Stock Market Today, 25 April 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 31 పాయింట్లు లేదా 0.17 శాతం గ్రీన్ కలర్‌లో 17,790 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, HDFC AMC. వీటిపై మార్కెట్ దృష్టి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: 2023 మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) నికర లాభం గత ఏడాది ఇదే కాలంలోని రూ. 355 కోట్ల నుంచి రూ. 840 కోట్లకు రెండింతలు పెరిగింది.
టాటా టెలీసర్వీసెస్: మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా టెలీసర్వీసెస్ రూ. 277 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం స్వల్పంగా పెరిగి రూ. 280 కోట్లకు చేరుకుంది.
గోయల్ అల్యూమినియమ్స్: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించిన గోయల్ అల్యూమినియమ్స్, నాలుగో త్రైమాసికానికి రూ. 9 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది, డిసెంబర్ త్రైమాసికంలోని రూ. 19.8 కోట్లతో పోలిస్తే బాగా తగ్గింది.
నెల్కో: మార్చి త్రైమాసికంలో రూ. 5.7 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, ఆదాయం రూ. 82 కోట్లుగా ఉంది.
IIFL సెక్యూరిటీస్: నాలుగో త్రైమాసికంలో రూ. 401 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది, అదే సమయంలో రూ. 86 కోట్ల లాభం మిగిలింది.
సెంచరీ టెక్స్‌టైల్స్: మార్చి త్రైమాసికంలో సెంచురీ టెక్స్‌టైల్స్ రూ. 145 కోట్ల నికర లాభాన్ని, రూ. 1,208 కోట్ల ఆదాయాన్ని నివేదించింది.
మహీంద్ర లాజిస్టిక్స్: ఈ కంపెనీ ఏకీకృత నికర లాభం రూ. 20 లక్షలు కాగా, ఆదాయం రూ. 1,272 కోట్లుగా ఉంది.
ఇండస్ఇండ్ బ్యాంక్: 2023 మార్చి 24 నుంచి అమలులోకి వచ్చేలా, 2 సంవత్సరాల కాలానికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (MD & CEO) సుమంత్ కథ్‌పాలియాను తిరిగి నియమించడాన్ని ఇండస్‌ఇండ్ బ్యాంక్ బోర్డ్ ఆమోదించింది.
మహీంద్ర లైఫ్‌స్పేస్ డెవలపర్స్: ముంబై సబర్బన్‌లో ఒక సొసైటీ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌ను గెలుచుకుంది. ఈ ప్రాజెక్ట్ కంపెనీకి దాదాపు రూ. 850 కోట్ల ఆదాయాన్ని అందిస్తుందని అంచనా.
పూనావాలా ఫిన్‌కార్ప్: పూనవలా ఫిన్‌కార్ప్ రేటింగ్ 'AAA'కి క్రిసిల్ అప్‌గ్రేడ్ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.