Stock Market Today, 25 August 2023: NSE నిఫ్టీ నిన్న (గురువారం) 19,387 వద్ద క్లోజ్‌ అయింది. గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.15 గంటల సమయానికి 23 పాయింట్లు లేదా 0.12 శాతం రెడ్‌ కలర్‌లో 19,270 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


యూనివర్సల్ ఆటోఫౌండ్రీ: ఏస్ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా, ఐరన్ కాస్టింగ్ మేకర్ యూనివర్సల్ ఆటోఫౌండ్రీలో (Universal Autofoundry) షేర్లు కొన్నారు. గురువారం బ్లాక్ డీల్స్ ద్వారా కొంత వాటాను కైవసం చేసుకున్నారు.


పేటీఎం: నేషనల్‌ మీడియా రిపోర్ట్స్‌ ప్రకారం, ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం (Paytm) నుంచి ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ యాంట్‌ఫిన్‌ పాక్షికంగా తప్పుకుంటోంది. యాంట్‌ఫిన్, శుక్రవారం బ్లాక్ డీల్ ద్వారా 3.6 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉంది.


కోఫోర్జ్: ప్రమోటర్ కంపెనీ అయిన బేరింగ్ పీఈ (Baring PE), ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్‌ (Coforge) నుంచి పూర్తిగా నిష్క్రమించింది. గురువారం బల్క్ డీల్స్ ద్వారా తన మొత్తం వాటాను విక్రయించింది. బేరింగ్ పీఈ అనుబంధ సంస్థ హసల్ట్‌ BV ద్వారా ఈ డీల్స్‌ జరిగాయి.


మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్: ప్రమోటర్ గ్రూప్ ఎంటిటీ అయిన మాక్స్ వెంచర్స్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్, గురువారం, ఆర్థిక సేవల రంగంలో ఉన్న మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ (Max Financial Services) కంపెనీలో 3.3 శాతం వాటాను విక్రయించింది. మొత్తం రూ. 982 కోట్లకు 3.3 శాతం స్టేక్‌ను విక్రయించింది.


యూనియన్ బ్యాంక్: ఐదు వేల కోట్ల రూపాయల నిధుల సమీకరణ చివరి దశకు చేరుకుంది. మొత్తం రూ.5,000 కోట్లకు దరఖాస్తు ఫారాలు అందడంతో, QIPని క్లోజ్‌ చేసేందుకు యూనియన్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు గురువారం ఆమోదం తెలిపింది.


ఇన్ఫోసిస్: కంపెనీ బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం టెన్నిస్ ఐకాన్ రఫెల్ నాదల్‌ను అంబాసిడర్‌గా ఇన్ఫోసిస్ (Infosys) నియమించుకుంది. బ్రాండ్‌ ప్రమోషన్‌తో పాటు ఇన్ఫోసిస్ డిజిటల్ ఇన్నోవేషన్‌ కోసం కూడా రఫెల్ నాదల్‌ ప్రచారం చేస్తాడు.


హీరో మోటోకార్ప్: ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్‌ సైకిళ్లు & స్కూటర్ల తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp), కొత్త లాంచ్‌కు సిద్ధమైంది. గ్లామర్‌ బండ్ల సిరీస్‌లో "న్యూ గ్లామర్‌"ను (New Glamour) మార్కెట్‌లోకి 
విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.


ఆస్ట్రా మైక్రోవేవ్: DRDO, ఇస్రో, DPSU నుంచి రూ. 158 కోట్ల విలువైన ఆర్డర్‌లను ఆస్ట్రా మైక్రోవేవ్ (Astra Microwave) దక్కించుకుంది. శాటిలైట్ సబ్ సిస్టమ్స్, ఎయిర్‌బోర్న్ రాడార్, రాడార్ & EW ప్రాజెక్ట్‌ల సబ్-సిస్టమ్‌లను ఆయా సంస్థలకు ఆస్ట్రా మైక్రోవేవ్ సరఫరా చేస్తుంది.


ఇది కూడా చదవండి: స్పెషల్‌ పని మీదున్న ఐటీ డిపార్ట్‌మెంట్‌, అది ఓకే అయితే రిఫండ్‌ ప్రక్రియలో భారీ మార్పు!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial