Stock Market Today, 26 March 2024: కొన్ని గ్లోబల్‌ మార్కెట్ల నుంచి గ్రీన్‌ సిగ్నల్స్‌ & మరికొన్ని మార్కెట్ల నుంచి రెడ్‌ సిగ్నల్స్‌ వస్తుండడంతో, భారతీయ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) న్యూట్రల్‌గా ట్రేడ్‌ స్టార్ట్‌ చేసే అవకాశం ఉంది. 


ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 42 పాయింట్లు లేదా 0.19 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,123 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని మార్కెట్లు ఈ ఉదయం మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌లోని నికాయ్‌ 0.23 శాతం పెరిగి 40,506 స్థాయిల వద్దకు చేరింది. హాంకాంగ్‌లోని హాంగ్‌ సెంగ్‌ 1.02 శాతం జంప్‌ చేసింది. కొరియాలోని కోస్పి 1.41 శాతం పెరిగింది. ఆస్ట్రేలియాలోని ASX 200 రెడ్‌ జోన్‌లోకి జారిపోయింది.


నిన్న, USలోని మూడు ప్రధాన సూచీలు క్షీణించాయి. డౌ జోన్స్ 0.41 శాతం, S&P 500 0.31 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.27 శాతం నష్టపోయాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


అల్ట్రాటెక్ సిమెంట్: ఉత్తరాఖండ్ యూనిట్‌లో సంవత్సరానికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల (MTPA) బ్రౌన్‌ఫీల్డ్ సిమెంట్ కెపాసిటీని యాడ్‌ చేసింది. దీంతో, ఆ యూనిట్ సామర్థ్యం 2.1 MTPA కి చేరింది.


మ్యాన్‌కైండ్ ఫార్మా: ఈ కంపెనీలో 2.90 శాతం వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించాలని బీజ్ (Beige) ప్రయత్నిస్తోంది. ఒక్కో షేరును రూ. 2,103-2,214 మధ్యలో అమ్మొచ్చని అంచనా. శుక్రవారం ఈ స్టాక్‌ రూ. 2,208.20 వద్ద ముగిసింది. ప్రస్తుతం, బీజ్‌కు మ్యాన్‌కైండ్‌లో 2.99 శాతం వాటా ఉంది.


RIL: MSKVY 19వ సోలార్ SPVలో, MSKVY 22వ సోలార్ SPVలో 100 శాతం వాటాను  రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (RIL) కొనుగోలు చేసింది. MSEB సోలార్ ఆగ్రో పవర్ నుంచి ఈ స్టేక్‌ కైవసం చేసుకుంది.


ICICI సెక్యూరిటీస్: మర్చంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, రికార్డుల తనిఖీ తర్వాత.. సెబీ నుంచి ఒక హెచ్చరికను అందుకుంది.


JSW ఎనర్జీ: మహారాష్ట్రలో 45 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును కొనుగోలు చేసేందుకు JSW ఎనర్జీ స్టెప్-డౌన్ యూనిట్‌కు - రిలయన్స్ పవర్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం విలువ రూ.132 కోట్లు.


RVNL: కోల్‌కతాలోని రెసిడెన్షియల్ కాలనీకి కలుపుతూ సబ్‌వేను నిర్మించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాతో రైల్ వికాస్ నిగమ్ MoU కుదుర్చుకుంది. దీని అంచనా విలువ రూ.229.43 కోట్లు. 


ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్‌: రూల్స్‌ ఉల్లంఘనలకు సంబంధించి.. IIFL ఫైనాన్స్ లిమిటెడ్‌, JM ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్‌లో (JMFPL) ప్రత్యేక ఆడిట్‌ జరగనుంది. దీనికోసం ఆడిటర్లను నియమించే ప్రక్రియను RBI ప్రారంభించింది.


లుపిన్: భారత్‌లోని తన జనరిక్స్ వ్యాపారాలను స్లంప్ సేల్ ప్రాతిపదికన రూ. 100-120 కోట్లకు విక్రయించనుంది.


HAL: గయానా డిఫెన్స్ ఫోర్స్ నుంచి రూ.194 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందింది.


సంఘీ ఇండస్ట్రీస్: ప్రమోటర్ అయిన అంబుజా సిమెంట్స్, సంఘీ ఇండస్ట్రీస్‌లో 2 శాతం వాటాను రూ.258 కోట్లకు అమ్మేసింది. దీంతో ప్రమోటర్ వాటా 60.44 శాతానికి తగ్గింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: బీమా పాలసీ సరెండర్ రూల్స్‌ - ఇప్పటివరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క