Stock Market Today, 29 April 2024: గ్లోబల్‌ మార్కెట్లు లాభాలకు అనుగుణంగా ఈ రోజు (సోమవారం) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు కూడా పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభం కావచ్చు. అంతర్జాతీయ సంకేతాలతో పాటు మార్చి త్రైమాసికం ఫలితాల ఆధారంగా కూడా మన మార్కెట్లు కదలుతాయి.


మంగళవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,419 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,650 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-అప్‌లో ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో, తైవాన్ 1.3 శాతం పెరిగింది. హాంగ్ సెంగ్ 0.53  శాతం, కోస్పి 0.86 శాతం, ASX200 0.47 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. స్ట్రెయిట్స్ టైమ్స్ 0.4 శాతం తగ్గింది. నికాయ్‌లో ట్రేడింగ్‌కు ఈ రోజు సెలవు.


అమెరికన్‌ మార్కెట్లలో, శుక్రవారం, గూగుల్ పేరెంట్ ఆల్ఫాబెట్ అందించిన బూస్ట్‌తో నాస్‌డాక్ 2% దూసుకెళ్లింది.


యూఎస్‌ ఇన్‌ఫ్లేషన్‌ డేటా మార్కెట్‌ అంచనాల కంటే కొద్దిగా పెరగడంతో, అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా తగ్గి 4.663 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $89 దిగువకు చేరింది. పసిడి వెలుగు కూడా తగ్గింది, ఔన్సుకు $2,341 దగ్గర ఉంది.
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, KPIT టెక్నాలజీస్, పూనావాలా ఫిన్‌కార్ప్, టాటా కెమికల్స్, బిర్లాసాఫ్ట్, PNB హౌసింగ్ ఫైనాన్స్, కేఫిన్‌ టెక్నాలజీస్, కెన్ ఫిన్ హోమ్స్, షాపర్స్ స్టాప్, వెసువియస్ ఇండియా, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్, రోసారి బయోటెక్, UCO బ్యాంక్, జిల్లెట్ ఇండియా


ICICI బ్యాంక్: నికర వడ్డీ ఆదాయం (NII), అడ్వాన్సులు పెరగడంతో Q4 FY24లో బ్యాంక్‌ నికర లాభం 17.4 శాతం YoY జంప్‌ చేసి రూ.10,708 కోట్లకు చేరుకుంది, QoQలో 4.24 శాతం పెరిగింది. NII 8.1 శాతం YoY పెరిగి రూ. 17,667 కోట్లుగా నమోదైంది. అయితే నికర వడ్డీ మార్జిన్ (NIM) 4.90 శాతం YoY & 4.43 శాతం QoQ తగ్గి 4.40 శాతానికి పరిమితమైంది.


HCLTech: ఈ IT సేవల సంస్థ, 2024 మార్చి త్రైమాసికంలో రూ. 3,995 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. YoY ప్రాతిపదికన ఇది ఫ్లాట్‌గా ఉంది.


మారుతి సుజుకి: 2024 జనవరి-మార్చి కాలంలో రూ. 3,877.8 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, ఇది 47.8 శాతం వృద్ధి. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 19.3 శాతం; మొత్తం FY24లో అమ్మకాలు దాదాపు 9 శాతం పెరిగాయి.


ఎల్&టి ఫైనాన్స్: మార్చి క్వార్టర్‌లో ఏకీకృత నికర లాభం 11 శాతం గ్రోత్‌తో రూ.554 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 14 శాతం పెరిగి రూ. 1,909 కోట్లుగా లెక్క తేలింది.


యెస్‌ బ్యాంక్: ఈ ప్రైవేట్ బ్యాంక్‌ స్వతంత్ర నికర లాభం Q4 FY24లో రూ.452 కోట్లకు పెరిగింది, ఇది డబుల్‌ జంప్‌.


SBI లైఫ్: FY24 Q4లో ఎస్‌బీఐ లైఫ్‌ లాభం ఏడాది ప్రాతిపదికన 4.3 శాతం వృద్ధితో రూ. 811 కోట్లకు పెరిగింది. నికర ప్రీమియం ఆదాయం 26 శాతం వృద్ధితో రూ. 25,116 కోట్లకు పెరిగింది.


శుక్ర, శని, ఆదివారాల్లో Q4 ఫలితాలు ప్రకటించిన కొన్ని కంపెనీలు: జైప్రకాష్ పవర్, IDFC ఫస్ట్ బ్యాంక్, స్పోర్కింగ్ ఇండియా, SBFC ఫైనాన్స్, సంఘీ ఇండస్ట్రీస్, శేషసాయి పేపర్, RBL బ్యాంక్, మాస్టెక్, NDTV, మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్, SBI కార్డ్, ఉత్కర్ష్ SFB, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్. ఈ రోజు ట్రేడింగ్‌లో వీటిపైనా ఇన్వెస్టర్ల ఫోకస్‌ ఉంటుంది.


ఇర్కాన్ ఇంటర్నేషనల్: దినేష్‌చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్‌ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో (DRA) కలిసి (జాయింట్ వెంచర్‌) రూ.1,198 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టును దక్కించుకుంది.


వెల్‌స్పన్‌ స్పెషాలిటీ: స్టెయిన్‌లెస్ స్టీల్ సీమ్‌లెస్ ట్యూబ్‌ల సరఫరా కోసం దేశీయ PSU నుంచి రూ.21.64 కోట్ల విలువైన ఆర్డర్‌ అందుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రూ.57 లక్షలతో హ్యాపీగా రిటైర్‌ అవ్వండి, ఆ డబ్బుతో జల్సా చేయండి