Sugar Stocks News: FY24లో ఇప్పటి వరకు (1 ఏప్రిల్ 2023 నుంచి 26 సెప్టెంబర్ 2023 వరకు), నిఫ్టీ50 13% రాబడిని అందించింది. ఇదే సమయంలో చాలా చక్కెర కంపెనీల షేర్లు 110% వరకు ర్యాలీ చేశాయి, తమ ఇన్వెస్టర్లకు తియ్యటి రిటర్న్స్‌ అందించాయి. అంతర్జాతీయ చమురు ధరలు మరోసారి బ్యారెల్‌కు 100 డాలర్ల వైపు పరుగులు పెడుతుండడంతో... చెరకు నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌పై (ethanol) మార్కెట్‌లో ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. ఇది, షుగర్‌ స్టాక్స్‌ ర్యాలీకి మరింత సాయం చేస్తుంది. ఏస్ ఈక్విటీ డేటా ప్రకారం, చక్కెర కంపెనీల షేర్లు FY24లో 110% వరకు రాబడి అందించాయి. 


FY24లో 110% వరకు రిటర్న్స్‌ ఇచ్చిన 9 షుగర్‌ స్టాక్స్‌ లిస్ట్‌:


బజాజ్ హిందుస్థాన్ షుగర్ (Bajaj Hindusthan Sugar)
బజాజ్ హిందుస్థాన్ షుగర్, FY24లో ఇప్పటి వరకు, తన పెట్టుబడిదార్లకు దాదాపు 110% రాబడిని అందించింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 3,281 కోట్లు. ఈ రోజు (బుధవారం, 27 సెప్టెంబర్‌ 2023) మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ కంపెనీ షేరు 1.55% లాభంతో రూ. 26.25 వద్ద ఉంది.


ప్రాజ్ ఇండస్ట్రీస్ ‍‌(Praj Industries)
2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రాజ్ ఇండస్ట్రీస్ స్టాక్ ఇప్పటివరకు 73% జూమ్‌ అయింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ (market cap) రూ. 10,762 కోట్లు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ కంపెనీ షేరు 0.60% నష్టంతో రూ. 583 వద్ద ఉంది.


త్రివేణి ఇంజినీరింగ్ & ఇండస్ట్రీస్ (Triveni Engineering & Industries)
FY24లో ఇప్పటి వరకు త్రివేణి ఇంజినీరింగ్ & ఇండస్ట్రీస్ 44% ర్యాలీ చేసింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 8,274 కోట్లు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ కంపెనీ షేరు 0.21% లాభంతో రూ. 382 వద్ద ఉంది.


ధంపూర్ షుగర్‌ మిల్స్‌ (Dhampur Sugar Mills)
ధంపూర్ షుగర్ మిల్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తన పెట్టుబడిదార్లకు 41% రాబడిని అందించింది. ధంపూర్ షుగర్ మిల్స్ మార్కెట్ క్యాప్ రూ. 2,016 కోట్లు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ కంపెనీ షేరు 0.16% నష్టంతో రూ. 305 వద్ద ఉంది.


దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ ‍‌(Dalmia Bharat Sugar and Industries)
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ 36% లాభపడింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 44,389.73 కోట్లు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ కంపెనీ షేరు 0.43% నష్టంతో రూ. 2,357 వద్ద ఉంది.


శ్రీ రేణుక షుగర్స్ ‍‌(Shree Renuka Sugars)
FY24లో శ్రీ రేణుక షుగర్స్ తన ఇన్వెస్టర్లకు 26% రిటర్న్స్‌ ఇచ్చింది. శ్రీ రేణుక షుగర్స్ మార్కెట్ క్యాప్ రూ. 11,749 కోట్లు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ కంపెనీ షేరు 0.91% లాభంతో రూ. 55.30 వద్ద ఉంది.


ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ ‍‌(Dwarikesh Sugar Industries)
ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ FY24లో ఇప్పటి వరకు 25% పెరిగింది. ఈ సంస్థ మార్కెట్ క్యాప్ రూ. 1,962 కోట్లు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ కంపెనీ షేరు 0.90% నష్టంతో రూ. 104.90 వద్ద ఉంది.


ఇ.ఐ.డి. పారీ (E.I.D. Parry)
2023-24 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో EID ప్యారీ ఇప్పటి వరకు 15% పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 9,383 కోట్లు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ కంపెనీ షేరు 0.46% నష్టంతో రూ. 526.70 వద్ద ఉంది.


గ్లోబస్ స్పిరిట్స్ ‍‌(Globus Spirits​)
2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్లోబస్ స్పిరిట్స్ 14% పెరిగింది. గ్లోబస్ స్పిరిట్స్ మార్కెట్ క్యాప్ రూ. 2,558 కోట్లు. ఈ రోజు మధ్యాహ్నం 1.15 గంటల సమయానికి ఈ కంపెనీ షేరు 0.33% లాభంతో రూ. 891 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తండ్రి బాటలోనే తనయులు, ముకేష్‌ అంబానీ వారసుల జీతం ఎంతో తెలుసా?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial