Stock Market Today, 26 July 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 8.40 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 25 పాయింట్లు లేదా 0.12 శాతం గ్రీన్ కలర్‌లో 19,882 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ గ్యాప్-అప్‌లో ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ ప్రకటించే కీలక కంపెనీలు: బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్ర, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, టాటా కన్స్యూమర్, BPCL, PNB. ఈ స్టాక్స్ ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
L&T: లార్సెన్ & టూబ్రో నికర లాభంలో 46% వృద్ధిని రూ.2,493 కోట్లకు నివేదించింది. ఆదాయం 34% పెరిగి రూ.47,882 కోట్లకు చేరుకుంది. సంస్థ చరిత్రలో మొదటిసారిగా షేర్ బైబ్యాక్ ప్రకటించింది. రూ.10,000 కోట్లను ఇందుకు కేటాయించింది. 3.33 కోట్ల షేర్లను ఒక్కోటి రూ. 3,000 చొప్పున టెండర్ ఆఫర్ పద్ధతిలో కంపెనీ తిరిగి కొనుగోలు చేస్తుంది.
SBI లైఫ్: 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బిఐ లైఫ్ రూ. 381 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. నికర ప్రీమియం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 19% పెరిగి రూ. 13,104 కోట్లకు చేరుకుంది.
డెల్టా కార్పొరేషన్: 2023 ఏప్రిల్-జూన్ కాలంలో డెల్టా కార్ప్ రూ. 68 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీకి రూ. 273 కోట్ల ఆదాయం వచ్చింది.
సియట్: 2023-24 మొదటి త్రైమాసికంలో సియట్ రూ. 145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 2,935 కోట్ల ఆదాయం సంపాదించింది.
టాటా మోటార్స్: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ ఊహించిన దాని కంటే ఎక్కువ నికర లాభాన్ని రూ.3,203 కోట్లను ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 42% పెరిగి రూ. 1.02 లక్షల కోట్లకు చేరుకుంది.
పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్: షేర్ బైబ్యాక్ ప్రతిపాదనను పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ పరిశీలిస్తోంది. దీనికి ఆమోదం తెలిపేందుకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 28న సమావేశం అవుతుంది.
అంబర్ ఎంటర్‌ప్రైజెస్: Q1 FY24లో కంపెనీ నికర లాభం 9% పెరిగి రూ. 46 కోట్లకు చేరుకుంది. అయితే, ఆదాయం 7% తగ్గి రూ. 1,702 కోట్లకు చేరుకున్నాయి.
సైయెంట్: జూన్ త్రైమాసికంలో 46% వృద్ధితో సైయంట్ రూ. 168 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా రూ.1,687 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇది కూడా చదవండి: నష్టాలకు టాటా! రూ.5007 కోట్ల లాస్ నుంచి రూ.3,203 కోట్ల ప్రాఫిట్!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial