Stock Market Today, 27 June 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 31 పాయింట్లు లేదా 0.17 శాతం గ్రీన్ కలర్‌లో 18,735 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఎస్‌బీఐ లైఫ్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) ప్రాతినిధ్యం వహిస్తున్న నామినీ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్, ఎస్‌బీఐ లైఫ్ (SBI Life) డైరెక్టర్ ఛైర్‌కు రాజీనామా చేశారు.
సఫైర్ ఫుడ్స్: సఫైర్ ఫుడ్స్ ఇండియా ప్రమోటర్ కంపెనీ బ్లాక్ డీల్ ద్వారా 3 మిలియన్ల షేర్లను (30 లక్షల షేర్లు) విక్రయించే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ చేసింది. ఒక్కో షేరుకు ఫ్లోర్ ప్రైస్‌ను రూ. 1345 - 1391 గా నిర్ణయించారు. సోమవారం (26 June 2023) ఈ షేర్ BSEలో రూ. 1,393.95 వద్ద ముగిసింది. దీంతో పోలిస్తే, ప్రమోటర్ ఎంటిటీ తన దగ్గరున్న కంపెనీ షేర్లను డిస్కౌంట్‌లో సేల్ చేస్తోంది.
సిటీ యూనియన్ బ్యాంక్: QIP (Qualified Institutional Placement) రూట్ ద్వారా రూ. 500 కోట్ల వరకు మూలధనాన్ని సేకరించేందుకు సిటీ యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్: బీఎల్‌ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ అనుబంధ సంస్థ అయిన 'BLS E-సర్వీసెస్'ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. IPO ద్వారా నిధుల సమీకరణకు BLS E-సర్వీసెస్ బోర్డ్ ఆమోదం తెలిపింది. ఆఫర్ సైజ్, ప్రైస్ బ్యాండ్ సహా ఇతర వివరాలను తగిన సమయంలో నిర్ణయిస్తారు.
ఎయిర్‌టెల్: భారతి ఎయిర్‌టెల్, తన ఎయిర్‌టెల్ బిజినెస్ (Airtel Business) లీడర్‌షిప్ టీమ్‌లో మార్పులు ప్రకటించింది. ఎయిర్‌టెల్ బిజినెస్ CEO అజయ్ చిట్కారా ఎయిర్‌టెల్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఈ ఏడాది ఆగస్టు మూడో వారం వరకు మాత్రమే కంపెనీలో కొనసాగుతారు.
ఆదిత్య బిర్లా క్యాపిటల్: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) ద్వారా నిధుల సమీకరణను ఆదిత్య బిర్లా క్యాపిటల్ ప్రారంభించింది. ఇందుకోసం షేర్లను ఒక్కొక్కటి రూ. 170-176 ప్రైస్ రేంజ్‌లో అమ్ముతోంది. QIP ద్వారా రూ. 1,750 కోట్లను సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.
తంగమయిల్ జ్యువెలరీ & వెల్‌స్పన్ ఇండియా: తంగమయిల్ జ్యువెలరీ (Thangamayil Jewellery), వెల్‌స్పన్ ఇండియా (Welspun India) షేర్లు ఇవాళ ఎక్స్-డివిడెండ్‌లో డ్రేట్ అవుతాయి. ఈ కంపెనీలు ఇటీవల ప్రకటించిన డివిడెంట్ మొత్తం ఇవాళ షేర్ ధర నుంచి ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది.
ఇది కూడా చదవండి: యూఎస్ స్టాక్స్ ఎలా కొనాలి, ఎలా ట్రేడ్ చేయాలి?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial