Stock Market Today, 25 July 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 8.00 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 17 పాయింట్లు లేదా 0.08 శాతం రెడ్‌ కలర్‌లో 19,721 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ Q1 రిజల్ట్స్‌ ప్రకటించే కీలక కంపెనీలు: ఏషియన్ పెయింట్స్, L&T, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, SBI లైఫ్, జూబిలెంట్ ఫుడ్, సుజ్లాన్ ఎనర్జీ. ఈ స్టాక్స్‌ ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


టాటా స్టీల్: జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో టాటా స్టీల్ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 92% తగ్గి రూ. 634 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ఆదాయం 6% క్షీణించి రూ. 59,490 కోట్లకు దిగి వచ్చింది.


TVS మోటార్: 2023 ఏప్రిల్‌-జూన్‌ కాలంలో, టీవీఎస్‌ మోటార్‌ స్టాండ్‌లోన్ నెట్‌ ప్రాఫిట్‌ 46% పెరిగింది, రూ. 468 కోట్లకు చేరింది. ఆ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 20% పెరిగి రూ. 7,218 కోట్లకు చేరుకుంది.


రిలయన్స్ ఇండస్ట్రీస్: భారతదేశంలో డేటా సెంటర్ల బిజినెస్‌ కోసం బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్‌ డిజిటల్ రియాల్టీతో రిలయన్స్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లు అభివృద్ధి చేసే SPVల్లో ఈ కంపెనీలు కలిసి పెట్టుబడులు పెడతాయి. 


షాపర్స్ స్టాప్: 2023-24 తొలి త్రైమాసికంలో షాపర్స్ స్టాప్ రూ. 14.5 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా, ఆదాయం రూ. 994 కోట్లుగా లెక్క తేలింది.


స్పందన స్ఫూర్తి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో స్పందన స్ఫూర్తి రూ. 119 కోట్ల నికర లాభం మిగుల్చుకుంది. నికర వడ్డీ ఆదాయం రూ. 312 కోట్లుగా ఉంది.


టొరెంట్ పవర్: ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇన్‌ఫ్రా సెక్టార్‌లోకి టొరెంట్ పవర్ ప్రవేశించబోతోంది. ఈ కంపెనీ, సూరత్‌లో 2 ఇ-వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు, అహ్మదాబాద్‌లో 4 స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ చేసింది.


IIFL సెక్యూరిటీస్: జూన్ త్రైమాసికంలో IIFL సెక్యూరిటీస్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 40% పెరిగి రూ. 409 కోట్లకు చేరుకుంది. ఇదే కాలంలో లాభం 71% పెరిగి రూ. 75 కోట్లుగా లెక్క తేలింది.


మారుతి సుజుకి: 2021 జులై - 2023 ఫిబ్రవరి మధ్య తయారు చేసిన 87,599 వాహనాలను (S-Presso & Eeco) రీకాల్ చేయబోతున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది. స్టీరింగ్ టై రాడ్‌లోని ఒక భాగంలో లోపం ఉండే అవకాశం ఉందని ఈ కంపెనీ అనుమానిస్తోంది. 


డీసీఎం శ్రీరామ్: DCM శ్రీరామ్ లాభం దాదాపు 78% క్షీణించి రూ. 57 కోట్లకు పడిపోయింది. ఆదాయం రూ. 2,937 కోట్లుగా నమోదైంది.


ఇది కూడా చదవండి: మ్యూచువల్‌ ఫండ్‌లో 'సిప్‌' చేస్తారా?, ఈ 4 టైప్స్‌లో ఒకటి ఎంచుకోవచ్చు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial