Tata Technologies IPO Price:
టాటా IPO ధరలు ఎంతంటే..?
Bussiness News in Telugu: దాదాపు రెండు దశాబ్దాల తరవాత టాటా గ్రూప్ (Tata Group IPO) నుంచి టాటా టెక్నాలజీస్ IPOని లాంఛ్ చేయనుంది. చాలా రోజులుగా టాటా టెక్నాలజీస్ IPO వివరాల కోసం చాలా రోజులుగా ఇన్వెస్టర్‌లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన (Tata Technologies IPO Details) పూర్తి డిటెయిల్స్ విడుదలయ్యాయి. ఒక్కో ఈక్విటీ షేర్‌కి IPO ప్రైస్ బ్యాండ్‌ని రూ.475-500 మధ్యలో ఫిక్స్ చేసింది. నవంబర్ 22న ఈ IPO సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం కానుంది. నవంబర్ 24వ తేదీన ముగుస్తుంది. ఈ గ్రూప్ నుంచి 2004లో చివరిసారి Tata Consultancy Services IPO వెల్లడైంది. ఆ తరవాత ఈ గ్రూప్ నుంచి వెల్లడైన IPO టాటా టెక్నాలజీస్‌ది మాత్రమే. టాటా మోటార్స్‌కి సబ్సిడీ కంపెనీ అయిన టాటా టెక్నాలజీస్..ఈ IPO ద్వారా మొత్తంగా రూ.3,042 కోట్లు సేకరించనుంది. అయితే...రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 30 షేర్లను కొనుగోలు చేయాల్సిందేనని కండీషన్ పెట్టింది. అంటే...రూ.500 వేసుకున్నా గరిష్ఠంగా రూ.15 వేలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ IPO ద్వారా టాటా మోటార్స్ తమ వాటాలో 11.4% మేర ఉపసంహరించుకోనుంది. అయితే ఈ పబ్లిక్ ఇష్యూ పూర్తిగా offer-for-sale (OFS) ప్రాతిపదికన జరగనుంది. IPOలో కొత్త షేర్‌లు ఇష్యూ చేస్తారు. కానీ OFS విధానంలో...ప్రస్తుతమున్న షేర్‌లను ప్రమోటర్‌లు, స్టేక్‌హోల్డర్‌లు విక్రయిస్తారు. ఇలా వచ్చిన డబ్బులు నేరుగా షేర్‌హోల్డర్స్‌కే వెళ్లిపోతాయి.
OFS విధానంలో..
ఈ OFS ద్వారా టాటా మోటార్స్ రూ.2,313.75 కోట్ల విలువైన 4.62 కోట్ల ఈక్విటీ షేర్‌ల భారాన్ని దించుకోనుంది. Alpha TC Holdings Pte Ltd కంపెనీ రూ. 485.84 కోట్ల విలువైన 97.17 లక్షల ఈక్విటీ షేర్‌లను, Tata Capital Growth Fund కంపెనీ రూ.242.92 కోట్ల విలువైన 48.58 షేర్‌లను విక్రయించనుంది. ఈ IPOలో భాగంగా టాటా టెక్ 6.08 కోట్ల షేర్లను అందుబాటులో ఉంచుతోంది. ఇన్వెస్టర్లు 30 ఈక్విటీ షేర్స్‌ని బిడ్డింగ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 25వ తేదీన టాటా మోటార్స్ 3.65 కోట్ల ఈక్విటీ షేర్‌లను TPG Rise Climate SF Pte Ltd కి విక్రయించింది. ఒక్కో షేర్‌ని రూ.401.81 మేర విక్రయించింది. దీని ద్వారా రూ.1,467 కోట్లు సమీకరించింది.