Stock Market Today, 28 April 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 75 పాయింట్లు లేదా 0.42 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,068 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: అల్ట్రాటెక్ సిమెంట్, SBI కార్డ్స్, ఇండియామార్ట్. వీటిపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


యాక్సిస్ బ్యాంక్: ఈ ప్రైవేట్ రంగ రుణదాత, మార్చి త్రైమాసికంలో రూ. 5,728.42 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. సిటీ బ్యాంక్ ఇండియా వినియోగదార్ల వ్యాపారం కొనుగోలు కోసం చేసిన చెల్లింపు వల్ల ఈ నష్టం కనిపించింది. ఈ చెల్లింపు మొత్తాన్ని మినహాయిస్తే, Q4లో రూ. 6,625 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్‌ ఆర్జించింది, ఇది సంవత్సరానికి 61% వృద్ధి.


LTI మైండ్‌ట్రీ: ఐటీ సేవల సంస్థ ఎల్‌టీఐ మైండ్‌ట్రీ నాలుగో త్రైమాసికంలో రూ. 1,114 కోట్ల నికర లాభాన్ని నివేదించింది, గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 1,108 కోట్లతో పోలిస్తే ఇది ఫ్లాట్‌గా ఉంది.


విప్రో: ఐటీ మేజర్ విప్రో, మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ. 3,074 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది, ఇది ఏడాది క్రితం కంటే 0.4% తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 3,087 కోట్లుగా ఉంది.


టెక్ మహీంద్ర: ఐటీ మేజర్ టెక్ మహీంద్ర, Q4లో రూ. 1,118 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది, ఏడాది క్రితం కంటే ఇప్పుడు 25.8% తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో లాభం రూ. 1,506 కోట్లుగా ఉంది.


లారస్ ల్యాబ్స్: మార్చి త్రైమాసికంలో లారస్ ల్యాబ్స్ నికర లాభం 55% తగ్గి రూ. 103 కోట్లకు చేరుకుంది. ఆ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా స్వల్పంగా 3% తగ్గి రూ. 1,381 కోట్లకు చేరుకుంది.


ఇండియన్‌ హోటల్స్: Q4FY23లో ఇండియన్ హోటల్స్ రూ. 328 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, క్రితం ఏడాది ఇదే కాలంలోని రూ. 74 కోట్లతో పోలిస్తే భారీగా 343% వృద్ధి చెందింది.


గ్లెన్‌మార్క్ లైఫ్: 2023 జనవరి-మార్చి కాలంలో గ్లెన్‌మార్క్ లైఫ్ లాభం ఏడాది ప్రాతిపదికన 48% పెరిగి రూ. 146 కోట్లకు చేరుకోగా, కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాదికి 21% పెరిగి రూ. 621 కోట్లకు చేరుకుంది.


మోతీలాల్ ఓస్వాల్: మార్చి త్రైమాసికంలో ఈ బ్రోకింగ్‌ కంపెనీ ఏకీకృత నికర లాభం ఏడాది ప్రాతిపదికన 45% తగ్గి రూ. 165 కోట్లకు చేరుకుంది, గత ఏడాది ఇదే కాలంలో రూ. 299 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.


ACC: నాలుగో త్రైమాసికంలో ఈ సిమెంట్‌ కంపనీ రూ. 236 కోట్ల నికర లాభాన్ని నివేదించింది, మూడో త్రైమాసికంలో ఇది రూ.113 కోట్లుగా ఉంది. ఇదే కాలంలో ఆదాయం 6% పెరిగి రూ. 4,791 కోట్లకు చేరుకుంది.


ఉషా మార్టిన్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఉషా మార్టిన్ రూ. 105 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే కాలంలో రూ. 855 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది.


PI ఇండస్ట్రీస్‌: ఫార్మా API & CDMO స్పేస్‌లో రెండు కొనుగోళ్లు చేసినట్లు పీఐ ఇండస్ట్రీస్ విభాగమైన పీఐ హెల్త్ సైన్సెస్ ప్రకటించింది. విభిన్నమైన ఫార్మా వ్యాపార నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది.


స్పైస్‌జెట్: నివేదికల ప్రకారం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా అరుణ్ కశ్యప్‌ను ఈ కంపెనీ నియమించింది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.