Stock Market Today, 01 February 2024: కేంద్ర ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్ (Interim Budget 2024) ప్రకటన నేపథ్యంలో, ఈ రోజు (గురువారం) మార్కెట్‌ ప్రారంభ సమయంలో భారతీయ ఈక్విటీలు అస్థిరంగా ఉండొచ్చు. నిర్మల సీతారామన్‌ ప్రకటన ప్రారంభం నుంచి మార్కెట్లకు దిశానిర్దేశం దొరికే అవకాశం ఉంది. 


ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 37 పాయింట్లు లేదా 0.17 శాతం లాభంతో 21826 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 


గ్లోబల్‌ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌ ట్రెండ్‌లో ఉన్నాయి. నికాయ్‌ 0.6 శాతం క్షీణించింది. కోస్పి, తైవాన్ 0.7 శాతం, 0.1 శాతం చొప్పున పెరిగాయి.


అందరూ ఊహించినట్లుగానే యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను మార్చలేదు, పాత రేట్లనే యథాతథంగా కొనసాగించింది. లక్ష్యంగా పెట్టుకున్న 2 శాతం వైపు ద్రవ్యోల్బణం స్థిరంగా కదులుతున్నంత వరకు రేట్లను తగ్గించబోమని సూచించింది. ఫెడ్‌ నిర్ణయాల తర్వాత, బుధవారం, డౌ జోన్స్ 0.8 శాతం, నాస్‌డాక్ 2.2 శాతం, S&P 500 1.6 శాతం పతనమయ్యాయి.


యూఎస్‌ బెంచ్‌మార్క్‌ పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ దాదాపు 3 వారాల కనిష్ట స్థాయికి 4 శాతం మార్క్‌ దిగువకు పడిపోయాయి. కమోడిటీస్‌లో... గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్‌కు $2,060కి చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $81 దిగువకు పడిపోయింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బాటా ఇండియా, క్యాస్ట్రోల్, దీపక్ ఫెర్టిలైజర్స్, HFCL, ఇండియన్ హోటల్, ఇండియా సిమెంట్, ప్రాజ్ ఇండస్ట్రీస్, రేమండ్, రైట్స్‌, టైటన్.


రాడార్‌లో పెట్టుకోవాల్సిన బడ్జెట్‌ ప్రభావిత స్టాక్స్‌


ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & క్యాపిటల్ గూడ్స్: మొత్తం క్యాపెక్స్‌, సంబంధిత రంగాల్లో బడ్జెట్ వ్యయంపై చేసే ప్రకటన L&T, సైమెన్స్, PNC ఇన్‌ఫ్రాటెక్, కమిన్స్, థర్మాక్స్, ABB ఇండియా వంటి స్టాక్స్‌ను ప్రభావితం చేయవచ్చు.


రైల్వేలు: ప్రైవేట్ ప్లేయర్లతో పాటు రైల్ PSUలను రాడార్‌లో పెట్టుకోవాలి. రైల్వేలకు సంబంధించిన ప్రకటనలు RVNL, IRCTC, IRFC, టిటాగర్‌ రైల్‌, టెక్స్‌మో, ఇతర స్టాక్స్‌ను మూవ్‌ చేస్తుంది.

సిమెంట్ & నిర్మాణం: హౌసింగ్, అర్బన్ ఇన్‌ఫ్రా-సంబంధిత ప్రకటనలు ACC, అల్ట్రాటెక్ సిమెంట్, అంబుజా సిమెంట్స్, అహ్లువాలియా కాంట్రాక్ట్స్, దిలీప్ బిల్డ్‌కాన్‌, IRB ఇన్‌ఫ్రా వంటి స్టాక్స్‌ను ప్రేరేపించవచ్చు.


స్థిరాస్తి, అనుబంధ స్టాక్స్‌:  హౌసింగ్ సంబంధిత ప్రకటనలపై.. DLF, గోద్రెజ్ ప్రాపర్టీస్, DB రియాల్టీ, బ్రిగేడ్ వంటి కంపెనీల షేర్లుమార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి. కేబుల్స్ & వైర్ల స్పేస్‌లో హావెల్స్, ఆర్ఆర్ కేబుల్ వంటివి కూడా ఫోకస్‌లో ఉంటాయి.


గ్రామీణ భారతం: ఎరువులు, రసాయనాల స్పేస్‌లోని స్టాక్స్‌ను రాడార్‌లో పెట్టుకోవాలి. ఎరువుల రాయితీకి సంబంధించిన ప్రకటన ఈ షేర్లను కదిలిస్తుంది.


కన్జ్యూమర్‌ స్పేస్‌లో.. హీరో మోటోకార్ప్, M&M, ఎస్కార్ట్స్, HUL, ITC, డాబర్ వంటివి కూడా గ్రామీణ ప్రాంత మద్దతు ఆధారంగా కదులుతాయి.


రక్షణ రంగం: HAL, BEL, భారత్ ఫోర్జ్, BHEL, BDL వంటి పీఎస్‌యూలు, ప్రైవేట్ రంగంలోని ఆస్ట్రా మైక్రా, పరాస్ డిఫెన్స్ వంటివి మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: బడ్జెట్‌ నుంచి జనం ఎక్కువగా ఎక్స్‌పెక్ట్‌ చేస్తోందీ వీటినే!