Latest Gold-Silver Prices 05 July 2024: అమెరికాలో పేరోల్‌ డేటా మీద ఇన్వెస్టర్లు ఫోకస్‌ పెట్టడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు మన్ను తిన్న పాములా మెల్లగా కదులుతోంది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,370 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు బంగారం ధరలు మారలేదు, నిన్నటి రేట్లో కొనసాగుతున్నాయి. కిలో వెండి రేటు 200 రూపాయలు పెరిగింది. 

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,090 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,820 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 97,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,090 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,000 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,820 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 97,700 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 73,090  ₹ 67,000  ₹ 54,820  ₹ 97,700 
విజయవాడ ₹ 73,090  ₹ 67,000  ₹ 54,820  ₹ 97,700 
విశాఖపట్నం ₹ 73,090  ₹ 67,000  ₹ 54,820  ₹ 97,700 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,375 ₹ 6,760
ముంబయి ₹ 7,309 ₹ 6,700
పుణె ₹ 7,309 ₹ 6,700
దిల్లీ ₹ 7,324 ₹ 6,715
 జైపుర్‌ ₹ 7,324 ₹ 6,715
లఖ్‌నవూ ₹ 7,324 ₹ 6,715
కోల్‌కతా ₹ 7,309 ₹ 6,700
నాగ్‌పుర్‌ ₹ 7,309 ₹ 6,700
బెంగళూరు ₹ 7,309 ₹ 6,700
మైసూరు ₹ 7,309 ₹ 6,700
కేరళ ₹ 7,309 ₹ 6,700
భువనేశ్వర్‌ ₹ 7,309 ₹ 6,700

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,494 ₹ 6,011
షార్జా ‍‌(UAE) ₹ 6,494 ₹ 6,011
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,494 ₹ 6,011
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,504 ₹ 6,103
కువైట్‌ ₹ 6,393 ₹ 5,850
మలేసియా ₹ 6,455 ₹ 6,171
సింగపూర్‌ ₹ 6,771 ₹ 6,159
అమెరికా ₹ 6,386 ₹ 6,010

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 120 తగ్గి ₹ 26,810 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి