Stock Market Today, 30 May 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 50 పాయింట్లు లేదా 0.27 శాతం రెడ్‌ కలర్‌లో 18,679 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


అదానీ పోర్ట్స్: 2023 మార్చి త్రైమాసికంలో, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 5% పెరిగి రూ. 1,159 కోట్లకు చేరుకుంది. ఆదాయం ఏడాదికి 40% పెరిగి రూ. 5,797 కోట్లకు చేరుకుంది.


మ్యాన్‌కైండ్ ఫార్మా: జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ ఫార్మా కంపెనీ ఏకీకృత నికర లాభం సంవత్సరానికి 50% వృద్ధితో రూ. 285 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 19% పెరిగి రూ. 2,053 కోట్లకు చేరుకుంది.


పతంజలి ఫుడ్స్: మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో, పతంజలి ఫుడ్స్ తన స్వతంత్ర నికర లాభంలో 13% వృద్ధిని నమోదు చేసి రూ. 264 కోట్లను ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం 18% పెరిగి రూ. 7,873 కోట్లుగా నమోదైంది.


అపోలో హాస్పిటల్స్: ప్రముఖ హాస్పిటల్ చైన్, నాలుగో త్రైమాసికంలో రూ. 146 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలోని రూ. 97 కోట్ల లాభంతో పోలిస్తే ఈసారి 50% పెరిగింది. ఆదాయం కూడా 21% పెరిగి రూ. 4,302 కోట్లకు చేరుకుంది.


HDFC లైఫ్: UKకి చెందిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ Abrdn, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో తన మొత్తం వాటాను బ్లాక్ డీల్ ద్వారా అమ్మేసే అవకాశం ఉంది, బహుశా ఇది రేపు జరుగుతుంది.


సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్: కంపెనీ ప్రమోటర్‌ ఆరియస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇవాళ, బ్లాక్ డీల్ ద్వారా సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్‌ లిమిటెడ్‌లో 3.25% వాటాను విక్రయించాలని యోచిస్తోంది.


SBI: ఎస్‌బీఐ షేర్లు ఇవాళ ఎక్స్-డివిడెండ్‌ ట్రేడ్‌ చేస్తాయి కాబట్టి మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


మాక్రోటెక్ డెవలపర్స్‌: ఈ కంపెనీ షేర్లు ఎక్స్-బోనస్‌ ట్రేడ్‌ చేస్తాయి కాబట్టి మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 468 కోట్ల నికర లాభాన్ని ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 2,632 కోట్లుగా ఉంది.


లెమన్ ట్రీ హోటల్స్: జనవరి-మార్చి త్రైమాసికంలో రూ. 44 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఆ త్రైమాసికంలో ఆదాయం రూ. 253 కోట్లకు చేరింది.


కోల్ ఇండియా: నేటి నుంచి, నాన్-కోకింగ్ కోల్‌ ధరలను 8% పెంచింది. ధరల పెంపుతో ఈ కంపెనీ అదనంగా రూ. 2,700 కోట్ల ఆదాయం పొందుతుంది.


ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్: జనవరి-మార్చి కాలానికి రూ. 376 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో రూ. 108 కోట్ల ఆదాయం వచ్చింది.


వెల్‌స్పన్‌ కార్పొరేషన్: నాలుగో త్రైమాసికంలో రూ. 236 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 4,070 కోట్లుగా ఉంది.


టోరెంట్ ఫార్మా: మార్చి త్రైమాసికంలో టొరెంట్ ఫార్మా రూ. 287 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం 17% పెరిగి రూ. 2,491 కోట్లకు చేరుకుంది.


ఇది కూడా చదవండి: SBI దగ్గరకు ఎన్ని 2000 రూపాయల నోట్లు వచ్చాయో తెలుసా?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.