Stock Market Today, 12 February 2024: Q3 ఫలితాల ప్రకటన చివరి దశలోకి వచ్చింది. చాలా ప్రముఖ కంపెనీలు తమ డిసెంబర్ త్రైమాసికం లెక్కలను శని, ఆదివారాల్లో ప్రకటించాయి. ఈ రోజు మరికొన్ని కంపెనీలు ఎర్నింగ్స్‌ను వెల్లడిస్తాయి. ఇవన్నీ మార్కెట్‌ను కదిలిస్తాయి. CPI ద్రవ్యోల్బణం డేటా, గ్లోబల్ సంకేతాలు కూడా కీలక ట్రిగ్గర్స్‌గా మారతాయి.
ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 147 పాయింట్లు లేదా 0.67 శాతం గ్రీన్ కలర్‌లో 21,921 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు గ్యాప్-అప్ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో, ఈ ఉదయం.. ఆస్ట్రేలియా ASX200 0.18 శాతం క్షీణించింది. జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, చైనా, తైవాన్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు పని చేయవు.
శుక్రవారం నాడు, అమెరికన్ స్టాక్స్ మిశ్రమంగా ముగిశాయి. S&P 500 0.57 శాతం పెరిగి తొలిసారిగా కీలకమైన 5,000 స్థాయిని అధిగమించింది. నాస్‌డాక్ 1.25 శాతం ర్యాలీ చేయగా, డౌ జోన్స్ 0.14 శాతం తగ్గింది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: 63మూన్స్, ఆల్ కార్గో లాజిస్టిక్స్, అవధ్ షుగర్, BASF, భారత్ ఫోర్జ్, BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్, కోల్ ఇండియా, ఎడెల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్,
మజగాన్‌డాక్ షిప్ బిల్డర్స్, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, NHPC.
Q3 ఫలితాల ఆధారంగా ఈ రోజు రియాక్ట్ అయ్యే స్టాక్స్: ONGC, ఫిలాటెక్స్ ఫ్యాషన్, ఆంధ్రా పెట్రోకెమ్, గ్లోబల్ సర్ఫేసెస్, MM ఫోర్జింగ్స్, థెమిస్ మెడికేర్, అరబిందో ఫార్మా, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, మనోరమ ఇండస్ట్రీస్, TVS ఎలక్ట్రానిక్స్, జగ్రాన్ ప్రకాశన్, ఆటోలైన్ ఇండస్ట్రీస్, ఎల్‌ప్రో ఇంటర్నేషనల్, అప్‌డాక్స్ సర్వీస్, అప్‌డాక్స్ సర్వీస్ ఫ్లెయిర్ రైటింగ్, అపెక్స్ ఫ్రోజెన్ ఫుడ్స్, V2 రిటైల్, మవనా షుగర్స్, అడ్వాన్స్‌డ్ ఎంజైమ్ టెక్, దివీస్ ల్యాబ్స్, నెప్జెన్ కెమికల్స్, బంధన్ బ్యాంక్, సెల్లో వరల్డ్, హ్యాపీ ఫోర్జింగ్స్, శ్రీ రేణుకా షుగర్స్, స్టవ్ క్రాఫ్ట్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మిశ్రా ధాతు నిగమ్, జూబిలెంట్ ఇండస్ట్రీస్, ITDC, IFCI.
ఏపీజే సురేంద్ర పార్క్: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి.
యథార్త్ హాస్పిటల్: ఫరీదాబాద్‌లోని ఏషియన్ ఫిడెలిస్ హాస్పిటల్‌లో 100 శాతం వాటాను 116 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ ఆసుపత్రిలో 175 పడకలు ఉన్నాయి.
IRCTC: పేమెంట్స్ అగ్రిగేటర్ వ్యాపారం కోసం 'IRCTC పేమెంట్స్ లిమిటెడ్' పేరుతో పూర్తిగా యాజమాన్యంలోని కొత్త అనుబంధ కంపెనీని ప్రారంభించింది.
ఓరియంట్ ప్రెస్: కొవ్వొత్తుల ఉత్పత్తి వ్యాపారం కోసం కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కంపెనీ బోర్డు ఆమోదించింది.
JSW గ్రూప్: కటక్, పారాదీప్‌లలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) & ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ తయారీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి ఒడిశా ప్రభుత్వంతో రూ. 40,000 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది.
డా.రెడ్డీస్ ల్యాబ్స్: హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని కంపెనీ ఫార్ములేషన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ (ఎఫ్‌టీఓ-3) పొందింది.
రైల్‌టెల్ కార్పొరేషన్: కంపెనీ రక్షణ మంత్రిత్వ శాఖ నుండి రూ.18.21 కోట్ల విలువైన ఆర్డర్ దక్కించుకుంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: స్థిరంగా పసిడి వెలుగు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే