ABP Network Ideas Of India Summit 3.0: భారతదేశం.. అధిక జనాభా సామర్థ్యంతో పాటు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ మంది పని చేసే వయసులో ఉన్న వారిని కలిగి ఉంది. ఆహారం నుంచి ఫ్యాషన్ వరకూ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు మనం సాగాలి. మన మేథస్సు, సాంకేతికతలో మార్పులు మనల్ని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. భారతదేశం, అంతర్గత వైరుధ్యాలున్నా.. ఈ రోజు స్థిరత్వంతో దూసుకెళ్తోంది. దేశ ప్రజలు 2024 సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు.. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ, నిర్ణయాత్మక ప్రభుత్వం అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తమ నిర్ణయాన్ని వెలువరిస్తారు.


ఓవైపు ఆశలు, మరోవైపు సంక్షోభాలతో ప్రపంచం నిండి ఉంది. గుర్తించదగిన రాజకీయాలు, వాతావరణ మార్పులు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచ శక్తి విపత్తులు, క్రూరమైన యూరోపియన్ యుద్ధాలు మానవాళికి సవాళ్లుగా మారాయి. అమెరికన్ చరిత్రకారుడు ఆడమ్ టూజ్ ‘పాలీ క్రిసిస్’ అని పిలిచే దానిలో మానవత్వం ఉన్నట్లుగా ప్రస్తుతం అనిపిస్తోంది.


2024వ సంవత్సరం భారతదేశం, ప్రపంచం ఏ మార్గంలో ముందుకు సాగాలో నిర్ణయించనుంది. సమాజం, సంస్కృతి, రాజకీయాల్లో మంచి చెడు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో చెప్పేదే ఈ ‘ది పీపుల్స్ ఎజెండా’ ఇయర్. ఎప్పటిలాగే, ABP నెట్ వర్క్ ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా’ సమ్మిట్ 2024.. అత్యుత్తమ, ప్రతిభాశీలురు, ప్రముఖులను ఆహ్వానిస్తుంది. ఎన్నో గొప్ప అంచనాలు, ఆశలతో అందరి అభిప్రాయాలను మీ ముందుకు తీసుకొస్తోంది. 


రాజకీయం అంటే పవర్, కార్పొరేట్ జీవితం, పర్యావరణ వ్యవస్థ వంటి అంశాల్లో ‘భారతదేశ ఆలోచనలు’ తన ఎజెండాలో ప్రజల ముందుంచుతుంది. ఇది కచ్చితంగా స్వేచ్ఛ, న్యాయం, సమానత్వం, వైవిధ్యం, సుస్థిరత వంటి గొప్ప ఆలోచనలు జీవన మార్గాన్ని ఎలా మారుస్తాయో ప్రశ్నిస్తుంది. ప్రజలు మరి ఆలోచిస్తారా, అలానే జీవిస్తారా, ప్రశ్నిస్తారా.?


ప్రముఖ కార్యక్రమాలు


1.సుయెల్లా బ్రవేర్ మన్ & శశిథరూర్ ముఖాముఖి


భారత్ లో జరిగిన దోపిడీల ద్వారా అందిన ఆర్థిక సహాయంతోనే బ్రిటన్ 200 ఏళ్లుగా అభివృద్ధి చెందిందని భారత ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. భారత్ కు బ్రిటన్ నైతికంగా, ఆర్థికంగా రుణపడి ఉంటుందని ఆయన అన్నారు. భారత్ లో బ్రిటిష్ సామ్రాజ్యం మౌలిక సదుపాయాలు, చట్ట పాలనను తీసుకొచ్చిందని యుకే ఎంపీ సుయెల్లా బ్రవర్ మన్ విశ్వశిస్తున్నారు. ఆమె తనను తాను బ్రిటిష్ సామ్రాజ్య గర్వించదగిన బిడ్డగా చెప్పుకొంటున్నారు. ఆమె క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు.


జాతీయవాదంపై భారత ఎంపీ డాక్టర్ శశిథరూర్, యుకే ఎంపీ సుయెల్లా బ్రేవేర్ మన్ ముఖాముఖి.. ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0. ఫిబ్రవరి 23, 24, 2024.


2.పద్మాలక్ష్మి, ఇండో అమెరికన్ రచయిత్రి, మోడల్, కార్యకర్త, టీవీ హోస్ట్


పద్మాలక్ష్మి ఎమ్మీ - నానినేటెడ్ నిర్మాత, మాజీ టాప్ చెఫ్ హెస్ట్, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ రచయిత, మోడల్ ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సహ వ్యవస్థాపకురాలు, ACLU మహిళా కళాకారులు, వలసదారుల హక్కుల కోసం అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే, యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం అంబాసిడర్ గానూ వ్యవహరిస్తున్నారు. భారత దేశంలో సంప్రదాయ ప్రసిద్ధ రుచులు, పాకశాస్త్ర ప్రావీణ్యంపై అమెరికన్లకు అవగాహన కల్పించడం ఆమె లక్ష్యం. ఆహారాన్ని తయారు చేసిన ఆమె చేతుల వెనుక దాగిన కథను తెలుసుకోవడానికి ఇదే అవకాశం.


ABP నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ లో పద్మాలక్ష్మితో దేశం, ప్రపంచంలో రుచుల గురించి తెలుసుకోండి.


3.డాక్టర్ శశి థరూర్, పార్లమెంట్ సభ్యుడు, డా.వినయ్ సహస్రబుద్ధే, INC - తిరువనంతపురం, రచయిత, రంభౌ మల్గి ప్రభోదిని, వైస్ ఛైర్మన్, NEC సభ్యుడు, బీజేపీ


భారతదేశంలోని ప్రముఖ ఉదారవాద ఆలోచనాపరుల్లో ఒకరు ప్రధాన మితవాద భావజాలం కలిగిన వారితో సరిపోలారు. ABP నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0లో వీరి ఇంటరాక్షన్ చూడండి.


4.సుబోధ్ గుప్తా, ప్రముఖ కళాకారుడు


సుబోధ్ గుప్తా, భారతదేశ అద్భుత కళాకారుడు. ABP నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0లో అద్భుత ప్రతిభతో జ్ఞాపకశక్తి, ప్రామాణికతలో మనల్ని తిరిగి బీహార్ తీసుకెళ్తారు.


5.సబ్యసాచి, వ్యవస్థాపకుడు, సబ్యసాచి


ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మేడిన్ ఇండియా గ్లోబల్ బ్రాండ్ వెనుక ఉన్న మానవ కృషి, కళాత్మకతను సవివరంగా వివరిస్తారు. ABP నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0లో ఆయన లైవ్ ప్రోగ్రాం చూడండి.


6.ప్రొఫెసర్ సునీల్ ఖిల్నాని, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు


ఐడియాస్ ఆఫ్ ఇండియా అనే పదానికి రూపకర్త అయిన వ్యక్తి ABP నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0లో దానికి సంబంధించిన ఆలోచనలు, ఉపయోగాలు వంటి వాటిపై వివరిస్తారు.


7. కరీనా కపూర్ ఖాన్, ప్రముఖ నటి


నాల్గోతరం నటీమణుల్లో గొప్ప నటి. ఆమె రాసే వ్యాసాలన్నింటిలోనూ స్త్రీల గొప్పతనం, బలం వంటి వాటిని ప్రముఖంగా ప్రస్తావిస్తారు. ABP నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0లో ఆమె లైవ్ చూడండి.


8.డా.అనీష్ షా, మహీంద్రా గ్రూప్ ఎండీ & సీఈవో, FICCI ప్రెసిడెంట్


భారత ప్రభుత్వం నుంచి India Inc ఆశించే దేశ అగ్రగామి మేనేజర్లలో ఒకరు. ABP నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 3.0లో ఆయన లైవ్ చూడండి.


9.డాక్టర్ అరవింద్ పనగరియా, ఫైనాన్స్ కమిషన్ ఛైర్ పర్సన్


భారతదేశ ఆర్థిక వ్యవస్థతో జీవిత కాలం అనుబంధం ఈయనకు ఉంది. ఆర్థిక పరంగా దేశం ప్రస్తుతం ఎక్కడ ఉంది.. భవిష్యత్తులో ఎక్కడికి పోతున్నాం అనే దానిపై సవివరమైన అవగాహన కల్పిస్తారు.