Stock Market Today, 18 December 2023: ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు గత వారం చివరిలో ఫుల్ జోష్‌తో ర్యాలీ చేశాయి. గత వారంతో కలుపుకుని, వరుసగా ఏడో వారంలో లాభాల పరంపర కొనసాగించాయి. గత ఏడు వారాల్లో బెంచ్‌మార్క్ సూచీలు 13 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు లేవు. దీంతో, ఈక్విటీల ర్యాలీకి అడ్డుపడే నెగెటివ్ ఫ్యాక్టర్స్ కనిపించడం లేదు.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 33 పాయింట్లు లేదా 0.15% గ్రీన్ కలర్‌లో 21,487 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు ఫ్లాట్‌గా ఓపెన్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
జీ ఎంటర్‌టైన్‌మెంట్: సోనీ ఇండియాతో ప్రతిపాదిత విలీనాన్ని ముగించడానికి డిసెంబర్ 21 కటాఫ్ తేదీ. ఈ తేదీని మరింత పొడిగించాలని మీడియా దిగ్గజం భావిస్తోంది. రెండు కంపెనీల మధ్య విలీనానికి అవసరమైన అనుమతులు లభించినా, విలీన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) ఎవరిని నియమించాలన్న అంశంపై రెండు సంస్థల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు.
సన్ ఫార్మా, లుపిన్: US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (US FDA) ప్రకారం, తయారీ సమస్యల వల్ల ఈ రెండు రెండు ఫార్మా కంపెనీల ఉత్పత్తులను అమెరికన్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుంటున్నాయి. సన్ ఫార్మా 96,192 బాటిళ్ల లియోథైరోనిన్ సోడియం టాబ్లెట్‌లను రీకాల్ చేస్తోంది. లుపిన్ కూడా పెన్సిల్లమైన్ టాబ్లెట్‌లను రీకాల్ చేస్తోంది. అయితే, ఎంత మొత్తంలో ఈ రీకాల్ ఉందో వెల్లడించలేదు.
SBI: భారతదేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగం బ్యాంక్ SBI, తాను ఇచ్చే అన్-సెక్యూర్డ్ లోన్స్‌ను తగ్గిస్తోంది, ఆరోగ్యకరమైన వృద్ధిపై దృష్టి పెడుతోంది. అన్-సెక్యూర్డ్ లోన్స్ తగ్గించినా, కార్పొరేట్ల నుంచి స్థిరమైన డిమాండ్ వల్ల మొత్తం రుణ వృద్ధి FY24లో 15 శాతం వద్ద పటిష్టంగా ఉంటుందని చైర్మన్ దినేష్ ఖరా చెప్పారు.
బాటా ఇండియా: కంపెనీ కొత్త వ్యూహం ప్రకారం, ఈ ఫుట్‌వేర్ కంపెనీ 'నైన్ వెస్ట్'తో లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ లైసెన్స్ ప్రకారం, నైన్ వెస్ట్ పాదరక్షలు, హ్యాండ్‌బ్యాగ్‌లు వంటివి బాటా భారత్‌లో తయారు చేస్తుంది, విక్రయిస్తుంది. ఇంకా, మార్కెట్‌లో వాటా పెంచుకోవడానికి, తన Floatz ఉత్పత్తి శ్రేణిని క్రోక్స్, బిర్కెన్‌స్టాక్ కంటే తక్కువ ధరకు మార్కెట్‌లో రిలీజ్ చేస్తుంది.
NTPC: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో సిపట్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ సామర్థ్యాన్ని మరో 800 మెగావాట్లు పెంచాలని ఎన్‌టీపీసీ ఆలోచిస్తోంది.
కేర్ రేటింగ్స్: 2021 డిసెంబర్ - 2023 ఏప్రిల్ మధ్య జరిగిన తనిఖీలో గమనించిన కొన్ని తేడాలపై సెబీ (SEBI) నుంచి వార్నింగ్ అందుకుంది. కేర్ రేటింగ్స్ ఆ తేడాలను సరిదిద్దాలి, తీసుకున్న చర్యలపై 30 రోజుల లోపు నివేదికను సమర్పించాలి.
PCBL: కంపెనీ రుణ పరిమితిని రూ.6,000 కోట్లకు పెంచేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.
ఈ రోజు F&O నిషేధంలో స్టాక్స్: బలరామ్‌పూర్ చీని, డెల్టా కార్ప్, హిందుస్థాన్ కాపర్, ఇండియా సిమెంట్స్, మణప్పురం ఫైనాన్స్, సెయిల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: క్రెడిట్ కార్డ్ వద్దనుకుంటే క్యాన్సిల్ చేయండి, లేకపోతే మీకే నష్టం, ఇదిగో ఈజీ ప్రాసెస్