Ideas Of India Summit 2024: ఏబీపీ నెట్ వర్క్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్‌కు వేళైంది. ముంబై వేదికగా శుక్ర, శనివారాల్లో జరిగే ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో నిపుణులు పాల్గొంటారు. మన దైనందిన జీవితాలను ప్రభావితం చేసే చిన్న చిన్న అంశాలను కూడా వివిధ కోణాల్లో చర్చించి.. భవిష్యత్ లో ప్రపంచాన్ని మార్చే అద్భుతమైన విషయాలను , ఆలోచలను పంచుకోవడానికి ఈ వేదిక అవకాశం కల్పిస్తోంది. భారతదేశం , ప్రపంచం ఎలా ముందుకు పురోగమించాలో 2024 నిర్ణయించనుంది. సమాజం, సంస్కృతి, రాజకీయాలు, మంచి, చెడు, వికృతమైన మార్పులను అంచనా వేసి, తమకు ఏం కావాలో ప్రపంచానికి తెలియజేసే 'పీపుల్స్ ఎజెండా' సంవత్సరం ఇది. ఐడెంటిటీ పాలిటిక్స్ నుండి వాతావరణ మార్పు వరకు, కృత్రిమ మేధస్సు సవాళ్లు నుండి ప్రపంచ శక్తి విపత్తు వరకు ఐడియాస్ ఆఫ్ సమ్మిట్‌లో చర్చిస్తారు. యూరోపియన్ యుద్ధం నుంచి నేర్చుకోవాల్సిన "పాలి క్రైసిస్" అంశాలపైనా ప్రపంచం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఎలా చూసినా 2024 ఓ గేమ్ చేంజర్ సంవత్సరం అనుకోవచ్చు.
ముఖ్య అతిథులు వీరే
ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0లో బ్రిటీష్ ఎంపీ సుయెల్లా బ్రేవర్ మన్, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఇండో-అమెరికన్ రచయిత్రి, మోడల్ పద్మ లక్ష్మి, కళాకారిణి సుబోధ్ గుప్తా, రచయిత అమిష్ త్రిపాఠి, నటి కరీనా కపూర్ ఖాన్, ఫైనాన్స్ కమిషన్ చైర్ పర్సన్ అరవింద్ పనగరియా, పొలిటికల్ సైంటిస్ట్ సునీల్ ఖిల్నానీ, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తో పాటు ఇంకా చాలా మంది ప్రముఖులు పాల్గొంటారు.
వీటిపై డిబేట్
ఏబీపీ నెట్వర్క్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ 2024 ఏడాదిలో రాబోయే అనేక సంక్లిష్టతలను ఛేదించడానికి ఆలోచనా పరులైన దిగ్గజాలను ఆహ్వానిస్తోంది. ప్రపంచం మొత్తానికి సంబంధించిన ఈ ఏడాది చోటు చేసకోబోయే మార్పులు.. వాటి వల్ల ఏర్పడే పరిణామాలపై చర్చిస్తారు. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రకంపనలతో పాటు నిరంతర యుద్ధం, అంతకంతకూ బలపడుతున్న చైనా వంటి ప్రపంచ విషాయలను.. విశ్లేషిస్తారు. వాతావరణ మార్పులు , మానవ వలసలు వంటి సవాళ్లతో పాటు దీర్ఘకాలిక పరిణామాలు వాటికి అవసరమైన పరిష్కారాలనూ విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఎలా చూసినా ప్రపంచం మొత్తానికి ఓ ప్రత్యేక సంవత్సరం అవుతుంది.
ఇవీ కార్యక్రమాలు
- జాతీయవాదంపై భారత ఎంపీ డాక్టర్ శశిథరూర్, యుకే ఎంపీ సుయెల్లా బ్రేవేర్ మన్ ముఖాముఖి.
- న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ రచయిత, మోడల్ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సహ వ్యవస్థాపకురాలు, మాజీ టాప్ చెఫ్ పద్మాలక్ష్మి ఎమ్మీ సమ్మిట్ లో ప్రపంచంలో రుచుల గురించి వివరిస్తారు.
- డాక్టర్ శశి థరూర్, పార్లమెంట్ సభ్యుడు, డా.వినయ్ సహస్రబుద్ధే, INC - తిరువనంతపురం, రచయిత, రంభౌ మల్గి ప్రభోదిని, వైస్ ఛైర్మన్, NEC సభ్యుడు, బీజేపీ మధ్య డిబేట్
- భారతదేశ అద్భుత కళాకారుడు సుబోధ్ గుప్తా కార్యక్రమం
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మేడిన్ ఇండియా గ్లోబల్ బ్రాండ్ వెనుక ఉన్న మానవ కృషి, కళాత్మకతను 'సబ్యసాచి' వ్యవస్థాపకుడు, సబ్యసాచి సవివరంగా వివరిస్తారు.
- ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ సునీల్ ఖిల్నాని వారి ఆలోచనలను వివరిస్తారు.
- ఫైనాన్స్ కమిషన్ ఛైర్ పర్సన్ డాక్టర్ అరవింద్ పనగరియా, ఇతర ప్రముఖులు సైతం సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలు, ఆలోచనలను వివరిస్తారు.