Stock Market Today, 18 January 2024: బుధవారం నాటి నష్టాలను భారతీయ మార్కెట్లు ఈ రోజు‍ (గురువారం) కూడా కంటిన్యూ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న, హెవీవెయిట్ HDFC బ్యాంక్ 8% పడిపోవడం, రేట్‌ కట్స్‌ మీద ఆశలు తగ్గడంతో BSE, NSE తలో 2% పైగా క్రాష్ అయ్యాయి. Q3 ఫలితాలు ఈ రోజు కూడా మార్కెట్‌ను నడిపిస్తాయి. 


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 44 పాయింట్లు లేదా 0.21% రెడ్‌ కలర్‌లో 21,405 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-డౌన్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్ మార్కెట్లు
నిన్న, USలో, S&P 500 0.56 శాతం, డౌ జోన్స్‌ 0.25 శాతం, నాస్‌డాక్ 0.59 శాతం నష్టపోయాయి. ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. హాంగ్ సెంగ్, CSI 300 0.6 శాతం వరకు తగ్గాయి. నికాయ్‌ ఫ్లాట్‌గా ఉంది. ASX 200 0.6 శాతం తగ్గింది. కోస్పి 0.6 శాతం లాభపడింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: యాక్సెల్య సొల్యూషన్స్ ఇండియా, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, ఇండియామార్ట్ ఇంటర్‌మెష్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఇన్నోవా క్యాప్టాబ్, జిందాల్ స్టెయిన్‌లెస్, మాస్టెక్, మెట్రో బ్రాండ్స్, పాలిక్యాబ్ ఇండియా, పూనవల్ల ఫిన్‌కార్ప్, రామకృష్ణ ఫోర్జింగ్స్, షాపర్స్ స్టాప్, సౌత్ ఇండియన్ బ్యాంక్, సుప్రీమ్ పెట్రోకెమ్, స్టెర్లింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ, టాటా కమ్యూనికేషన్స్.


NHPC: ఈ ప్రభుత్వ రంగ సంస్థలో 3.5 శాతం వాటాను రూ.66 ఫ్లోర్ ప్రైస్‌కు కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తుంది. బుధవారం నాటి ముగింపు ధర కంటే ఇది 9.66 శాతం డిస్కౌంట్‌.


HDFC బ్యాంక్: న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో, HDFC బ్యాంక్ అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్‌ (ADRs) బుధవారం మరో 9 శాతం పడిపోయాయి, దీనికి ముందు రోజు 7 శాతం పతనమయ్యాయి. Q3FY24 ఫలితాల తర్వాత, బుధవారం, ఇండియన్‌ మార్కెట్‌లో ఈ కంపెనీ షేర్లు 8 శాతం క్షీణించాయి.


ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్: ప్రయాణీకులను ముంబై విమానాశ్రయంలో టార్మాక్‌పై కూర్చుని తినడానికి అనుమతించి, తద్వారా విమానయాన భద్రత నియమాలను ఉల్లంఘించినందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ. 1.2 కోట్ల జరిమానాను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) విధించింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: రూ.50 వేల కోట్లతో 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఒక అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది.


LTI మైండ్‌ట్రీ: డిసెంబర్‌ త్రైమాసికంలో ఈ టెక్‌ కంపెనీ YoYలో 16.8 శాతం, QoQలో 0.6 శాతం వృద్ధితో రూ. 1,169 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4.6 శాతం పెరిగి రూ.9,017 కోట్లకు చేరింది. ఈ రెండు నంబర్లు మార్కెట్‌ అంచనాల కంటే తక్కువగా ఉన్నాయి.


జాగిల్‌ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్: క్లోజ్-లూప్ ఫ్లీట్ ప్రోగ్రామ్‌ను అమలు చేయడానికి టోరెంట్ గ్యాస్ నుంచి రూ.200 కోట్ల విలువైన ఆర్డర్‌ గెలుచుకుంది.


ICICI ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్: 2023 డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో, ఈ బీమా సంస్థ రూ.227 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది, గత ఏడాది ఇది రూ. 221 కోట్లుగా ఉంది.


భారత్ ఎలక్ట్రానిక్స్: రూ. 1,034.31 కోట్ల విలువైన రెండు ఆర్డర్లను ఈ కంపెనీ దక్కించుకుంది.


నజారా టెక్నాలజీస్: ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా రూ.250 కోట్లు సమీకరించాలని నజారా టెక్నాలజీస్ ప్లాన్‌ చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: కుప్పకూలిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే