Stock Market Today, 23 February 2024: టెక్ స్టాక్స్ ఈ రోజు (శుక్రవారం) కూడా ర్యాలీ చేయవచ్చు, బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీని మరోమారు లైఫ్ టైమ్ హై స్థాయికి తీసుకొళ్లొచ్చు. గురువారం ఇంట్రాడే ట్రేడ్‌లో, 22,252 వద్ద తాజా జీవితకాల గరిష్ఠ స్థాయిని NSE నిఫ్టీ నమోదు చేసింది. మరోవైపు, BSE సెన్సెక్స్ దాని రికార్డు స్థాయి 73,428 నుంచి కేవలం 270 పాయింట్ల దూరంలో ఉంది.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 29 పాయింట్లు లేదా 0.13 శాతం రెడ్ కలర్‌లో 22,309 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో... ఈ ప్రారంభ సెషన్‌లో ఆస్ట్రేలియా ASX200, దక్షిణ కొరియా యొక్క కోస్పి, హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్, చైనా షాంఘై కాంపోజిట్ 0.5 శాతం నుంచి 0.7 శాతం వరకు లాభపడ్డాయి. పబ్లిక్ హాలిడే కారణంగా జపాన్ నికాయ్ ఈ రోజు పని చేయదు.
నిన్న, యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. చిప్ దిగ్గజం ఎన్‌విడియా అద్భుతమైన త్రైమాసిక ఫలితాలను పోస్ట్ చేయడంతో, S&P 500 రికార్డు స్థాయికి చేరుకుంది, ఇది టెక్ సెక్టార్‌ను అమాంతం పెంచింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్ 2.11 శాతం పెరిగి 5,087.03 వద్ద ముగిసింది, 2023 జనవరి తర్వాత, ఒక రోజు గరిష్ట లాభం ఇది. నాస్‌డాక్ కాంపోజిట్ 2.96 శాతం ఎగబాకింది, 2023 ఫిబ్రవరి తర్వాత అత్యుత్తమ ఇంట్రాడేను చూసింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 1.18 శాతం లాభపడి, మొదటిసారిగా 39,000 పైకి చేరింది, కొత్త గరిష్ట స్థాయి 39,069.11 వద్ద ముగిసింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
వొడాఫోన్ ఐడియా: నిధుల సమీకరణ ప్రతిపాదనలను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 27న సమావేశం అవుతుంది.
స్పైస్‌జెట్: చర్చలు విఫలం కావడంతో, బెల్జియంకు చెందిన 'ఇంజిన్ లీజ్ ఫైనాన్స్ బీవీ' లీజుకు ఇచ్చిన ఇంజన్‌ను మార్చి 10లోగా తన సొంత ఖర్చుతో తిరిగి ఇచ్చేయాలని దిల్లీ హైకోర్టు స్పైస్‌జెట్‌కూ సూచించింది. మరోవైపు, ఈక్విటీ & వారెంట్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ కింద, రెండో విడతలో, రూ.316 కోట్లను స్పైస్‌జెట్ సమీకరించింది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: Q3 నికర లాభం YoYలో 12.8 శాతం పెరిగి రూ. 134.64 కోట్లకు చేరుకుంది. క్రితం సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.119.34 కోట్లుగా ఉంది. నికర వడ్డీ ఆదాయం 24.4 శాతం పెరిగి రూ.548.5 కోట్లకు చేరుకుంది.
అశోక్ లేలాండ్: మూడు మిలియన్ల వాహనాల ఉత్పత్తి మైలురాయిని చేరినట్లు ఈ కంపెనీ ప్రకటించింది.
ఒలెక్ట్రా గ్రీన్‌టెక్: 2,400 ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా, నిర్వహణ కోసం ముంబైకి చెందిన బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై & ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్ (బెస్ట్) నుంచి రూ.4,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్ గెలుచుకుంది.
ఏంజెల్ వన్: ఫిన్‌టెక్ రంగంలో మరిన్ని పెట్టుబడుల కోసం రూ.2,000 కోట్లను సమీకరించాలని యోచిస్తోంది. ఈక్విటీ & మ్యూచువల్ ఫండ్స్‌ను మించి ప్రొడక్ట్స్ విస్తరించాలని బ్రోకరేజ్ భావిస్తోంది.
టాటా ఎల్‌క్సీ: సురక్షితమైన 5G నెట్‌వర్క్‌లను రూపొందించడానికి, నెట్‌వర్క్‌ను 6G కోసం సిద్ధంగా మార్చడానికి, అక్యుక్నాక్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: కాస్త ఊరటనిచ్చిన గోల్డ్ రేట్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే!