Stock Market Today, 23 May 2023: ఇవాళ (మంగళవారం) ఉదయం 7.50 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 25 పాయింట్లు లేదా 0.13 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,360 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: అశోక్ లేలాండ్, NMDC, బయోకాన్, JSW ఎనర్జీ, అమరరాజా బ్యాటరీస్. ఈ షేర్లపై మార్కెట్‌ దృష్టి ఉంటుంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


BPCL: క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనింగ్ మేజర్ BPCL లిమిటెడ్, 2023 మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో ఏకీకృత నికర లాభంలో 168% వృద్ధిని నమోదు చేసి రూ. 6,780 కోట్లకు చేరుకుంది. రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 8% పెరిగి రూ. 1.33 లక్షల కోట్లకు చేరుకుంది.


గ్లాండ్ ఫార్మా: విదేశీ పెట్టుబడి సంస్థ మోర్గాన్ స్టాన్లీ, సోమవారం, ఓపెన్‌ మార్కెట్ లావాదేవీల ద్వారా గ్లాండ్ ఫార్మాలో 0.58% వాటాను విక్రయించింది.


PB ఫిన్‌టెక్: పాలసీబజార్ మాతృ సంస్థ PB ఫిన్‌టెక్, 2022-23 నాలుగో త్రైమాసికంలో నష్టాలను భారీగా తగ్గించి రూ. 8.9 కోట్లకు పరిమితం చేసింది. జనవరి-మార్చి కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన 61% పెరిగి రూ. 869 కోట్లకు చేరుకుంది.


గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్: 2023 జనవరి-మార్చి కాల త్రైమాసికంలో గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ రూ. 71 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆ త్రైమాసికంలో కంపెనీ రూ. 1,138 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.


ITI: 4G రోల్ అవుట్ కోసం BSNL నుంచి రూ. 3,889 కోట్ల విలువైన ముందస్తు ఆర్డర్‌ను ITI దక్కించుకుంది.


స్పెన్సర్: Q4FY23లో స్పెన్సర్ రూ. 61 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 543 కోట్లుగా ఉంది.


JSW స్టీల్: నేషనల్ స్టీల్ అండ్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు సంబంధించి, JSW స్టీల్‌కు చెందిన JSW స్టీల్ కోటెడ్ ప్రొడక్ట్స్ (JSW Steel Coated Products) రిజల్యూషన్ ప్లాన్‌ను NCLT ఆమోదించింది.


ధనలక్ష్మి బ్యాంక్: 2023 మార్చితో ముగిసిన మూడు నెలలకు ధనలక్ష్మి బ్యాంక్ రూ. 38 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఆ త్రైమాసికంలో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 115 కోట్లుగా ఉంది.


శ్రీ సిమెంట్: నాలుగో త్రైమాసికంలో శ్రీ సిమెంట్ రూ.546 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అదే సమయంలో కార్యకలాపాల ద్వారా రూ. 4,785 కోట్ల ఆదాయం వచ్చింది.


ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్: ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభం Q4FY23లో 14% పెరిగి రూ. 262 కోట్లకు చేరుకుంది. సమీక్ష కాల త్రైమాసికంలో NII 13% పెరిగి రూ. 734 కోట్లకు చేరుకుంది.


ఇది కూడా చదవండి: ₹2000 నోట్ల డిపాజిట్లకు పాత రూల్‌ - పరిమితి దాటితే PAN ఇవ్వాల్సిందే


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.