) వాటా వేగంగా క్షీణించింది. ప్రస్తుతం గూగుల్‌ పే, ఫోన్‌ పే కాకుండా పేటీఎం, జొమాటో, ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart), గోఇబిబో (Goibibo), మేక్‌ మై ట్రి (MakeMyTrip), టాటా న్యూ (Tata Niu), క్రెడ్‌ (Cred) వంటి యాప్స్‌ కూడా UPI ద్వారా పేమెంట్‌ ఫెసిలిటీని అందిస్తున్నాయి.


మరో ఆసక్తికర కథనం: మీ కుమార్తెకు రూ.46 లక్షలు గిఫ్ట్‌ - ఈ స్కీమ్‌లో గ్యారెంటీ ఉంది