Stock Market Today, 02 February 2024: కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ (Interim Budget 2024) కారణంతో నిన్న అసహనంగా కదిలిన ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు (శుక్రవారం) ఉల్లాసంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇండియన్‌ ఈక్విటీలకు గ్లోబల్‌ మార్కెట్ల నుంచి పాజిటివ్‌ సిగ్నల్స్‌ అందుతున్నాయి.


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 10 పాయింట్లు లేదా 0.05 శాతం రెడ్‌ కలర్‌లో 21,904 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌-అప్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ రోజు ఉదయం, US నుంచి వచ్చిన సానుకూల పవనాలతో ఆసియా మార్కెట్లు ర్యాలీ చేశాయి. హాంగ్ సెంగ్, కోస్పి 1.2 శాతానికి పైగా పెరిగాయి. నికాయ్‌, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.8 శాతం లాభపడగా, తైవాన్ 0.3 శాతం పెరిగింది.


FOMC మీటింగ్‌ ముగిసిన తర్వాత యూఎస్‌లో వడ్డీ రేట్ల అంశం మరుగునపడింది, ట్రేడర్ల ఫోకస్‌ కార్పొరేట్‌ ఆదాయాలపైకి మళ్లింది. దీంతో, గురువారం, US మార్కెట్లు హై జంప్‌ చేశాయి. డౌ జోన్స్ 1 శాతం లాభపడింది. S&P 500, నాస్‌డాక్ 1.3 శాతం వరకు పెరిగాయి. USలో, మార్చిలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందన్న బెట్స్‌ 37 శాతానికి పడిపోయాయి, మేలో రేటు తగ్గింపు ఉంటుందన్న బెట్స్‌ 96 శాతానికి చేరాయి.


US 10-ఇయర్స్‌ ట్రెజరీ బాండ్ ఈల్డ్‌ 3.865 శాతానికి పడిపోయింది. కమోడిటీస్‌లో... గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు $2,070కి చేరుకోగా, బ్రెంట్ ఆయిల్ బ్యారెల్‌కు $80 దిగువకు పడిపోయింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా, డెలివెరీ, ఇండిగో, LIC హౌసింగ్ ఫైనాన్స్, మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్, మహీంద్ర హాలిడేస్, NIIT, రేట్‌గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్, సుందరం ఫాస్టెనర్స్, టాటా మోటార్స్, టిటాగర్ రైల్ సిస్టమ్స్, టోరెంట్ ఫార్మా, TTK హెల్త్‌కేర్, UPL, వర్ల్‌పూల్.


టైటన్: 2023-24 మూడో త్రైమాసికంలో టైటన్‌ స్వతంత్ర నికర లాభం రూ.1040 కోట్లకు చేరింది, YoYలో 9% పెరిగింది. కార్యకలాపాల ఆదాయం కూడా ఏడాది ప్రాతిపదికన 20% పెరిగి రూ.13,052 కోట్లకు చేరుకుంది.


హీరో మోటోకార్ప్: 2024 జనవరి నెలలో మొత్తం అమ్మకాలు 4.34 లక్షల యూనిట్లకు చేరాయి. గత సంవత్సరం ఇదే నెల కంటే ఇది  21% పెరుగుదల. దేశీయ విక్రయాలు 4.3 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.


ఎంఫసిస్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఎంఫసిస్ రూ.374 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ.3,338 కోట్ల ఆదాయం వచ్చింది.


ఐషర్ మోటార్స్: 2024 జనవరిలో ఐషర్ మోటార్స్ మొత్తం అమ్మకాలు 2% పెరిగి 76,187 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతులు మాత్రం తగ్గాయి, 5,631 యూనిట్లకు పరిమితమయ్యాయి.


ప్రికోల్: Q3లో ఈ కంపెనీ లాభం గత ఏడాది కంటే 27% పెరిగి రూ. 34 కోట్లుగా లెక్క తేలింది. కార్యకలాపాల ఆదాయం 21% పెరిగి రూ. 573 కోట్లుగా రికార్డ్‌ అయింది.


పేటీఎం: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ మీద RBI కొరడా ఝుళిపించడంతో, గురువారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్లు 20% పడిపోయాయి.


మహానగర్ గ్యాస్: యునిసన్ ఎన్విరో కంపెనీలో 100% ఈక్విటీ షేర్లను గురువారం నాడు రూ. 562.09 కోట్ల క్యాష్‌ డీల్‌లో కొనుగోలు చేసింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి