Trinayani Today Episode: హనుమాన్ పూజకు నయని ఇంట్లో ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇంతలో తిలోత్తమ వచ్చి ఉన్నట్టుండి హనుమాన్ వాల (తోక)పూజ ఎందుకు చేయదలచారు అని గురువుగారిని అడుగుతుంది. దానికి గురువుగారు తీరని కోరికలు తీర్చే శక్తి వాయుపుత్రుడైన హనుమంతుడికే ఉందని అందుకే ఈ పూజ చేయిస్తున్నాను అని చెప్తారు.  


డమ్మక్క: గురువుగారు స్వామి వారి వాలానికి ప్రత్యేక పూజ ఎందుకు అనే సందేశం చాలా మందిలో ఉంటుంది వివరిస్తారా..
గురువుగారు: తప్పకుండా డమ్మక్క.. పరమేశ్వరుడిని రుద్రాంశ అవతారమే ఆంజనేయుడు. ఆ రూపం దాల్చినప్పుడు విశాలాక్షి పార్వతి దేవి స్వామివారి వాలంలో తన శక్తిని నిశ్చిప్తం చేసింది. 
నయని: అంటే వాల పూజ చేస్తే అమ్మవారిని కొలిచినట్లే కదా స్వామి.
గురువుగారు: అవును నయని..
విక్రాంత్: వదినా.. అంత వేగంగా పయనించే హనుమంతుడు.. నిదానంగా నడిచే ఒంటెని ఎందుకు వాహనంగా చేసుకున్నాడు..
నయని: పంపానది తీరాన ఆంజనేయుడు నడుస్తున్నప్పుడు బలశాలి అయిన అతని బరువుకు పాదాలు ఇసుకలో కూరుకుపోతుండేవి అంట. అప్పుడు శివుని వాహనం అయిన నంది ఒంటె రూపంలో తన స్వామి మరో అవతారానికి సేవ చేయాలి అని వచ్చాడు. 
విశాల్: భసవుడి కోరికను భగవంతుడు మన్నించి పులినజవుడి మీద అదిరోహించాడు. 
హాసిని: ఆంజనేయస్వామి వారి ఒంటెపేరు పులిన జవుడు..
నయని: అంటే ఇసుకలో వేగంగా అడుగులు వేసేవాడు అని అర్థం..
తిలోత్తమ: చాలానే తెలుసు మీకు..
సుమన: స్వామి తోకకు వారికి సుమన బొట్టు పెట్టి తన కోరిక బయటకు చెప్పుకుంది. మరేంలేదు.. ఇప్పటి వరకు గాయత్రీ అత్తయ్య జాడ కోసం అందరూ ప్రయత్నిస్తున్నారు. అందరి కంటే ముందు గాయత్రీ అత్తయ్య ఎక్కడున్నారో నాకే తెలియాలి.
పావనా: ఈ కోరిక నెరవేరదమ్మా..
సుమన: ఎందుకు..
పావనా: అందరికీ తెలిసిపోయిన తర్వాత నీకు తెలిస్తే లాభం ఏముంది. 
సుమన: ఎవరికి తెలుసు..
విశాల్: మామయ్య మా అమ్మ జాడ తెలుసు అని చెప్తున్నావ్ ఏంటి..
పావనా: అంటే అదే అల్లుడు భక్తి పారవశ్యంలో మునిగిపోయి గాయత్రీ అక్కయ్య జాడ మనకు కాకుండా ఇంకా ఎవరికి తెలుస్తుంది అని అన్నాను అంతే..
తిలోత్తమ: అనడం కాదు పావనామూర్తి కోరిక అనుకుంటే అది నెరవేరాలి. 
వల్లభ: గాయత్రీ పెద్దమ్మ గురించి ముందుగా సుమనకు తెలిస్తే లాభం ఏంటి అంట.
సుమన: ఉంది బావగారు అది చెప్పకూడదు. ఎందుకు అంటే అది కోరిక కాదు.
విశాల్: స్వామి వారికి బొట్టు పెట్టి.. మా అమ్మ గురించి ఎవరికి తెలిసినా తెలీక పోయినా తను ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి స్వామి.. 
తిలోత్తమ: మా కోరికలు ఎలా తీరుతాయో కాదు స్వామి.. మా కోరికలు తీర్చబోయే నిన్ను చూడాలి అనుకుంటున్నాను అదే నా కోరిక.. తిలోత్తమ అలా అనగానే ప్లేట్‌లో ఉన్న తమలపాకుమీదు శ్రీరామ అని రాసిన ఆకులు గాల్లో ఎగిరి తిలోతమతమ ముఖానికి అంటుకుంటాయి. ఆకులు ముఖం నుంచి రాకుండా తిలోత్తమ ఇబ్బంది పడుతుంది. మంట మంట అని అరుస్తుంది. ఇక అలా తిలోత్తమను నయని, హాసిని బయటకు తీసుకొచ్చి కూర్చొపెడతారు. 


నయని: అత్తయ్య నేను అడిగిన దానికి నిజం చెప్పకపోయారు అంటే తమలపాకులతో పాటు మీ తోలు కూడా ఛిద్రం అయిపోతుంది చెప్తున్నా.. నిజం చెప్పకపోతే మీ ముఖం మీద నీళ్లకు బదులు ఏ పెట్రోలో కిరోసినో పోస్తా.. 
తిలోత్తమ: నోనో అలా చేయొద్దు.. 
నయని: అలా అయితే మీ మనసులో కోరిక ఏంటో చెప్పండి..
తిలోత్తమ: చెప్తాను.. గత జన్మలో గాయత్రీ అక్కయ్య ప్రాణం తీసిన నేనే పునర్జన్మలో కూడా హతమార్చే అవకాశం..
నయని: పీక పట్టుకొని.. గాయత్రీ అమ్మగారు ఇప్పుడు పసిపిల్లలా ఉంటారు. అంత చిన్న పిల్లని కూడా చూడకుండా జాలీ దయ లేకుండా ఇప్పుడు కూడా ఇంత దుర్మార్గంగా ఆలోచించిన నిన్ను బతకనివ్వకూడదు. 
తిలోత్తమ: వదులు నయని.. వదులు నన్ను చంపాల్సింది నువ్వు కాదు గాయత్రీ అక్కయ్య..


ఇక నయని, హాసినీలు తిలోత్తమను తీసుకొని స్వామి వారి దగ్గరకు తీసుకొస్తారు. ఇక నయని వల్లభతో బావగారు మీ అమ్మ ఈ జన్మకు తీరని కోరిక కోరుకుంది కాబట్టి ఇక మీకు ముఖం కనిపించదు అని అంటుంది. ఇంతలో గురువుగారు ఆకులు రావాలి అంటే కాల్చాలి అని అంటారు. అందరూ ముఖం కాల్చాలా అని షాక్ అవుతారు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: సత్యభామ సీరియల్ జనవరి 31st: క్రిష్‌ కోసం రెస్టారెంట్‌కి వచ్చిన సత్య.. సత్య కోసం మాధవ్.. నిజం తెలిసిపోతుందనే టెన్షన్‌లో కాళీ!