Stock Market Today, 29 December 2023: గురువారం ట్రేడింగ్‌లోనూ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు, ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) వేల కోట్లను ఇండియన్‌ ఈక్విటీస్‌లోకి పంప్‌ చేయడం దీనికి కారణం. ఈ రోజు (శుక్రవారం, 29 డిసెంబర్‌ 2023) కూడా అదే ఉత్సాహం కొనసాగి, మార్కెట్లు పాజిటివ్‌గా ఈ సంవత్సరాన్ని ముగిస్తాయని ఎక్స్‌పర్ట్స్‌ ఆశిస్తున్నారు.


2023 క్యాలెండర్‌ సంవత్సరంలో చివరిసారి ట్రేడింగ్‌ రోజున అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. ఆస్ట్రేలియన్ & జపాన్ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు తలో 0.3 శాతం చొప్పున తగ్గాయి. దక్షిణ కొరియా & చైనా మార్కెట్లు 1.6 శాతం వరకు పెరిగాయి.
 
గురువారం అమెరికన్‌ మార్కెట్లు మిక్స్‌డ్‌గా క్లోజ్‌ అయ్యాయి. S&P 500 0.04 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.14 శాతం పెరిగాయి. నాస్డాక్ కాంపోజిట్ 0.03 శాతం తగ్గింది.


ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 06 పాయింట్లు లేదా 0.03% రెడ్‌ కలర్‌లో 21,948 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఇన్నోవా క్యాప్టాబ్‌: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు స్టాక్‌ మార్కెట్లలో లిస్ట్‌ అవుతాయి. ఒక్కో షేరుకు IPO ఇష్యూ ప్రైస్‌ రూ. 448.


PNB: QIP లేదా FPO లేదా మరేదైనా మార్గం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో (FY 2024-25) రూ. 7500 కోట్ల వరకు ఈక్విటీ మూలధనాన్ని పెంచే ప్రతిపాదనను పంజాబ్‌ నేషనల్‌ (PNB) బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో ఈ డబ్బును సేకరిస్తుంది.


టాటా స్టీల్: ఈ టాటా గ్రూప్‌ కంపెనీ పర్యావరణానికి నష్టం కలిగించిందని, దానికి ప్రతిగా రూ. 6.75 లక్షల పరిహారాన్ని కట్టమని సూచిస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి టాటా స్టీల్‌కు నోటీసు పంపింది.


ఇన్ఫో ఎడ్జ్‌: పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన జ్వయం డిజిటల్‌లో ‍‌(Zwayam Digital) రూ. 25 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఇన్ఫో ఎడ్జ్‌ డైరెక్టర్ల బోర్డు అంగీకరించింది.


స్వాన్ ఎనర్జీ: ఈక్విటీ షేర్లు లేదా అర్హత కలిగిన సెక్యూరిటీస్‌ సహా ఇన్‌స్ట్రుమెంట్స్ లేదా సెక్యూరిటీలను జారీ చేసి రూ. 4,000 కోట్ల వరకు నిధులను సేకరించేందుకు ఈ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.


ఫెడరల్ బ్యాంక్: ఫెడరల్‌ బ్యాంక్‌లో 9.95% వరకు వాటా పొందేందుకు ICICI ప్రుడెన్షియల్ AMCకి రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) నుంచి ఆమోదం లభించింది.


ఆర్తి డ్రగ్స్: 2022 ఏప్రిల్ నెలలో సరిగమ్ ప్లాంట్‌ను మూసివేసినా, ఆ విషయాన్ని వెల్లడించనందుకు ఆర్తి డ్రగ్స్‌కు సెబీ నుంచి అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్‌ లెటర్‌ అందింది.


టాటా కాఫీ: టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కాఫీ, TCPL బెవరేజెస్ & ఫుడ్స్ మధ్య అరేంజ్‌మెంట్‌ స్కీమ్‌ జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: సమయం లేదు మిత్రమా, మరో 2 రోజులు ఆగితే పెనాల్టీతోనూ ITR ఫైల్‌ చేయలేరు