Stock Market Today, 17 November 2023: గ్లోబల్ మార్కెట్లలో మాయమైన పాజిటివ్ సెంటిమెంట్ వల్ల, ఇండియన్ ఈక్విటీల రెండు రోజుల విజయ పరంపరకు ఈ రోజు బ్రేక్ పడవచ్చు. అయితే.. నిఫ్టీ50 పైకి పాకుతుందని, 19850-19900 స్థాయిల వైపు కొనసాగుతుందని ఎనలిస్ట్‌లు ఆశిస్తున్నారు.
మిశ్రమంగా US స్టాక్స్
S&P 500, నాస్‌డాక్ గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. టెక్ & రిటైల్ జెయింట్స్ సిస్కో & వాల్‌మార్ట్ మార్కెట్ అంచనాలను మిస్ అయ్యాయి. ఆ ఒత్తిడితో డౌ ఇండస్ట్రియల్ యావరేజ్ లోయర్ సైడ్‌లో ముగిసింది.
పతనంలో ఆసియా షేర్లు
US ఆర్థిక వ్యవస్థలో క్షీణతను అక్కడి డేటా అండర్‌లైన్ చేయడంతో బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. దీంతో ఆసియాలో స్టాక్స్ పడిపోయాయి.
ఈ రోజు ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) ఫ్లాట్‌గా 19,790 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
డెలివెరీ: జపనీస్ టెక్ జెయింట్ సాఫ్ట్‌బ్యాంక్, ఈ రోజు (శుక్రవారం) బ్లాక్ డీల్స్ ద్వారా డెలివెరీలో 4% వాటాను సుమారు $150 మిలియన్లకు విక్రయించాలని చూస్తోంది. 2023 సెప్టెంబర్ చివరి నాటికి, సాఫ్ట్‌బ్యాంక్‌కు, దాని అనుబంధ సంస్థ Svf డోర్‌బెల్ (కేమాన్) ద్వారా డెలివెరీలో 14.46% వాటా ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్: RIL సబ్సిడరీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, 2023 ఆగస్టులో 32.4 లక్షల మంది యూజనర్లను కొత్తగా యాడ్ చేసుకుంది, మొత్తం వైర్‌లెస్ చందాదార్ల సంఖ్య 44.57 కోట్లకు చేరుకుందని TRAI విడుదల చేసిన డేటా ద్వారా తెలుస్తోంది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్: ఇషా అంబానీతో పాటు మరో ఇద్దరిని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్లుగా నియమించేందుకు RBI ముందస్తు అనుమతిని మంజూరు చేసింది.
భారతి ఎయిర్‌టెల్: దేశంలోని రెండో అతి పెద్ద టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్, ఆగస్టులో 12.17 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లను జోడించింది. దీంతో, ఈ నెలలో ఎయిర్‌టెల్ సిమ్ యూజర్ల సంఖ్య 37.64 కోట్లకు పెరిగింది.
వొడాఫోన్ ఐడియా: మూడో టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా, నెలనెలా తన సబ్‌స్క్రైబర్లను కోల్పోతూనే ఉంది, ఆగస్టులో నికరంగా 49,782 మందిని వదులుకుంది. ఆ నెలలో కంపెనీ వైర్‌లెస్ చందాదార్ల సంఖ్య 22.82 కోట్లకు పడిపోయింది.
హీరో మోటోకార్ప్: ఈ ఏడాది, 32 రోజుల్లో 14 లక్షలకు పైగా యూనిట్లను అమ్మడం ద్వారా ఒక పండుగ సీజన్‌లో అత్యధిక విక్రయాలను హీరో మోటోకార్ప్ నమోదు చేసింది.
మారుతి సుజుకి: దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి, పండుగ సీజన్‌లో 4,90,000 యూనిట్లను విక్రయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఉన్న 42% మార్కెట్ వాటాను కొంచెం పెంచుకుని 43%కు చేరింది.
యాక్సిస్ బ్యాంక్: KYCకి సంబంధించి రూల్స్ పాటించనందుకు యాక్సిస్ బ్యాంక్‌కు రూ.90.92 లక్షల పెనాల్టీని RBI విధించింది.
మణప్పురం ఫైనాన్స్: KYCకి సంబంధించి రూల్స్ పాటించనందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మణప్పురం ఫైనాన్స్‌కు రూ.42.78 లక్షల పెనాల్టీ విధించింది.
JSW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: కర్నాటకలోని కెని వద్ద, ప్రభుత్వ-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌తో, వాణిజ్య నౌకాశ్రయాన్ని అభివృద్ధి చేసే బిడ్స్‌లో ఈ కంపెనీ విజేతగా నిలిచింది. కర్ణాటక మారిటైమ్ బోర్డు ఈ కంపెనీకి 'లెటర్ ఆఫ్ అవార్డ్' జారీ చేసింది.
IDBI బ్యాంక్: ఈ బ్యాంక్‌లో వాటాను అమ్మే పనిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ముగించాలని భారత ప్రభుత్వం భావించడం లేదు. ఈ బ్యాంక్‌లో ఇండియన్ గవర్నమెంట్‌కు 45.48% వాటా, LICకి 49.24% వాటా ఉన్నాయి. ఈ రెండూ కలిసి 60.7% వాటాను విక్రయించాలని భావిస్తున్నాయి.
SJVN: 200 మెగావాట్ల పవన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు SJVN ప్రకటించింది.
ఇన్ఫో ఎడ్జ్ ఇండియా: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు రూ.10 ఎక్స్-డివిడెండ్ డేట్‌లో ట్రేడ్ అవుతాయి.
పేజీ ఇండస్ట్రీస్: ఈ కంపెనీ షేర్లు కూడా ఈ రోజు రూ.75కి ఎక్స్-డివిడెండ్ డేట్‌లో ట్రేడ్ అవుతాయి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: టాటా టెక్ IPO ధరల వివరాలు వచ్చేశాయ్,మినిమమ్ ఇంత ఇన్వెస్ట్ చేయాలని కండీషన్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial