Stock Market Today, 23 June 2023: ఇవాళ (శుక్రవారం) ఉదయం 7.50 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 13 పాయింట్లు లేదా 0.07 శాతం రెడ్‌ కలర్‌లో 18,818 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


ఎరోస్ ఇంటర్నేషనల్: ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా సహా మరో నాలుగు కంపెనీల మీద మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ కొరడా ఝుళిపించింది. ఆ కంపెనీలను సెక్యూరిటీస్‌ మార్కెట్ నుండి తప్పించింది. ట్రేడ్‌ రూల్స్‌కు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై, తదుపరి నోటీసు వచ్చేవరకు వాటిని మార్కెట్లకు దూరంగా ఉంచుతూ SEBI మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


కోఫోర్జ్: కోఫోర్జ్‌ బిజినెస్ ప్రాసెస్ సొల్యూషన్స్‌లో మరో 20 శాతం వాటా కొనుగోలు కోఫోర్జ్‌ చేసింది. ఇదే చివరి విడత పర్చేజ్‌. దీంతో, కోఫోర్జ్‌ బిజినెస్ ప్రాసెస్ సొల్యూషన్స్‌లో కోఫోర్జ్‌ వాటా 80 శాతానికి చేరింది.


LIC హౌసింగ్ ఫైనాన్స్: ప్రభుత్వ రంగంలోని ఈ గృహ రుణ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా త్రిభువన్ అధికారిని (Tribhuwan Adhikari) కంపెనీ నియమించింది.


PNB హౌసింగ్ ఫైనాన్స్: వ్యాపార విస్తరణకు కావలసిన డబ్బు కోసం, రూ. 5000 కోట్ల విలువైన నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను (NCDs) జారీ చేయడానికి కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ ఓకే చెప్పింది. ఈ NCDలను ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, విడతల వారీగా జారీ చేస్తామని, గురువారం బోర్డు సమావేశం తరువాత స్టాక్ ఎక్స్ఛేంజీలకు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ తెలియజేసింది.


BPCL: ఇంధన పరివర్తన, నికర సున్నా కర్బన ఉద్గారాలు, ఇంధన భద్రత లక్ష్యాలను సాధించడానికి అవసరమైన నిధుల సమీకరణ కోసం.. రైట్స్‌ ఇష్యూ సహా క్యాపిటల్‌ ఇన్ఫ్యూషన్ కోసం అవసరమైన వివిధ మార్గాలను పరిశీలించడానికి ఈ నెల 28న BPCL డైరెక్టర్ల బోర్డు సమావేశం జరుగుతుంది.


ONGC: కొత్త పైప్‌లైన్ ద్వారా 3.6 MMSCMD (million Standard Cubic Meters of Gas per day) గ్యాస్ పంపిణీని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ ప్రారంభించింది.


వేదాంత: తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విక్రయానికి సంబంధించిన వార్తలపై వేదాంత (Vedanta) క్లారిటీ ఇచ్చింది. ప్లాంట్‌ను అమ్మేస్తామంటూ కొన్ని మీడియా వర్గాల్లో వస్తున్న వార్తలు తప్పు, ఎలాంటి ఆధారం లేకుండా ఆ వార్తలు రాశారని కంపెనీ ప్రకటించింది.


డెలివెరీ: ప్రమోటర్‌ ఎంటిటీ అయిన కార్లైల్ గ్రూప్, గురువారం, రూ. 710 కోట్ల విలువైన డెలివేరీ షేర్లను విక్రయించింది. ఈ ప్రైవేట్ ఈక్విటీ మేజర్‌కు చెందిన CA స్విఫ్ట్ ఇన్వెస్ట్‌మెంట్స్, 18.4 మిలియన్ షేర్లను, ఒక్క షేరును సగటున రూ. 385.5 చొప్పున మార్కెట్‌లో ఆఫ్‌లోడ్‌ చేసింది.


HDFC: భారతదేశంలోని అతి పెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ HDFC, Radisson Blu బ్రాండ్‌ పేరుతో పని చేస్తున్న రెండు ఘజియాబాద్ ఫైవ్ స్టార్ హోటళ్లు ₹507 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. ఆ లోన్ పోర్ట్‌ఫోలియోను ప్రూడెంట్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీకి HDFC విక్రయించే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల సమాచారం. ప్రూడెంట్ ARC ₹311 కోట్ల బైండింగ్ ఆఫర్‌ ఇచ్చింది. ఆ తర్వాత హోటల్ అసెట్స్‌ కోసం స్విస్ ఛాలెంజ్ వేలాన్ని ప్రారంభమైంది. ప్రూడెంట్ ఇచ్చిన ఆఫర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి 61% రికవరీకి సమానం.


ఇది కూడా చదవండి: ఒకటి కంటే ఎక్కువ ఫామ్‌-16లు ఉంటే ఐటీ రిటర్న్‌ ఎలా ఫైల్ చేయాలి? 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.