How to buy US Stocks: మీరు ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడ్‌ చేస్తున్నారా?, అయితే.. US మార్కెట్‌లో ట్రేడింగ్‌ ఎలా జరుగుతుంది అని కనీసం ఒక్కసారయినా మీరు ఆలోచించి ఉంటారు. అవకాశం వస్తే మీరు కూడా అమెరికన్‌ కంపెనీల షేర్లు కొనాలని అనుకుని ఉంటారు. అమెరికన్ స్టాక్స్‌లో ట్రేడింగ్‌ చేయడం పెద్ద విషయమేం కాదు. మీరు మీ ఇంట్లో కూర్చుని యూఎస్‌ షేర్లతో ఆటాడుకోవచ్చు. కొన్ని మార్గాల ద్వారా... ఆపిల్‌, గూగుల్‌, టెస్లా, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీల షేర్లను కొని, అమ్మవచ్చు. అయితే, రిస్క్‌ కూడా ఉంటుందన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.


యూఎస్‌ స్టాక్స్‌లో ఎలా ట్రేడ్‌ తీసుకోవాలి?
US స్టాక్ ట్రేడింగ్ ప్రయోజనాన్ని పొందడానికి సులభమైన మార్గం.. మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు, ఇండియన్‌ AMCలు చాలా అంతర్జాతీయ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లను అందిస్తున్నాయి. ఆ పథకాల్లో మీరు పెట్టుబడి పెడితే, ఇన్‌-డైరెక్ట్‌గా ఆయా స్టాక్స్‌ అన్నీ మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నట్లే. మ్యూచువల్‌ ఫండ్‌ కాకుండా, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF) ఆప్షన్‌ కూడా ఉంది. ETFలు లేదా ఫండ్ ఆఫ్ ఫండ్స్ సహాయంతో US స్టాక్స్‌ను ఈజీగా ట్రేడ్‌ చేయవచ్చు.


NSE ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్
పైన చెప్పిన ఇన్‌-డైరెక్ట్‌ పద్ధతుల్లో కాకుండా, మీరు డైరెక్ట్‌గా అమెరికన్ స్టాక్స్‌లో ట్రేడింగ్ చేయాలనుకుంటే, మరో ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. ఈ పని కోసం NSE ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ మీకు సాయం చేస్తుంది. గత ఏడాది మార్చిలో, అమెరికాలోని టాప్ 8 కంపెనీలతో NSE ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రారంభమైంది.


NSE అందిస్తున్న ఆప్షన్‌ ద్వారా, టెక్‌ జెయింట్స్‌ మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌, ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ మెటా, నెట్‌ఫ్లిక్స్‌, వాల్‌మార్ట్‌, ఎలాన్‌ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన కంపెనీ టెస్లా, ప్రపంచంలోని అతి పెద్ద కంపెనీ ఆపిల్‌లో మీరు పెట్టుబడి పెట్టవచ్చు. మీకు చేతనైనన్ని షేర్లు కొని ఈ కంపెనీల్లో కొంత ఓనర్‌షిప్‌ చేజిక్కించుకోవచ్చు.


అమెరికన్‌ స్టాక్స్‌లో ట్రేడింగ్‌ కోసం, గిఫ్ట్ సిటీలో, NFC IFSC పేరుతో, ఇంటర్నేషనల్ ఎక్స్ఛేంజ్‌కు అనుబంధ సంస్థను NSE ఏర్పాటు చేసింది. అమెరికన్ కంపెనీల షేర్ల కోసం NSE IFSC ద్వారా డిపాజిటరీ రిసిప్ట్స్‌ జారీ అవుతాయి.


NSE IFSC టైమింగ్స్‌
ఈ ఫెసిలిటీ పొందేందుకు NSE IFSCలో ప్రత్యేక డీమ్యాట్ అకౌంట్‌ను ఓపెన్‌ చేయాలి. ఒక భారతీయ పెట్టుబడిదారు ఈ పద్ధతిలో అమెరికన్ కంపెనీల్లో రూ. 1.9 కోట్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, రాత్రి 8:30 నుంచి తెల్లవారుజామున 2:45 గంటల వరకు ట్రేడింగ్ ఉంటుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: పాపులర్‌ పోస్టాఫీస్‌ స్కీమ్‌, FD కూడా దీని ముందు దిగదుడుపే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial