Stock Market Today, 22 December 2023: గ్లోబల్‌ సంకేతాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో, ఇండియన్‌ బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు ఈ రోజు (శుక్రవారం, 22 డిసెంబర్‌ 2023) ట్రేడింగ్ సెషన్‌ను పాజిటివ్‌ నోట్‌తో ప్రారంభించొచ్చు. 


ఇటీవల జరిగిన ద్రవ్య విధాన సమావేశం మినిట్స్‌ ఈ రోజు విడుదలవుతాయి, ఇది మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటుంది. 


ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని సడలిస్తుందన్న ఆశావాదానికి యూఎస్‌ ఎకనమిక్‌ డేటా ఆజ్యం పోయడంతో నిన్న (గురువారం) అమెరికన్‌ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నాస్‌డాక్ 1.3 శాతం జూమ్ అవ్వగా, S&P 500 1 శాతం ర్యాలీ చేసింది, డౌ జోన్స్ 0.9 శాతం లాభపడింది.


యూఎస్‌ మార్కెట్లలోని ఉత్సాహాన్ని ఆసియా మార్కెట్లు అందిపుచ్చుకున్నాయి, ఈ ఉదయం స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. జపాన్ నికాయ్‌ 0.2 శాతం పెరిగింది. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియా కోప్సీ 0.3 శాతం వరకు పెరిగాయి. హాంగ్ సెంగ్ కూడా 0.3 శాతం లాభపడింది.


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 41 పాయింట్లు లేదా 0.19% రెడ్‌ కలర్‌లో 21,379 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


అదానీ గ్రీన్: గౌతమ్ అదానీ, అతని ఫ్యామిలీ కలిసి అదానీ గ్రీన్‌లోకి పెట్టుబడులు పెంచుకునే ప్లాన్‌లో ఉన్నాయి. ఈ పునరుత్పాదక శక్తి యూనిట్‌లోకి, తమ సొంత డబ్బు 1 బిలియన్‌ డాలర్లను తీసుకురావాలని భావిస్తున్నాయి.


టాటా మోటార్స్, టాటా మోటార్స్ DVR: టాటా మోటార్స్ 'A' ఆర్డినరీ షేర్ల (DVR) రద్దును BSE & NSE ఆమోదించాయి, ఆర్డినరీ షేర్లను కేటాయించాయి. కంపెనీ, వాటాదార్లు, రుణదాతల మధ్య వీటిని అరేంజ్‌ చేసే పథకాన్ని కూడా ఎక్స్ఛేంజీలు ఆమోదించాయి.


జొమాటో: 2 బిలియన్‌ డాలర్లు పెట్టి లాజిస్టిక్స్ అగ్రిగేటర్ షిప్‌రాకెట్‌ను కొనుగోలు చేస్తున్నామన్న వార్తలను జొమాటో ఖండించింది.


LIC: కంపెనీలో 25 శాతం మినిమమ్‌ పబ్లిక్ షేర్‌హోల్డింగ్ (MPS) నిబంధన నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి మినహాయింపు లభించింది. ఈ బీమా కంపెనీ షేర్లు మే 17, 2022న లిస్ట్ అయ్యాయి. దీని ప్రకారం, 2027 నాటికి 25 శాతం MPS ఉండాలి. దీని కోసం 10 సంవత్సరాల పొడిగింపు తీసుకుంది.


ఆల్‌కార్గో లాజిస్టిక్స్, ఆల్‌కార్గో గతి: వ్యాపారాల పునర్వ్యవస్థీకరణకు రెండు కంపెనీల బోర్డులు గురువారం ఆమోదం తెలిపాయి. 


GMR ఎయిర్‌పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: అనుబంధ సంస్థ GMR ఎయిర్‌పోర్ట్స్, ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురంలో నెలకొల్పే విమానాశ్రయంలో రూ.675 కోట్ల పెట్టుబడి పెట్టడానికి నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌తో (NIIF) ఒప్పందం కుదుర్చుకుంది.


రైల్‌టెల్ కార్పొరేషన్: ఈ కంపెనీ రూ.66.8 కోట్ల విలువైన ఆర్డర్‌ను గెలుచుకుంది.


లుపిన్: సాఫ్ట్‌టోవాక్ లిక్విఫైబర్ అనే ఔషధాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. 


మొయిల్‌: 2023 డిసెంబర్ 20 నాటికి కంపెనీ, 16 లక్షల మెట్రిక్ టన్నుల మార్కును అధిగమించింది. 2019లోని గత గరిష్ట స్థాయి కంటే ఇది 26 శాతం ఎక్కువ.


బాటా ఇండియా: రిటైల్ & ఫ్రాంఛైజీ కార్యకలాపాల విభాగం అధిపతి పదవికి పంకజ్ గుప్తా రాజీనామా చేస్తారని కంపెనీ ప్రకటించింది. 2024 మార్చి 1 నుంచి బాటా గ్రూప్‌లో గ్లోబల్ పొజిషన్‌కు ఆయన వెళతారని తెలిపింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఈ ఏడాది బెస్ట్‌ మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ - ఇన్వెస్టర్ల డబ్బు 47 శాతం పెరిగింది