Stock Market Today, 29 May 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.50 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 172 పాయింట్లు లేదా 0.93 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,720 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ భారీ గ్యాప్‌-అప్‌తో ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: అదానీ ట్రాన్స్‌మిషన్‌, IRCTC, NHPC, టోరెంట్‌ పవర్‌, రైల్‌ వికాస్‌ నిగమ్‌. ఈ షేర్లపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


అరబిందో ఫార్మా: 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో అరబిందో ఫార్మా రూ. 505 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 6,479 కోట్లుగా ఉంది.


బాలకృష్ణ ఇండస్ట్రీస్: జనవరి-మార్చి కాలంలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ రూ. 260 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆదాయం 2 శాతం తగ్గి రూ. 2,317 కోట్లకు చేరుకుంది.


PFC: నాలుగో త్రైమాసికంలో PFC నికర లాభం రూ. 4,677 కోట్లుగా ఉంది. అదే కాలంలో ఆదాయం రూ. 10,184 కోట్లుగా ఉంది.


GMR ఎయిర్‌పోర్ట్స్‌: మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 441 కోట్ల నికర నష్టాన్ని ఈ కంపెనీ ప్రకటించింది. అదే కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 1,894 కోట్ల ఆదాయం వచ్చింది.


PTC ఇండియా: మార్చి త్రైమాసికంలో రూ. 116 కోట్ల నికర లాభాన్ని పీటీసీ ఇండియా సాధించింది. కార్యకలాపాల ద్వారా రూ. 148 కోట్ల ఆదాయం ఆర్జించింది.


దాల్మియా సిమెంట్: తన ఉమ్రాంగ్సో యూనిట్‌లో 3.6 MTPA కొత్త క్లింకరైజేషన్ యూనిట్‌ను, లంక యూనిట్‌లో 2.4 MTPA కొత్త సిమెంట్ గ్రైండింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి రూ. 3,642 కోట్ల మూలధన వ్యయం చేయడానికి దాల్మియా సిమెంట్ (నార్త్ ఈస్ట్) లిమిటెడ్ బోర్డ్‌ ఆమోదించింది.


ONGC: మార్చితో ముగిసిన త్రైమాసికంలో ONGC ఏకీకృత నికర లాభం 53% తగ్గి రూ. 5,701 కోట్లకు చేరుకుంది. గతేడాది మార్చి త్రైమాసికంలో లాభం రూ. 12,061 కోట్లుగా ఉంది. స్వతంత్ర ప్రాతిపదికన, మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ. 248 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.


కర్ణాటక బ్యాంక్: నాలుగో త్రైమాసికంలో కర్ణాటక బ్యాంక్ నికర లాభం రూ. 354 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 860 కోట్లుగా ఉంది.


ఇండిగో పెయింట్స్: మార్చి త్రైమాసికంలో ఈ పెయింట్స్ కంపెనీ 41% వృద్ధితో రూ. 48.7 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం 13% పెరిగి రూ. 325 కోట్లకు చేరుకుంది.


NCC: జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా సంజయ్ పుసర్లను NCC నియమించింది.


ఐనాక్స్ విండ్‌: జనవరి-మార్చి కాలంలో రూ. 117 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 40% పెరిగి రూ. 193 కోట్లకు చేరుకుంది.


ఇది కూడా చదవండి: ఇన్‌కమ్‌ టాక్స్‌ నోటీసులకు స్పందించడం లేదా! కొత్త గైడ్‌లైన్స్‌తో పరేషాన్‌! 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.