Stock Market Today, 16 May 2024: అమెరికన్ మార్కెట్లు, ఆసియా మార్కెట్లు పాజిటివ్ ట్రెండ్‌లో ఉన్నాయి. ఆ పాజిటివ్‌నెస్ కూడా అంటుకుని భారతీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం) సానుకూలంగా ప్రారంభం కావచ్చు. పెట్రోలియం క్రూడ్‌పై విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం రూ. 8,400 నుంచి రూ. 5,700కు తగ్గించింది. చమురు & గ్యాస్ కంపెనీలపై దీని సానుకూల ప్రభావం ఉంటుంది.
బుధవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్ 22,200 దగ్గర క్లోజ్ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 22,385 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం, కొరియాకు చెందిన కోస్పి 1.19 శాతం పెరుగుదలతో ముందుండగా, హాంకాంగ్‌కు చెందిన హాంగ్ సెంగ్ 0.99 శాతం పెరిగింది. జపాన్‌కు చెందిన నికాయ్ కూడా 0.53 శాతం పెరిగింది.
అమెరికన్ మార్కెట్లలో, నిన్న, నాస్‌డాక్ 1.40 శాతం, S&P 500 1.17 శాతం, డౌ జోన్స్ 0.88 శాతం లాభాలతో ముగిశాయి.
అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాల తర్వాత 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ 4.324 శాతానికి తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పుంజుకున్నాయి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $83 పైకి చేరింది. గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేటు భారీగా పెరిగి పుంజుకుంది, ఔన్సుకు $2,400 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: M&M, బయోకాన్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్, మరికొన్ని కంపెనీలు.
డిక్సన్ టెక్నాలజీస్: Q4 FY24లో కంపెనీ లాభం 24.7 శాతం పెరిగి రూ.98.5 కోట్లకు చేరుకుంది. ఆదాయం 52 శాతం వృద్ధితో రూ. 4,658 కోట్లు నమోదైంది. ఎబిటా 17.3 శాతం గ్రోత్ చూపింది, రూ.183 కోట్లకు చేరుకుంది. అయితే మార్జిన్ 4 శాతానికి తగ్గింది.
LIC హౌసింగ్ ఫైనాన్స్: 2024 మార్చి త్రైమాసిక నికర లాభం గత సంవత్సరం ఇదే కాలం కంటే 7.6 శాతం తగ్గి రూ. 1,090.8 కోట్లకు పడిపోయింది. నికర వడ్డీ ఆదాయం (NII) మాత్రం అంతకుముందు సంవత్సరం ఇదే కాలంలోని రూ. 1,990.3 కోట్ల నుంచి 12.4 శాతం పెరిగి రూ. 2,237.6 కోట్లకు చేరుకుంది.
క్విక్ హీల్: సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే ఈ సంస్థ, తన సైబర్ సెక్యూరిటీ ఆఫర్స్‌ను మరింత మెరుగుపరచడానికి యూరప్‌కు చెందిన EET గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
గోవా కార్బన్: 2024 జనవరి-మార్చి కాలంలో నికర లాభం మునుపటి సంవత్సరంలోని రూ. 5.3 కోట్లతో పోలిస్తే ఏకంగా 77.4 శాతం జంప్‌తో రూ. 9.4 కోట్లకు పెరిగింది. ఆదాయం మాత్రం రూ. 316 కోట్ల నుంచి రూ. 178.5 కోట్లకు తగ్గింది, ఇది 43.5 శాతం క్షీణత. ఎబిటా రూ. 15.5 కోట్ల నుంచి రూ. 13.9 కోట్లకు 10.3 శాతం తగ్గింది. మార్జిన్ 4.9 శాతం నుంచి 7.8 శాతానికి పెరిగింది.
CMS ఇన్ఫో సిస్టమ్స్: కంపెనీ Q4 లాభం అంతకుముందు సంవత్సరం రూ. 80 కోట్లతో పోలిస్తే 14.3 శాతం పెరిగి రూ. 91.4 కోట్లకు చేరుకుంది. ఆదాయం 25.1 శాతం పెరిగి రూ. 501 కోట్ల నుంచి రూ. 627 కోట్లు నమోదైంది. ఎబిటా రూ. 143.4 కోట్ల నుంచి రూ. 8.6 శాతం గ్రోత్‌తో రూ. 155.7 కోట్లకు పెరిగింది. మార్జిన్ మాత్రం ఏడాది ప్రాతిపదికన 28.6 శాతం నుంచి 24.8 శాతానికి తగ్గింది.
ప్రికోల్: ప్రికోల్ Q4 నికర లాభం గత ఏడాది ఇదే కాలంలోని రూ.29.8 కోట్ల నుంచి 39.3 శాతం జంప్‌తో రూ.41.5 కోట్లు నమోదైంది. ఆదాయం 11.1 శాతం పెరిగి రూ. 509.7 కోట్ల నుంచి రూ. 566.2 కోట్లకు ఎగబాకింది. ఎబిటా రూ. 47.6 కోట్ల నుంచి 18.1 శాతం పెరిగి రూ. 56.2 కోట్లకు చేరింది. మార్జిన్ 9.3 శాతం నుంచి 9.9 శాతానికి వృద్ధి చెందింది.
పారదీప్ ఫాస్ఫేట్స్: మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీ ఆదాయం రూ. 3,644 కోట్ల నుంచి రూ. 2,242.7 కోట్లకు 38.5 శాతం క్షీణించినప్పటికీ, రూ. 21.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకుముందు ఏడాదిలో ఇది రూ.10 కోట్లుగా ఉంది. ఎబిటా రూ. 90.6 కోట్ల నుంచి రూ. 148.1 కోట్లకు 63.5 శాతం వృద్ధి చెందింది. మార్జిన్ సంవత్సరానికి 2.5 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: సెగ పుట్టిస్తున్న ఎల్లో మెటల్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి