Today Horoscope 6th March 2024
మేష రాశి
ఉద్యోగ, వ్యాపారాలలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనిలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టు బాధ్యతలు అందుకుంటారు. ఆఫీసు సమావేశాలలో మీ ఆలోచనలను పంచుకోవడానికి సంకోచించకండి. సహోద్యోగులతో కలిసి పని చేయండి..మంచి ఫలితాలు పొందుతారు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదమైనది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు గుడ్ న్యూస్ వింటారు. ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. కుటుంబ సభ్యులతో కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.
Also Read: శివనిందను భరించలేక సతీదేవి ప్రాణత్యాగం, అమ్మవారి శరీర భాగాలు పడిన 18 ప్రదేశాలు ఇవే!
మిథున రాశి
ఈ రోజు మీ జీవితంలో చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. అవివాహితులకు వివాహం స్థిరపడుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పనిలో అదనపు బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండండి. కెరీర్ వృద్ధికి అవకాశాలు పెరుగుతాయి.
కర్కాటక రాశి
ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు. జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. విద్యార్థులు సానుకూల ఫలితాలు పొందుతారు. కెరీర్లో కొత్త విజయాలు సాధిస్తారు. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారాన్ని పెంచుకోవడానికి కొత్త ప్రదేశాల నుంచి నిధులు లభిస్తాయి. ఈ రోజు కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోండి.
Also Read: శివుడు రూపం వెనుకున్న ఆంతర్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సింహ రాశి
ఆఫీసులో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త వ్యాపార ఒప్పందాలలో విజయం ఉంటుంది. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. మీ ఆరోగ్యం విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండొద్దు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోండి. మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగించుకునే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతమవుతాయి.
కన్యా రాశి
ఈ రాశివారి వ్యాపారం విస్తరిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు. మీ ప్రియమైనవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వైవాహిక జీవితంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. సామాజిక హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. మీరు పాత స్నేహితులను కలుసుకుంటారు..ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.
Also Read: కైలాసంలో శివుడి సన్నిధిలో ఉన్నామా అనిపించే పాటలివి - వింటే పూనకాలే!
తులా రాశి
ఈ రోజు తులారాశి వారికి జీవితంలో సవాళ్లు పెరుగుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబానికి సమయం కేటాయించాలి. ఆర్థిక స్థితి బావుంటుంది. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి ఈ రోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక విషయాలలో ఈరోజు తీసుకున్న నిర్ణయాలు సరైనవని రుజువు అవుతుంది. డబ్బు సంబంధిత వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు. కోర్టు కేసులలో చిక్కుకున్న వారు విజయం సాధిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతారు.
ధనుస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో బిజీ షెడ్యూల్ ఉంటుంది...బాధ్యతలు పెరుగుతాయి. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయంలో కుటుంబంలో తగాదాలు రావచ్చు...మీ మాటతీరుపై నియంత్రణ అవసరం. మితిమీరిన కోపం తగ్గించుకోవాలి..ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ఈ రోజు మీరు పూర్వీకుల ఆస్తికి సంబంధించి కొనసాగుతున్న వివాదాల నుంచి ఉపశమనం పొందుతారు.
మకర రాశి
ఈ రోజు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు..మీరు అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనిలో అడ్డంకులు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో కొనసాగుతున్న ఆర్థిక వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఉద్యోగులు కార్యాలయ పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
Also Read: అందుకే పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అయ్యారు!
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ రోజు మంచి రోజు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగులకు శుభసమయం. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మంచిది. ఆరోగ్యం బావుంటుంది.
మీన రాశి
ఈ రోజు పరిస్థితులు మీకు ప్రతికూలంగా ఉంటాయి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. సామాజిక హోదా పెరుగుతుంది. వ్యాపారంలో ధన నష్టం సంకేతాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. కార్యాలయంలో అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ మాటలపై నియంత్రణ ఉంచండి. ఎవరి మనోభావాలను దెబ్బతీసే పదాలను ఉపయోగించవద్దు.
Also Read: మార్చి 08 శివరాత్రి లోగా ఇది నేర్చేసుకోండి !
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం