Stock Market Today, 06 March 2024: ప్రపంచ మార్కెట్లలో భీకరమైన బలహీనత కనిపిస్తోంది, దాదాపు అన్ని మార్కెట్లు తిరోగమనంలో ఉన్నాయి. వాటిని ట్రాక్‌ చేస్తున్న ఇండియన్‌ మార్కెట్లు కూడా ఈ రోజు (బుధవారం) లోయర్‌ సైడ్‌లో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.


ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 01 పాయింట్లు లేదా 0.01 శాతం రెడ్‌ కలర్‌లో 22,426 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
యూఎస్‌ మార్కెట్లలో నష్టాలతో ఈ ఉదయం ఆసియా మార్కెట్లు కూడా చిక్కటి ఎరుపు రంగు పులుముకున్నాయి. జపాన్ నికాయ్‌ ఇండెక్స్ 0.81 శాతం లోయర్‌ సైడ్‌లో ప్రారంభమైంది. టోపిక్స్ 0.44 శాతం పడిపోయింది. దక్షిణ కొరియా కోస్పి 0.39 శాతం, స్మాల్ క్యాప్ కోస్‌డాక్ 0.55 శాతం తగ్గాయి. హాంగ్ కాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ 16,162.64 వద్ద ఉంది, ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది.


ఈ ఏడాది చైనాలో ఐఫోన్ అమ్మకాలు 24 శాతం తగ్గడంతో US మార్కెట్లలో ఆపిల్‌ షేర్లు 3 శాతం పడిపోయాయి. ఈ ఎఫెక్ట్‌తో నాస్‌డాక్‌ 1.65 శాతం పతనమైంది. డౌ జోన్స్, S&P 500 తలో 1 శాతం పడ్డాయి. భారత కాలమానం ప్రకారం, ఈ రోజు రాత్రి US ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్, యూఎస్‌ కాంగ్రెస్‌లో కీలక ప్రసంగం చేస్తారు. ఇన్వెస్టర్లు దీనిపైనా దృష్టి పెడతారు.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


జొమాటో: యాంట్‌ఫిన్ సింగపూర్ హోల్డింగ్స్ పీటీఈ, జొమాటోలో తనకున్న వాటా నుంచి 17.64 కోట్ల షేర్లను లేదా 2 శాతం వాటాను బ్లాక్ డీల్స్ ద్వారా ఈ రోజు విక్రయించాలని భావిస్తోంది. బ్లాక్ డీల్ ఫ్లోర్ ప్రైస్‌ను ఒక్కో షేరుకు రూ. 159.4గా నిర్ణయించింది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే ఇది 3.9 శాతం డిస్కౌంట్‌.


JM ఫైనాన్షియల్: IPO ఫైనాన్సింగ్ కోసం రుణాల మంజూరు చేయకుండా, షేర్లు & డిబెంచర్లు తాకట్టు పెట్టుకుని లోన్లు ఇవ్వకుండా JM ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్‌ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిషేధించింది.


విప్రో: క్లౌడ్ కార్ ఇంజినీరింగ్ సేవల్లో లీడర్‌షిప్‌ను పెంచుకునే లక్ష్యంతో SDVerse LLCలో 27 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ లావాదేవీ ఈ నెలాఖరుకు ఖరారవుతుందని అంచనా.


JSW ఎనర్జీ: 250 MW/500 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ ప్రాజెక్ట్ కోసం 'సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌'తో (SECI) బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ (BESPA) చేసుకుంది.


NHPC: ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో 1,200 మెగావాట్ల జలౌన్ అల్ట్రా రెన్యూవబుల్ ఎనర్జీ పవర్ పార్క్ నిర్మాణాన్ని ప్రారంభించింది. NHPC అనుబంధ సంస్థ బుందేల్‌ఖండ్ సౌర్ ఉర్జా, రూ.796.96 కోట్ల పెట్టుబడితో సోలార్ పార్క్‌ అభివృద్ధిని చేపట్టింది. 


ఆవాస్ ఫైనాన్షియర్స్: సింగపూర్‌కు చెందిన ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్, అమాన్సా క్యాపిటల్‌ కలిసి ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో రూ.1,186 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.


IRCTC: దేశంలోని నాలుగు ప్రధాన రైల్వే స్టేషన్‌లలో, ముందుగా ఆర్డర్ చేసిన భోజనాన్ని ప్రయాణికులకు అందించడానికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌తో (IRCTC) స్విగ్గి ఒప్పందం కుదుర్చుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: రికార్డ్‌ రేంజ్‌లో గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే