Stock Market Today, 28 June 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 7.55 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 50 పాయింట్లు లేదా 0.27 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,861 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


నిఫ్టీ బ్యాంక్ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీని గురువారం నుంచి శుక్రవారానికి మార్చే ప్రణాళికను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE వెనక్కు తీసుకుంది. ఇండెక్స్‌ల రీలాంచ్‌ సెన్సెక్స్ & బ్యాంకెక్స్ డెరివేటివ్ కాంట్రాక్టుల ఎక్స్‌పైరీనీ గురువారం నుంచి శుక్రవారానికి బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ BSE మార్చింది. దీంతో, ఎన్‌ఎస్‌ఈ ఈ నిర్ణయం తీసుకుంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


HDFC లైఫ్: హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్, మంగళవారం (27 జూన్‌ 2023), దాని అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌లో 0.7% అదనపు వాటాను కొనుగోలు చేసింది. ఓపెన్‌ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ కొనుగోలు జరిగింది.


సఫైర్ ఫుడ్స్: విదేశీ పెట్టుబడి సంస్థ WWD రూబీ లిమిటెడ్, సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో తనకున్న మొత్తం 4.77% వాటాను మంగళవారం ఆఫ్‌లోడ్ చేసింది. ఓపెన్‌ మార్కెట్ లావాదేవీల ద్వారా షేర్లను అమ్మి రూ. 417 కోట్లు ఆర్జించింది.


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: SBI పెన్షన్ ఫండ్స్‌లో SBI క్యాపిటల్ మార్కెట్స్‌ (SBI Capital Markets) హోల్డ్‌ చేస్తున్న మొత్తం 20% వాటాను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొనుగోలు చేస్తుంది.


గ్లాండ్ ఫార్మా: అమెరికన్‌ డ్రగ్‌ రెగ్యులేటర్‌ USFDA, హైదరాబాద్‌ సమీపంలోని పాశమైలారంలో ఉన్న గ్లాండ్‌ ఫార్మా ఫెసిలిటీలో ఏడు ఉత్పత్తులకు ప్రి-అప్రూవల్‌ తనిఖీని, గుడ్‌ మాన్యుఫాక్చరింగ్‌ తనిఖీని నిర్వహించింది. కేవలం ఒక్క అబ్జర్వేషన్‌ జారీ చేసింది.


టిటాగర్ రైల్‌: 857 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్ట్ కోసం గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ (GMRC) నుంచి ఈ కంపెనీ అంగీకార పత్రాన్ని (LOA) అందుకుంది.


ఆదిత్య బిర్లా ఫ్యాషన్: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI), TCNS క్లోథింగ్‌ (TCNS Clothing) కంపెనీని కొనుగోలు చేయడానికి ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.


వేదాంత: ఎలక్ట్రానిక్ చిప్‌ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు వేదాంత-ఫాక్స్‌కాన్ JV మరోమారు దరఖాస్తు సమర్పించినట్లు జాయింట్ వెంచర్ కంపెనీ మంగళవారం ప్రకటించింది.


LTI మైండ్‌ట్రీ: హౌసింగ్‌ లోన్‌ కంపెనీ HDFC షేర్లను స్టాక్‌ మార్కెట్‌ నుంచి డీలిస్ట్‌ చేసిన తర్వాత, దేశంలో ఆరో అతి పెద్ద IT కంపెనీ LTIMindtree నిఫ్టీ50 గ్రూప్‌లోకి ఎంటర్‌ కావడానికి టిక్కెట్‌ దక్కే అవకాశం ఉంది.


రామ్‌కో సిమెంట్స్: R R నగర్‌లో 3,000 TPD సామర్థ్యం గల క్లింకరైజేషన్‌తో లైన్ IIIని రామ్‌కో సిమెంట్స్‌ ప్రారంభించింది. గత 15 సంవత్సరాల్లో దక్షిణ తమిళనాడులో ప్రారంభమైన మొదటి ఇంటిగ్రేటెడ్ సిమెంట్ లైన్ ఇది.


ఇది కూడా చదవండి: స్టాక్‌ మార్కెట్‌కు బక్రీద్‌ సెలవు బుధవారమా, గురువారమా?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial