Stock Market Today, 01 January 2024: ప్రపంచమంతా 2024 కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తున్న నేపథ్యంలో చాలా గ్లోబల్ మార్కెట్లు సెలవు తీసుకున్నాయి. ఓవర్సీస్‌ మార్కెట్ల నుంచి ట్రిగ్గర్లు లేకపోవడంతో, నూతన సంవత్సరం మొదటి రోజున సెన్సెక్స్ & నిఫ్టీ లోయర్‌ సైడ్‌ స్టార్టింగ్‌ను చూస్తున్నాయి.


ప్రపంచంలో.. చైనా, జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియాతో సహా ఆసియా మార్కెట్లు ఈ రోజు మూతబడ్డాయి. US, యూరోప్‌ మార్కెట్లు కూడా పని చేయవు.


ఇండియన్‌ మార్కెట్లు, గత శుక్రవారం, 2023 చివరి సెషన్‌ను నష్టాల్లో ముగించాయి. అయితే, ఈ ఏడాది మొత్తంగా చూస్తే సెన్సెక్స్ & నిఫ్టీ ఇండెక్స్‌లు రెండంకెల లాభాలను ఇచ్చాయి. 2023లో నిఫ్టీ దాదాపు 19 శాతం లాభపడగా, సెన్సెక్స్ దాదాపు 18 శాతం పెరిగింది.


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 27 పాయింట్లు లేదా 0.12% రెడ్‌ కలర్‌లో 21,807 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఆటో స్టాక్స్‌: డిసెంబర్‌లో అమ్మకాల లెక్కలు, త్రైమాసిక రిపోర్ట్‌ను ఆటో స్టాక్స్‌ నివేదిస్తాయి. కాబట్టి, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి, హీరో మోటోకార్ప్‌ సహా ఆటోమొబైల్ కంపెనీలు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


కరూర్ వైశ్యా బ్యాంక్: ఈ బ్యాంక్‌లో 9.95 శాతం వరకు వాటా కొనేందుకు ICICI ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్‌ను (ICICI AMC)  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతించింది. 


RPP ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌: రూ.70.5 కోట్లు, రూ.53.17 కోట్లు, రూ.59.92 కోట్ల విలువైన మూడు ప్రాజెక్టులకు లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ అందుకుంది.


పారాదీప్ ఫాస్ఫేట్: గోవా ప్లాంట్‌లోని అమ్మోనియా రిఫ్రిజిరేషన్ కంప్రెసర్‌లో సీల్ లీక్‌ సమస్య కనిపించింది. దీనివల్ల, ప్లాంట్‌లో ఉత్పత్తిని పునఃప్రారంభించడం ఆలస్యం అవుతుంది.


GPT ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌: పశ్చిమ బెంగాల్‌లో రూ.267 కోట్ల విలువైన ప్రాజెక్టు బిడ్స్‌లో ఈ కంపెనీ L-1 లేదా అత్యల్ప బిడ్డర్‌గా నిలిచింది.


మాక్రోటెక్ డెవలపర్స్‌: ఇటీవల ఈ కంపెనీలో విలీనమైన పలావా డ్వెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి రూ.42.86 కోట్ల విలువైన GST డిమాండ్ నోటీసును అందుకుంది.


యునైటెడ్ స్పిరిట్స్: ఈ కంపెనీ కంపెనీ కూడా రూ.466.5 కోట్లకు GST డిమాండ్ నోటీసును, అదనంగా రూ.466.5 కోట్ల పెనాల్టీని ఎదుర్కొంటోంది.


పంజాబ్ నేషనల్ బ్యాంక్: రుణదాత ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు మార్జినల్ కాస్ట్‌ను (MCLR) 5 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది.


హికాల్: గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి ఈ కంపెనీకి రూ.17.45 కోట్ల జరిమానా విధించింది.


డా.రెడ్డీస్: డాక్టర్ రెడ్డీస్ గ్లోబల్ విభాగం, ఇజ్రాయెల్‌కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ ఎడిటీ థెరప్యూటిక్స్‌లో ఒక్కో షేరుకు $1.97 చొప్పున 6.46 శాతం వాటాను కొనుగోలు చేసింది.


గ్రాసిమ్: గుజరాత్‌లోని భరూచ్‌లో అధునాతన మెటీరియల్స్ తయారీ కోసం మరో 1.23 లక్షల టన్నుల కెపాసిటీని ప్రారంభించింది.


SKF: ఈ కంపెనీ ఇండియా యూనిట్ సన్ స్ట్రెంత్ రెన్యూవబుల్స్‌లో 26.74 శాతం వాటాను రూ. 2.31 కోట్లకు కొనుగోలు చేసింది.


ఆదిత్య బిర్లా క్యాపిటల్: ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్ బ్రోకర్స్‌లో 50 శాతం వాటా అమ్మకం గడువును మార్చి 31, 2024 వరకు పొడిగించింది.


వేదాంత: వడ్డీ + 10 శాతం జరిమానాతో పాటు రూ. 48.82 కోట్ల విలువైన రెండు GST డిమాండ్లను ఎదుర్కొంటోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.